పనస పండు తిని డ్రైవింగ్ చేస్తున్నారా? డ్రంక్ డ్రైవ్ లో అరెస్ట్ అవుతారు జాగ్రత్త..!
పనస పండు తినడం అంటే ఇష్టం. ఈ పండు తిన్నాక మాత్రం డ్రైవింగ్ చేయకండి. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉంది. కర్ణాటకలో అదే జరిగింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్..
మద్యం తాగి వాహనాలు నడపడం చట్టారీత్యా నేరం. పోలీసులు కూడా ఎప్పటికప్పుడు రోడ్డుపై తనిఖీలు చేస్తూ ఉంటారు. డ్రైవర్లకు బ్రీథ్ ఎనలైజర్ టెస్టు చేసి.. వారు మద్యం తాగారో లేదో చెక్ చేస్తారు. ఎవరైనా మద్యం తాగినట్లు గుర్తిస్తే.. వారికి తగిన శిక్ష విధిస్తూ ఉంటారు. ఇది చాలా కామన్ గా జరిగే విషయమే. అయితే..కర్ణాటకలో ఒక వింత సంఘటన జరిగింది.
మద్యం తాగకుండానే...
మద్యం తాగకుండానే బ్రీథ్ ఎనలైజర్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. కేఎస్ఆర్టీసీ డ్రైవర్లకు ఇదే జరిగింది. వాళ్లు మద్యం తాగినందుకు కాదు… పనస పండు తినడం వల్ల పాజిటివ్ రావడం గమనార్హం.
కర్ణాటకలో..
పత్తనంతిట్ట జిల్లాలో కెఎస్‌ఆర్‌టీసీ డ్రైవర్లను పోలీసులు తనిఖీ చేశారు. మద్యం తాగకున్నా బ్రీథలైజర్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారు. మెషిన్ 10 రీడింగ్ చూపించింది. డ్రైవర్లు తాము తాగలేదని చెప్పారు.
పనస పండు...
డ్రైవర్లు పోలీసులతో "మేము మద్యం తాగలేదు, కానీ కొంత సమయం క్రితం పనసపండు తిన్నాం అని చెప్పారు. అందుకే టెస్ట్ రీడింగ్ సరిగ్గా లేదు.
పనస పండు తినడం వల్లే...
మొదటి టెస్ట్ సరిగ్గానే వచ్చింది, కానీ పనసపండు తిన్న తర్వాత చేసిన టెస్ట్ ఫెయిల్ అయ్యింది. పనస పండు తర్వాత నోటిలో ఇథనాల్ ఉండటం వల్ల ఇలా జరుగుతుందని గుర్తించారు.
మద్యం తాగకపోయినా...
కొన్ని పండిన లేదా పులిసిన ఆహారాలు మద్యం తాగకున్నా బ్రీథ్ ఎనలైజర్ టెస్ట్‌లో పాజిటివ్ చూపిస్తాయి.