Drinking Tea: ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా?
ఉదయాన్నే టీ తాగకపోతే చాలామందికి ఏం తోచదు. ఫస్ట్ ఓ కప్ టీ కడుపులో పడ్డాకే రోజువారి పనులు స్టార్ట్ చేస్తారు. కానీ ఖాళీ కడుపుతో టీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? నిపుణులు ఏమంటున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

ఉదయాన్నే టీ తాగడం చాలామందికి అలవాటు ఉంటుంది. ఒక కప్పు టీతో రోజును ప్రారంభించాలని అనుకుంటారు. కొందరు రోజంతా టీ తాగుతూ కూడా ఉంటారు. అయితే, ఎక్కువగా టీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
ఖాళీ కడుపుతో టీ తాగొచ్చా?
నిపుణుల ప్రకారం టీ, కాఫీలో కెఫీన్ ఉంటుంది. కాబట్టి తక్కువ మోతాదులో టీ, కాఫీ తాగాలని సూచిస్తున్నారు. రాత్రి పడుకునే ముందు టీ, కాఫీ తాగకూడదు. దీనివల్ల సరిగ్గా నిద్రపోలేరు. ఉదయం ఖాళీ కడుపుతో కూడా టీ తాగకూడదు. టీ తాగడానికి ఒక సమయం, నియమం ఉంది. ఇది కొందరికి మాత్రమే తెలుసు. కానీ చాలామంది ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగడానికి ఇష్టపడతారు. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కలిగే నష్టాల గురించి ఇక్కడ చూద్దాం.
నీరసం:
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగితే రోజంతా హుషారుగా ఉంటారని చాలా మంది అనుకుంటారు. కానీ అది తప్పు. దీనికి విరుద్ధంగా, రోజంతా నీరసంగా ఉంటారు, చిరాకు వస్తుంది.
అల్సర్ వస్తుంది:
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగితే వికారం వస్తుంది. ఇది కాకుండా అల్సర్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఖాళీ కడుపుతో టీ తాగకూడదని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది:
ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల కడుపులో ఉండే మంచి బ్యాక్టీరియా దెబ్బతింటుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. కాబట్టి ఖాళీ కడుపుతో టీ తాగడం మానేయండి.
మూత్ర సమస్య:
ఖాళీ కడుపుతో టీ తాగితే మూత్ర సమస్య వస్తుంది. టీలో ఉండే డ్యూరెటిక్ మూత్ర విసర్జన ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది.
జీర్ణ సమస్యలు:
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగితే జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కాకుండా ఎసిడిటీ, నోటి దుర్వాసన కూడా వస్తాయి.
ఇతర ప్రభావాలు:
ఉదయం ఖాళీ కడుపుతో టీ తాగితే శరీరంలో పోషకాలు గ్రహించబడవు. దీనివల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందకుండా పోతాయి. పళ్లు పాడవుతాయి, గుండెల్లో మంట వస్తుంది. జీవక్రియను ప్రభావితం చేస్తుంది.