MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Ration Rice: రేషన్ బియ్యంలో...ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారా ? అవి తింటే ఏమౌతుంది?

Ration Rice: రేషన్ బియ్యంలో...ప్లాస్టిక్ బియ్యం కలుపుతున్నారా ? అవి తింటే ఏమౌతుంది?

Ration Rice: పేదలకు ప్రభుత్వం రేషన్ బియ్యం ప్రతి నెలా అందిస్తుంది. అయితే.. ఆ బియ్యంలో కొన్ని స్పెషల్ బియ్యాలు కనిపిస్తున్నాయా? అవి ప్లాస్టిక్ బియ్యమా? వాటిని తినడం మంచిదేనా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 09 2026, 02:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
రేషన్ బియ్యం..
Image Credit : our own

రేషన్ బియ్యం..

Ration Rice: ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు పంపిణీ చేసే బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం లాంటి గింజలు కనిపిస్తున్నాయని చాలా మంది భయపడుతుంటారు. కానీ... అవి నిజంగా ప్లాస్టిక్ బియ్యమేనా? అవి తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయా? నిపుణులు ఏం చెబుతున్నారు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...

రేషన్ బియ్యంలో కనపడుతున్న స్పెషల్ బియ్యం ప్లాస్టిక్ బియ్యం కాదు, వాటిని ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ అని అంటారు. మరి వాటిని ఎందుకు కలుపుతున్నారు?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.ఫోర్టిఫైడ్ కెర్నల్స్ అంటే ఏమిటి?
Image Credit : Getty

1.ఫోర్టిఫైడ్ కెర్నల్స్ అంటే ఏమిటి?

సాధారణ బియ్యాన్ని పిండిగా చేసి, ఆ పిండికి మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలను కలిపి, మళ్లీ యంత్రాల ద్వారా బియ్యం గింజ ఆకారంలోనే తయారు చేస్తారు. వీటినే ఫోర్టిఫైడ్ కెర్నల్స్ అంటారు. వీటిని సాధారణ బియ్యంతో 1:100 నిష్పత్తిలో కలుపుతారు. అంటే...100 కిలోల సాధారణ బియ్యంలో 1 కిలో ఫోర్టిఫైడ్ బియ్యం కలుపుతారని అర్థం.

2.ప్రభుత్వం వీటిని ఎందుకు కలుపుతుంది?

మన దేశంలో చాలా మంది మహిళలు, చిన్న పిల్లలు రక్తహీనత, పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. సాధారణంగా మనం వాడే పాలిష్ చేసిన తెల్ల బియ్యంలో కార్బో హైడ్రేట్లు తప్ప విటమిన్లు ఉండవు. అందరికీ విడివిడిగా విటమిన్ టాబ్లెట్లు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి, రోజూ తినే అన్నం ద్వారానే పోషకాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Related Articles

Related image1
Dosa: దోశకు పప్పు, బియ్యం ఇలా రుబ్బుతున్నారా? మీరు చేసే అతి పెద్ద తప్పు ఇదే
Related image2
Chicken: వారానికి ఎన్నిరోజులు చికెన్ తినాలి? ఇలా తింటే మాత్రం చాలా ప్రమాదం..!
33
3.ఈ బియ్యంలో ఏముంటాయి..?
Image Credit : Getty

3.ఈ బియ్యంలో ఏముంటాయి..?

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ బియ్యంలో ప్రధానంగా మూడు రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి12 ఉంటాయి. ఐరన్ లో రక్తహీనతను తగ్గిస్తుంది. ఫోలిక్ యాసిడ్ రక్త కణాల ఉత్పత్తికి, గర్భిణీలకు అవసరం. విటమిన్ బి12 నాడీ వ్యవస్థ పనితీరుకు ముఖ్యం.

4.వీటిని తింటే ఏమౌతుంది? ఆరోగ్యానికి మంచిదా?

ఖచ్చితంగా ఇవి ఆరోగ్యానికి మంచివే. వీటిని తినడం వల్ల శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలు అందుతాయి. పిల్లల్లో పెరుగుదల బాగుంటుంది. నీరసం, అలట కూడా తగ్గుతాయి. శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఈ బియ్యం ఎవరు తినకూడదు..?

తలసేమియా, సికిల్ సెల్ ఎనిమియా వంటి వ్యాధులు ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవాలి. ఎందుకంటే, వీరి శరీరంలో ఇప్పటికే ఐరన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

ఈ బియ్యాన్ని ఎలా తినాలి..?

బియ్యం కడిగేటప్పుడు ఇవి నీటిపై తేలుతూ కనిపిస్తాయి. అయితే.. అవి ప్లాస్టిక్ అని భయపడి పారేయకండి. వాటిలోనే అసలైన పోషకాలు ఉంటాయి. వాటిని కూడా కలిపి వండుకోవాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
రోజూ ఒక పెగ్ ఆల్కహాల్ తాగితే గుండెకు మంచిదా? అసలు నిజమేంటి?
Recommended image2
Milk at Night: రాత్రి పడుకునే ముందు పాలు తాగితే నిజంగా నిద్ర బాగా పడుతుందా?
Recommended image3
Mangalsutra Designs: ఆఫీసుకు వెళ్లే మహిళలు మెచ్చే మంగళసూత్రం డిజైన్లు
Related Stories
Recommended image1
Dosa: దోశకు పప్పు, బియ్యం ఇలా రుబ్బుతున్నారా? మీరు చేసే అతి పెద్ద తప్పు ఇదే
Recommended image2
Chicken: వారానికి ఎన్నిరోజులు చికెన్ తినాలి? ఇలా తింటే మాత్రం చాలా ప్రమాదం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved