MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Food
  • Dosa: దోశకు పప్పు, బియ్యం ఇలా రుబ్బుతున్నారా? మీరు చేసే అతి పెద్ద తప్పు ఇదే

Dosa: దోశకు పప్పు, బియ్యం ఇలా రుబ్బుతున్నారా? మీరు చేసే అతి పెద్ద తప్పు ఇదే

Dosa: ఇంట్లోనే దోశలు వేస్తున్నారా? తెలిసీ తెలియక మీరు చేసే కొన్ని తప్పుల కారణంగా మీరు ఎంతో హెల్దీ అనుకునే దోశ మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని మీకు తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 09 2026, 01:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Dosa Making Tips
Image Credit : Pinterest

Dosa Making Tips

చాలా మంది ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ లో దోశ ముందు ఉంటుంది. అంతేకాదు.. దోశలు వేయడం చాలా సింపుల్ కదా అని ఇంట్లోనే చేసేసుకుంటూ ఉంటారు. కానీ, ఈ దోశ విషయంలో ఎక్కువ మంది చాలా తప్పులు చేస్తుంటారు. ఆ తప్పులు చేస్తున్నాం అని తెలికుండానే చేస్తుంటారు. కానీ.. వాటి కారణంగా.. మీరు తినే దోశ మీ ఆరోగ్యాన్ని చాలా దెబ్బతీస్తుందని మీకు తెలుసా? మరి, ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
1.దోశ పిండి తయారీ...
Image Credit : Getty

1.దోశ పిండి తయారీ...

దోశ వేయడానికి ముందు పప్పులు, బియ్యాన్ని రుబ్బి పులియబెట్టాలి. చాలా మంది ఈ ప్రక్రియలోనే ఎక్కువగా తప్పులు చేస్తారు. పిండి రుబ్బుకున్న తర్వాత ఎక్కువ సేపు వెచ్చని ప్రదేశంలో లేదా బయట ఉంచడం వల్ల ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా కూడా పెరిగి, దుర్వాసన రావడానికి కారణం అవుతుంది. ఎండాకాలంలో పిండి తొందరగా పులిసిపోతుంది. అదే.. శీతాకాలంలో అయితే.. దీనికి ఎక్కువ సమయం పట్టొచ్చు. కాబట్టి.. సీజన్ ని పట్టి.. పిండిని ఎంత సేపు పులియబెడుతున్నాం అనే విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎండాకాలంలో దోశ పిండిని 6 నుంచి 8 గంటలకు మించి బయట ఉంచకూడదు. చలికాలంలో 12 ఉంచినా పర్వాలేదు. ఈ చిన్న విషయం తెలియకపోతే దోశలు రుచిగా రావు.

Related Articles

Related image1
Paneer: ఆరోగ్యానికి మంచిదని రోజూ పన్నీర్ తింటున్నారా? వీళ్లు మాత్రం అస్సలు తినకూడదు..!
Related image2
Chicken: వారానికి ఎన్నిరోజులు చికెన్ తినాలి? ఇలా తింటే మాత్రం చాలా ప్రమాదం..!
34
దోశలో బంగాళదుంప కూర స్టఫ్..
Image Credit : Getty

దోశలో బంగాళదుంప కూర స్టఫ్..

మసాలా దోశలో బంగాళదుంపలను కూరను పెడతారు. కానీ చాలా మందికి తాము ఏ రకమైన బంగాళదుంపలను వాడుతున్నారనే దానిపై శ్రద్ధ పెట్టరు. మొలకెత్తిన లేదా అక్కడక్కడ పచ్చగా కనిపించే బంగాళదుంపలను కూర కోసం వాడకూడదు. అలాంటి బంగాళదుంపలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. అదేవిధంగా ఈ కూరను కూడా ఎక్కువ సేపు గది ఉష్ణోగ్రతలో ఉంచకూడదు. ఎందుకంటే, ఉడికించిన బంగాళదుంపలు త్వరగా పాడైపోతాయి. ఫుడ్ పాయిజనింగ్ కి కూడా కారణం అవుతాయి.

44
బియ్యం, పప్పు నాణ్యత...
Image Credit : Instagram

బియ్యం, పప్పు నాణ్యత...

దోశ కోసం బియ్యం, పప్పులను కొనుగోలు చేసేటప్పుడు అవి మరీ పాతవి కాకుండా చూసుకోండి. ఎందుకంటే.. మరీ పాతవి ఎంచుకోవడం వల్ల వాటిపై బ్యాక్టీరియా పేరుకుపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా.. చాలా మంది బయట రెడీగా తయారు చేసి ఉన్న దోశ పిండి కొని తెచ్చుకొని ఇంట్లో దోశలు చేసుకుంటూ ఉంటారు. వాటిలో వాళ్లు నాణ్యమైన పప్పు, బియ్యం కలపకపోవచ్చు. కాబట్టి.. ఇంట్లో మీరే స్వయంగా పిండి తయారు చేసుకోవడం మంచిది. ఇక.. మీరు రుబ్బుకున్న పిండి పులుపు వాసన వస్తే అలాంటి పిండిని పారేయడమే మంచిది.

నాన్-స్టిక్ కోటింగ్‌ను తనిఖీ చేయండి

మీరు దోశలు వేయడానికి నాన్‌స్టిక్ పాన్ ఉపయోగిస్తుంటే, దాని కోటింగ్‌ను తప్పకుండా తనిఖీ చేయండి. టెఫ్లాన్ కోటింగ్ ఊడిపోతుంటే, వేడి చేసినప్పుడు అది మీరు వేసే దోశలోకి రసాయనాలను విడుదల చేసే అవకాశం ఉంది, ఇది ఆరోగ్యానికి హానికరం. అందువల్ల, నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా ఐరన్ పాన్ లేదా పూర్తిగా చెక్కుచెదరని కోటింగ్ ఉన్న నాన్‌స్టిక్ పాన్‌ను ఉపయోగించడానికి ప్రయత్నించండి.

నూనె, నీటి స్వచ్ఛత

దోసె పిండిలో కలిపే నీరు, దోశ వేయడానికి ఉపయోగించే నూనె స్వచ్ఛమైన వాటిని మాత్రమే ఉపయోగించాలి. దోసె పిండిని ఎల్లప్పుడూ శుభ్రమైన నీటితోనే కలపండి. వాడే నూనె కూడా మంచిదై ఉండాలి. లేకపోతే.. ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sugar Alternative: పంచదారకు బదులు ఇది వాడండి..కంట్రోల్ లో షుగర్ లెవల్
Recommended image2
Pachimirchi Kodi Vepudu: వీకెండ్ సెట్ అవ్వాలంటే ఈ నాన్ వెజ్ రెసిపీ ఉండాల్సిందే
Recommended image3
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Related Stories
Recommended image1
Paneer: ఆరోగ్యానికి మంచిదని రోజూ పన్నీర్ తింటున్నారా? వీళ్లు మాత్రం అస్సలు తినకూడదు..!
Recommended image2
Chicken: వారానికి ఎన్నిరోజులు చికెన్ తినాలి? ఇలా తింటే మాత్రం చాలా ప్రమాదం..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved