MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Black Hair: షాంపూలో ఈ నూనె కలిపి తలకు పట్టిస్తే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది

Black Hair: షాంపూలో ఈ నూనె కలిపి తలకు పట్టిస్తే తెల్ల జుట్టు నల్లగా మారిపోతుంది

Black Hair: తెల్ల జుట్టును నల్లగా మార్చుకునేందుకు రసాయనాలు కలిపిన రంగులు వాడుతున్నారా? దానికి బదులు కలోంజి నూనెను షాంపూలో కలిపి తలకు పట్టిస్తే చాలు వెంట్రుకలు సహజంగానే నల్లగా మారుతుంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 11 2026, 07:37 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెల్లజుట్టుతో టెన్షన్ వద్దు
Image Credit : Gemini AI

తెల్లజుట్టుతో టెన్షన్ వద్దు

చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చి ఎంతో మందికి ఇబ్బందిగా మారుతోంది.  దీంతో హెయిర్ డై, కలర్ షాంపూలు, ఖరీదైన ట్రీట్‌మెంట్లు చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఇవి జుట్టు ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. అలాగే డబ్బు కూడా అధికంగా ఖర్చువుతుంది. తెల్లజుట్టు మొదలవుతున్న మొదటి రోజుల్లోనే జాగ్రత్తలు తీసుకుంటే మొత్తం జుట్టు తెల్లగా మారకుండా అడ్డుకోవచ్చు. దీనికోసం మీ షాంపూలో ఒక నూనె కలిపితే చాలు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కలోంజి నూనెతో ఎంతో ఉపయోగం
Image Credit : pinterest

కలోంజి నూనెతో ఎంతో ఉపయోగం

కలోంజి అంటే బయట దొరికే నల్ల జీలకర్రలు.  వీటిని ఉపయోగించి జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. వాడే షాంపూలో కొన్ని చుక్కల కలోంజి నూనె కలపాలి. ఈ నూనెను శతాబ్దాలుగా జుట్టు సంరక్షణ కోసం మన పూర్వీకులు వాడుతూనే ఉన్నారు. ఇది జుట్టుకు రంగు వేయదు, కానీ తల చర్మానికి  వెంట్రుకల కుదుళ్లకు పోషణ అందిస్తుంది. తద్వారా జుట్టును మొదళ్ల నుంచి నల్లగా మార్చేందుకు ప్రయత్నిస్తుంది.

Related Articles

Related image1
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Related image2
Moon Transit: పరమ ఏకాదశి నుంచి చంద్రుడి వల్ల ఈ 4 రాశుల వారి జీవితమే మారిపోతుంది..ఆకస్మిక ధనలాభం
34
కొత్త జుట్టు పెరుగుతుంది
Image Credit : stockPhoto

కొత్త జుట్టు పెరుగుతుంది

జుట్టులో సహజంగా ఉండే బ్లాక్ పిగ్మెంట్ ఉత్పత్తి తగ్గడం వల్లే తెల్ల జుట్టు సమస్య వస్తుంది ఒత్తిడి, పోషకాహార లోపం, తల చర్మం ఆరోగ్యంగా లేకపోవడం వల్ల తెల్లజుట్టు చిన్న వయసులోనే రావచ్చు. కలోంజి నూనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్లు తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనివల్ల కొత్తగా పెరిగే జుట్టు నాణ్యంగా ఉంటుంది.

దీన్ని ఎలా వాడాలంటే  షాంపూను చేతిలోకి వేసుకోండి. అందులో 2 నుంచి 4 చుక్కల కలోంజి నూనె కలపండి. రెండింటినీ బాగా కలిపి తల చర్మానికి, జుట్టు కుదుళ్లకు పట్టించండి. 1 నుంచి 2 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత మామూలుగా తలస్నానం చేయండి. కానీ షాంపూ బాటిల్ లో మాత్రం నూనె కలుపుకుని ఉంచకండి. దీని వల్ల షాంపూ పాడయ్యే అవకాశం ఉంది.

44
నెల రోజుల్లో మంచి ఫలితం
Image Credit : gemini AI

నెల రోజుల్లో మంచి ఫలితం

ఫలితం కనిపించాలంటే వారానికి 2 నుంచి 3 సార్లు ఇలా వాడాలి.  జుట్టు నెమ్మదిగా పెరుగుతుంది. మంచి ఫలితం కనిపించడానికి కనీసం 4 నుంచి 6 వారాల సమయం పట్టొచ్చు. కలోంజి నూనె తెల్ల జుట్టును రాత్రికి రాత్రే నల్లగా మార్చదు. క్రమం తప్పకుండా వాడటం వల్ల జుట్టు బలంగా, మృదువుగా, పొడిబారకుండా ఉంటుంది. కొంతమందిలో తెల్ల జుట్టు మెరుపు తగ్గి, మిగతా జుట్టులో సులభంగా కలిసిపోతుంది. 

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
సౌందర్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Earrings: 14 క్యారెట్లతో అదిరిపోయే ట్రెండీ వెస్ట్రన్ చెవిపోగులు
Recommended image2
Silver Jewelry: తల నుంచి పాదాల దాకా జిగేలుమనే ట్రెండీ సిల్వర్ నగలు
Recommended image3
Silver Jewelry: ఈసారి పెళ్లిళ్లలో ఇలాంటి వెండి నగలతో మెరిసిపోండి
Related Stories
Recommended image1
Rajinikanth: రజినీకాంత్‌ను బిచ్చగాడనుకొని 10 రూపాయలు వేసిన మహిళ.. రజినీ రియాక్షన్ ఇదే
Recommended image2
Moon Transit: పరమ ఏకాదశి నుంచి చంద్రుడి వల్ల ఈ 4 రాశుల వారి జీవితమే మారిపోతుంది..ఆకస్మిక ధనలాభం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved