MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Chicken skin: చికెన్ స్కిన్ తినడం అంత ప్రమాదకరమా? తింటే వచ్చే సమస్యలేంటి?

Chicken skin: చికెన్ స్కిన్ తినడం అంత ప్రమాదకరమా? తింటే వచ్చే సమస్యలేంటి?

Chicken skin: నాన్ వెజ్ ప్రియులకు చికెన్ చాలా ఇష్టం. చాలా మంది స్కిన్ తో కూడిన చికెన్ తినేందుకు ఇష్టపడతారు. కానీ చికెన్ స్కిన్ తో తినడం వల్ల ఏం జరుగుతుందో చాలా మందికి అవగాహన లేదు. చికెన్ స్కిన్ వల్ల కొన్ని రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 17 2026, 11:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చికెన్ స్కిన్ తినవచ్చా?
Image Credit : Getty

చికెన్ స్కిన్ తినవచ్చా?

నాన్ వెజ్ ప్రియులు అధికంగా తినేది చికెన్ వంటకాలే. ఎంతోమందికి ఇష్టమైన ఆహారాలన్నీ చికెన్‌తోనే తయారవుతాయి. ఇక గ్రిల్ చేసిన చికెన్ అంటే పడి పడి తింటారు. గ్రిల్ చేసిన చికెన్‌లో పైన ఉన్న స్కిన్ తీయకుండా వండుతారు. అలాగే చాలామంది కూడా ఇంటిదగ్గర స్కిన్ తోనే చికెన్ ముక్కలను వండి తింటారు. ఇలా చికెన్ స్కిన్ తినడం ఆరోగ్యానికి మంచిదా? లేకపోతే ప్రమాదకరమా? అనే సందేహం మాత్రం ఎంతో మందిలో ఉంది. నిపుణులు చెబుతున్న ప్రకారం చికెన్ స్కిన్ తినకపోవడమే మంచిది. ఎందుకంటే దీనిలో కొవ్వు శాతం విపరీతంగా ఉంటుంది. అది సాచురేటెడ్ ఫ్యాట్. చికెన్ స్కిన్‌ను అధికంగా తింటే శరీరానికి ఈ కొవ్వు హానికరంగా మారుతుంది. ఎప్పుడో రెండు మూడు నెలలకు ఒకసారి తింటే పెద్దగా సమస్య కాకపోవచ్చు.. కానీ తరచూ తినే అలవాటు ఉంటే వెంటనే మానేయడం ఉత్తమం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎలాంటి సమస్యలు వస్తాయి?
Image Credit : Getty

ఎలాంటి సమస్యలు వస్తాయి?

చికెన్ స్కిన్ తినడం వల్ల ప్రధానంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇందులో ఉండే అధిక కొవ్వు రక్తంలో చేరిపోయి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేస్తుంది. దీని వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకు పోతుంది. గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చేస్తాయి. అలాగే బీపీ కూడా పెరిగిపోతుంది. ఇప్పటికే గుండె సమస్యలు ఉన్నవారు లేదా అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు చికెన్ స్కిన్ తినకూడదు.

34
బరువు పెరుగుతారు
Image Credit : Getty

బరువు పెరుగుతారు

చికెన్ స్కిన్ ఎక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. దీనివల్ల త్వరగా బరువు పెరిగిపోతారు. ఇక ఫాస్ట్ ఫుడ్2లో ఉండే ఫ్రైడ్ చికెన్‌లో స్కిన్ నూనెను అధికంగా పీల్చేస్తుంది. అప్పుడు దాన్ని తినడం వల్ల కేలరీలు రెట్టింపు స్థాయిలో శరీరంలో చేరుతాయి. ఇది ఊబకాయానికి కారణం అవుతుంది. అధిక బరువు వల్ల డయాబెటిస్, థైరాయిడ్, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు కూడా వచ్చి పడతాయి. కాబట్టి వీలైనంత వరకు చికెన్ స్కిన్ ను తినకపోవడమే ఉత్తమం.

44
నిషేధిత పదార్థం మాత్రం కాదు
Image Credit : Getty

నిషేధిత పదార్థం మాత్రం కాదు

అలాగని చికెన్ స్కిన్ పూర్తిగా నిషేధిత పదార్థం అని చెప్పడం లేదు. అప్పుడప్పుడు గ్రిల్ లేదా బ్రేక్ చేసిన చికెన్ స్కిన్ తింటే పర్వాలేదు.. ప్రతివారం తినే అలవాటు ఉంటే మానుకోండి. రెండు మూడు నెలలకు ఒకసారి తింటే పెద్దగా సమస్య రాదు. అయితే పిల్లలు, వృద్దులు, ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో ఉన్నవారికి మాత్రం చికెన్ స్కిన్ పెట్టడం ఏమాత్రం మంచిది కాదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Lunch Box Recipes: నిమిషాల్లో తయారయ్యే లంచ్ బాక్స్ రెసిపీలు.. టేస్ట్ అదుర్స్!
Recommended image2
Sarees: ఎవరికైనా నప్పే టాప్ ట్రెండింగ్ చీరలు ఇవిగో
Recommended image3
Gold Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే బంగారు నల్లపూసలు
Related Stories
Recommended image1
Janhvi Kapoor: పదిహేనేళ్లకే అలాంటి సైట్‌లో జాన్వీ ఫోటోలు.. చూసి ఏడ్చిన హీరోయిన్
Recommended image2
Personality test: మీ ముందు ఎవరైనా ఇలా కాలు మీద కాలేసి కూర్చుంటున్నారా? వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved