MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Janhvi Kapoor: పదిహేనేళ్లకే అలాంటి సైట్‌లో జాన్వీ ఫోటోలు.. చూసి ఏడ్చిన హీరోయిన్

Janhvi Kapoor: పదిహేనేళ్లకే అలాంటి సైట్‌లో జాన్వీ ఫోటోలు.. చూసి ఏడ్చిన హీరోయిన్

Janhvi Kapoor: జాన్వి కపూర్.. శ్రీదేవి కూతురుగా మొదట గుర్తింపు పొందింది. తర్వాత సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. కానీ 15 ఏళ్ల వయసులో తన జీవితం లో జరిగిన ఘటనను మాత్రం ఇప్పటికీ మర్చిపోలేక ఇబ్బంది పడుతోంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 17 2026, 09:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పదిహేనేళ్ల వయసులో అవమానం
Image Credit : JanhviKapoor/Instagram

పదిహేనేళ్ల వయసులో అవమానం

శ్రీదేవి కూతురుగా జాన్వీ కపూర్‌కు ఎంతో గుర్తింపు ఉంది. కేవలం తల్లి పేరుతో వచ్చిన గుర్తింపునే కాదు.. తన సొంత గుర్తింపును కూడా సాధించింది జాన్వి. ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన ట్రోలింగ్ గురించి మాట్లాడింది. అందులో ముఖ్యంగా తనకు 15 ఏళ్ల వయసులో జరిగిన ఘటనను ఇప్పటికీ మర్చిపోలేనని ఆమె చెప్పింది. తాను ఒక స్కూల్లో చదువుతున్నప్పుడు ఒక అశ్లీల వెబ్ సైట్లో తన ఫోటోలను మార్ఫింగ్ చేసి పెట్టారని వివరించింది. ఆ క్షణం తనకు విపరీతమైన బాధ కలిగిందని చెప్పింది జాన్వి. ఆ ఘటనను ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
స్నేహితుల జాన్వీ ఫోటోలు చూసి
Image Credit : JanhviKapoor/Instagram

స్నేహితుల జాన్వీ ఫోటోలు చూసి

తాను చదివిన పాఠశాలలో కంప్యూటర్ క్లాసులు జరిగేవని,ఆ సమయంలో క్లాసులోని అబ్బాయిలు అడల్ట్ సైట్లను సందర్శించే వారని చెప్పింది. ఒక సైట్లో తన ఫోటోలు చాలా అశ్లీలంగా మార్ఫింగ్ చేసి కనిపించాయని వివరించింది. స్కూల్లోనే అలాంటి ఘటన జరగడంతో తాను తట్టుకోలేకపోయాను అని చెప్పింది జాన్వీ. అది డీప్ ఫేక్ అవునో కాదో తనకు తెలియదని.. కానీ అలాంటి ఒక సైట్లో నా ఫోటోలు చూడడం చాలా కష్టంగా అనిపించిందని, దాని గురించి తన క్లాసులో స్నేహితులు పదేపదే అడగడం కూడా ఎంతో ఇబ్బంది గురి చేసిందని ఆమె వివరించింది. సంవత్సరాలు గడిచినా కూడా ఆ విషయం ఇంకా తనను వెంటాడుతూనే ఉందని..తాను ఎప్పుడూ వేసుకోని దుస్తులలో లేదా ఎప్పుడూ తాను పెట్టని పోజు లేదా భంగిమలో ఉన్న ఫోటోలు తనను చాలా ఇబ్బంది పెట్టాయంటూ జాన్వి కపూర్ తన మనసులోని బాధను పంచుకుంది.

34
దర్శకులతో సమస్యలు రావచ్చు
Image Credit : JanhviKapoor/Instagram

దర్శకులతో సమస్యలు రావచ్చు

ఇలాంటి ఫేక్ చిత్రాలు తన వృత్తిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని జాన్వీ చెప్పింది. ఇది ఒక రకమైన అభిప్రాయాన్ని ఇతరులకు కలిగిస్తుందని వివరించింది. ‘రేపు ఎప్పుడైనా నేను ఏదైనా దుస్తులు వేసుకోవడానికి సౌకర్యంగా లేదని దర్శకుడికి చెడితే.. అతడు ఈ ఫోటోలను చూపించి నువ్వు ఇదివరకు ఇలాంటివి వేశావు కదా అని అనవచ్చు.. అప్పుడు నేను ఏం మాట్లాడాలి’ అంటూ బాధతో చెప్పింది జాన్వీ. కానీ ఆ ఘటనను మర్చిపోలేకపోతున్నానని, ఆ క్షణంలో తాను ఎంతో ఏడ్చానని చెప్పింది.

44
పెద్దితో వస్తున్న జాన్వీ
Image Credit : JanhviKapoor/Instagram

పెద్దితో వస్తున్న జాన్వీ

ప్రస్తుతం జాన్వీకపూర్ సినిమాలపరంగా దూసుకెళ్తోంది. వరుసపెట్టి సినిమాలు చేస్తోంది. నెగెటివిటీని పట్టించుకోవడం మానేసింది. కానీ 15 ఏళ్ల వయసులో జరిగిన ఆ ఘటనను మాత్రం మర్చిపోలేకపోతోంది. ఆమె ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి పెద్ది సినిమాలో నటిస్తోంది. ఇది ఏప్రిల్ 30న థియేటర్లలోకి రానుంది. గతంలో కూడా దేవరా సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించింది జాన్వి. ఇప్పటికే ఆమె అందానికి, డాన్స్ కు మంచి మార్కులే ఇచ్చారు తెలుగు ప్రేక్షకులు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
జాన్వీ కపూర్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: తీశావులే బోడి బాహుబలి అంటూ.. రాజమౌళిని అవమానించింది ఎవరో తెలుసా? హీరో నాని చెప్పిన సీక్రెట్..
Recommended image2
Nagarjuna: హలో బ్రదర్ సినిమాలో నాగార్జున డూప్ గా నటించిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఎలా ఒప్పుకున్నాడంటే?
Recommended image3
Love Story Movies: గర్ల్ ఫ్రెండ్ తో ఎప్పుడూ గొడవలేనా.. అయితే ఈ 6 సినిమాలు తప్పకుండా చూడాల్సిందే
Related Stories
Recommended image1
Saturn Effects: శని నక్షత్ర స్థానం మార్పు.. ఈ 4 రాశుల వారికి నెల రోజులు ఆర్థిక నష్టం తప్పకపోవచ్చు
Recommended image2
Personality test: మీ ముందు ఎవరైనా ఇలా కాలు మీద కాలేసి కూర్చుంటున్నారా? వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved