MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Food
  • Tomato Chutney: గారెలకు కొబ్బరి, పల్లీ చట్నీ కాదు..ఇది ట్రై చేయండి..వారెవ్వా అనకుండా ఉండరు

Tomato Chutney: గారెలకు కొబ్బరి, పల్లీ చట్నీ కాదు..ఇది ట్రై చేయండి..వారెవ్వా అనకుండా ఉండరు

Tomato Chutney: గారెలనగానే గుర్తొచ్చేది కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ. ఎప్పుడూ అదే రుచితో బోర్ కొట్టిందా? ఈసారి డిఫరెంట్‌గా ఈ చట్నీ ట్రై చేయండి. గారెలతో ఈ కాంబినేషన్ రుచి చూస్తే మళ్లీ మళ్లీ అడుగుతారు. తక్కువ పదార్థాలతో, తక్కువ టైంలో రెడీ అయిపోతుంది.  

1 Min read
Author : Nandini Arava
Published : May 30 2026, 04:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గారెలకైతే అద్బుతః
Image Credit : chatgpt

గారెలకైతే అద్బుతః

ఇంట్లో టిఫిన్ కు గారెలు, బోండాలు, ఇడ్లీ, దోసెలు, పెసరట్టు...ఇలా చేసుకుంటూ ఉంటాం. ప్రతి వాటికి ఎప్పటిలానే కొబ్బరి చట్నీనో, పల్లి చట్నీనో, ఉల్లి చట్నీనో చేసుకుంటాం. రోటీన్ గా చేసుకునే ఈ చట్నీలు తిని తిని బోర్ కొట్టిందా? అయితే ఈ సారి ఈ టమాట చట్నీ ట్రై చేయండి. నోట్లో వేసుకోగానే పుల్లపుల్లగా, కారంగా,...యమ టేస్టీగా ఉంటుంది. గారెలకైతే అద్బుతః.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కావలసిన పదార్థాలు
Image Credit : chatgpt

కావలసిన పదార్థాలు

టమాటాలు – 3

ఉల్లిపాయలు – 2

ఎండుమిర్చి – 6

వెల్లుల్లి రెబ్బలు – 5

చింతపండు – చిన్న ముక్క

ఉప్పు – తగినంత

నూనె – 2 టేబుల్ స్పూన్లు

తాలింపు కోసం:

ఆవాలు – 1/2 టీ స్పూన్

జీలకర్ర – 1/2 టీ స్పూన్

కరివేపాకు – కొద్దిగా

ఎండుమిర్చి – 2

34
రెసిపీ చూద్దాం.
Image Credit : chatgpt

రెసిపీ చూద్దాం.

పాన్‌లో నూనె వేసి ఎండుమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తర్వాత టమాటా ముక్కలు, చింతపండు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.

చల్లారిన తర్వాత ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. మరో పాన్‌లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు చేసి చట్నీలో కలపాలి. అంతే టమాట చట్నీ రెడీ.

44
వారెవ్వా అనాల్సిందే
Image Credit : Getty

వారెవ్వా అనాల్సిందే

కరకరలాడే గారెల రుచికి టమాటా-ఉల్లిపాయల పులుపు, కారంతో ఈ చట్నీ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి రుచి చూస్తే కొబ్బరి, పల్లీ చట్నీలను మర్చిపోయేంత టేస్ట్ ఉంటుంది. వేడి వేడి దిబ్బరొట్టేకు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేస్తే వారెవ్వా అనాల్సిందే.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
ఆహారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Breakup Food: బ్రేకప్ తర్వాత ఐస్‌క్రీమ్‌నే ఎక్కువగా తింటారంట..ఎందుకో తెలుసా?
Recommended image2
Clean Greasy Non-Stick Pan: నాన్‌స్టిక్ పాన్ అంచులకు పట్టిన మొండి జిడ్డు పోవడం లేదా? ఇలా చేస్తే ఈజీగా క్లీన్
Recommended image3
Thummi Kura: ఏడాదిలో ఒక్క‌సారే తినే వంట‌కం.. తుమ్మి కూర ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా.?
Related Stories
Recommended image1
Ice Apple: తాటి ముంజల్లో ఇన్ని పోషకాలా? తెలిస్తే బుట్టలు బుట్టలు కొంటారు
Recommended image2
Ice Cream Storage: ఇస్ క్రీం ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజులు ఉంటే మంచిది? చాలా మంది చేసే పొరపాటు ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved