MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Life
  • Iron box Hacks: ఐరన్ బాక్స్ ని ఇలా కూడా వాడొచ్చా? ఎన్ని ఉపయోగాలో..!

Iron box Hacks: ఐరన్ బాక్స్ ని ఇలా కూడా వాడొచ్చా? ఎన్ని ఉపయోగాలో..!

Iron box Hacks: మనం ఐరన్ బాక్స్ ని కేవలం దుస్తులు ఐరన్ చేయడానికి మాత్రమే వాడతాం. కానీ, ఈ ఐరన్ బాక్స్ తో ఇంట్లో చాలా పనులను ఈజీగా చేసేయవచ్చని మీకు తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Mar 21 2026, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Iron Box
Image Credit : pixabay

Iron Box

దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంటుంది. ఇది చాలా కామన్. ఆ ఐరన్ బాక్స్ తో ముడతలు పడిన దుస్తులను ఐరన్ చేస్తూ ఉంటాం. కానీ, చిన్న ఐరన్ బాక్స్ తో ఇంట్లో చాలా పనులను పూర్తి చేయచ్చు. పిల్లలు ఇంట్లో గోడలపై గీసిన గీతల దగ్గర నుంచి.. కార్పెట్లపై పడిన మరకల వరకు చాలా రకాలుగా వాడొచ్చు. మరి.. ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
కార్పెట్లపై మరకలు తొలగించడానికి..
Image Credit : Getty

కార్పెట్లపై మరకలు తొలగించడానికి..

పార్టీ లేదా పండగ సమయంలో మీ కార్పెట్ లేదా టేబుల్ పై మైనం పడితే కంగారు పడకండి. ముందుగా, ఆ మైనాన్ని ఆరనివ్వాలి. తర్వాత ఒక చెంచాతో కొద్దిగా గీకి తీయాలి. ఆ ప్రదేశంపై ఒక కాగితం ముక్కను లేదా పాత క్లాత్ ని ఉంచి.. ఐరన్ బాక్స్ తో నొక్కాలి. ఐరన్ బాక్స్ వేడికి మైనం కరికి.. కాగితానికి అంటుకుంటుంది. ఇలా రెండు, మూడుసార్లు రిపీట్ చేస్తే... కార్పెట్ క్లీన్ అవుతుంది.

గోడపై క్రేయాన్ మరకలను శుభ్రపరచడానికి..

ఇంట్లో పిల్లలు ఉంటే, క్రేయాన్స్ తో గోడలు, సోఫాల మీద గీసేస్తూ ఉంటారు. ఆ మరకలను వదిలించలేక పేరెంట్స్ తిప్పలు పడుతూ ఉంటారు. అయితే.. వీటిని ఐరన్ బాక్స్ తో ఈజీ గా శుభ్రం చేసేయవచ్చు. దీని కోసం.. మరకల మీద ఒక టిష్యూ పేపర్ లేదా.. పేపర్ టవల్ ఉంచి. ఐరన్ బాక్స్ వేడి చేసి దాని మీద పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఆ మరకలన్నీ.. పేపర్ కి అతుక్కుంటాయి. మీ గోడలు శుభ్రం అవుతాయి.

Related Articles

Related image1
Mixer Jar Cleaning Tips: మిక్సీ జార్ అడుగు మురికి పట్టిందా? సింపుల్ గా క్లీన్ చేసే టెక్నిక్ ఇది..!
Related image2
Muskmelon: ప్రకృతి ప్రసాదించిన వరం ఈ పండు, రోజూ తింటే జరిగే మ్యాజిక్ ఇదే..!
33
 చిన్న కుట్టు పనుల కోసం
Image Credit : Getty

చిన్న కుట్టు పనుల కోసం

మీ డ్రెస్ ఎక్కడైనా చిన్న రంధ్రం పడితే.. దానిని కుట్టుకోవడానికి.. మీకు కుట్టు మిషన్ అవసరం లేదు. ఫ్యూజిబుల్ బాండింగ్ టేప్‌ ఉంచి, ఐరన్ బాక్స్ తో వేడి చేస్తే చాలు. దానంతట అదే అంటుకుంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఇది ఒక గొప్ప మార్గం.

ఫర్నిచర్‌పై తెల్లటి మరకలను తొలగించడం

టేబుల్‌పై వేడి గ్లాసు లేదా ప్లేటును ఉంచినప్పుడు, తెల్లటి గుండ్రని మచ్చలు కనిపిస్తాయి. దీనిని తొలగించడానికి, మరకపై ఒక పలుచని దూది వస్త్రాన్ని ఉంచి, ఆవిరిని ఉపయోగించకుండా తేలికగా నొక్కండి. ఇది లోపల ఉన్న తేమను విడుదల చేసి మరకను తొలగిస్తుంది. కానీ మరీ ఎక్కువ వేడిని ప్రయోగించకుండా జాగ్రత్త వహించండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Lizards: మీ ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఇలా చేస్తే.. ఈజీగా తరిమికొట్టొచ్చు..!
Recommended image2
Long Haram: ఈ ఒక్క హారం వేసుకుంటే చాలు.. మీ మెడ మెరిసిపోతుంది అంతే!
Recommended image3
టొమాటోలు నెల రోజులైనా ఫ్రెష్‌గా ఉండాలా? ఈ సింపుల్ పని చేయండి చాలు
Related Stories
Recommended image1
Mixer Jar Cleaning Tips: మిక్సీ జార్ అడుగు మురికి పట్టిందా? సింపుల్ గా క్లీన్ చేసే టెక్నిక్ ఇది..!
Recommended image2
Muskmelon: ప్రకృతి ప్రసాదించిన వరం ఈ పండు, రోజూ తింటే జరిగే మ్యాజిక్ ఇదే..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved