MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • IRCTC Vizag Tour : కేవలం రూ.8000 లో వైజాగ్, అరకు, సింహాచలం చుట్టిరండి.. తెలుగోళ్ల కోసమే సూపర్ టూర్ ప్యాకేజీ

IRCTC Vizag Tour : కేవలం రూ.8000 లో వైజాగ్, అరకు, సింహాచలం చుట్టిరండి.. తెలుగోళ్ల కోసమే సూపర్ టూర్ ప్యాకేజీ

మీరు స్నేహితులు లేదా కుటుంబసభ్యులతో విశాఖపట్నం టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఐఆర్సిటిసి అందిస్తున్న ‘’వైజాగ్ రీట్రీట్'' టూర్ ప్యాకేజీని పరిశీలించండి. తక్కువ బడ్జెట్లో వైజాగ్ తో పాటు చుట్టపక్కల ప్రాంతాలను చుట్టివచ్చే ఈ టూర్ ప్యాకేజీ ఫుల్ డిటెయిల్స్

3 Min read
Author : Arun Kumar P
Published : Jun 27 2026, 01:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐఆర్సిటిసి వైజాగ్ రీట్రీట్ టూర్ ప్యాకేజ్ వివరాలు..
Image Credit : Gemini AI

ఐఆర్సిటిసి వైజాగ్ రీట్రీట్ టూర్ ప్యాకేజ్ వివరాలు..

పచ్చని ప్రకృతి అందాలు, ఆహ్లాదకరమైన హిల్ స్టేషన్స్, కనుచూపుమేర కనిపించే సముద్రం, అలలు అలలుగా వచ్చే సముద్ర నీరు భూమిని తాకే అద్భుతమైన బీచ్ లు, చారిత్రక ప్రదేశాలు... ఇవన్నీ ఒకేచోట ఉంటే ఆ ప్రాంతం భూలోక స్వర్గమే. ఇన్ని అందాలను తనలో దాచుకున్న ప్రాంతం మన విశాఖపట్నం... అందుకే ఈ నగరాన్ని, చుట్టపక్కల ప్రాంతాలను జీవితంలో ఒక్కసారైనా చూడాలని చాలామంది తెలుగోళ్లు కోరుకుంటారు.

ఏపీ ప్రజలే కాదు తెలంగాణోళ్లు కూడా స్నేహితులు, కుటుంబసభ్యులతో కలిసి వైజాగ్ పర్యటనకు వెళుతుంటారు... మీరు కూడా ఇలా విశాఖపట్నం అందాలను వీక్షించాలని అనుకుంటున్నారా..? అయితే మీకోసమే IRCTC ((ఇండియన్ రైల్వే క్యాటరింగ్ ఆండ్ టూరిజం కార్పోరేషన్) బడ్జెట్ ధరలో ఓ టూర్ ప్యాకేజీ సిద్దం చేసింది. మూడు రోజులపాటు వైజాగ్ తో పాటు ప్రకృతి అందాలతో నిండిన అరకు, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం సింహాచలంను సందర్శించే అవకాశం కల్పిస్తోంది. ''వైజాగ్ రీట్రీట్ (Vizag Retreat)'' పేరిట ఐఆర్సిటిసి ప్రకటించిన టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
IRCTC విశాఖపట్నం టూర్ ప్యాకేజీ ధరలివే..
Image Credit : Gemini

IRCTC విశాఖపట్నం టూర్ ప్యాకేజీ ధరలివే..

IRCTC Vizag Retrest టూర్ ప్యాకేజీలో విశాఖపట్నంతో పాటు సింహాచలం ఆలయం, అరకు సందర్శన ఉంటుంది. ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలు బడ్జెట్ ధరలోనే వైజాగ్ టూర్ పూర్తిచేయవచ్చు. ఈ టూర్ మొత్తం రోడ్డుమార్గంలో సాగుతుంది... రైలు, విమాన ప్రయాణం ఉండదు కాబట్టి ప్యాకేజీ ధరలు తక్కువగా ఉన్నాయి.

1-3 ప్యాసింజర్స్ ప్యాకేజీ

ఒకరికి (సింగిల్ ఆక్యుపెన్సి) - రూ.20150

ఇద్దరికి (డబుల్ ఆక్యుపెన్సి) - రూ.11.070

ముగ్గురికి (ట్రిపుల్ ఆక్యుపెన్సి) - రూ.8060

పిల్లలుంటే (చైల్డ్ విత్ బెడ్) - రూ.6960

చైల్డ్ వితౌట్ బెడ్ - రూ.4470

4-6 ప్యాసింజర్స్ ప్యాకేజీ

ఇద్దరికి (డబుల్ ఆక్యుపెన్సి) - రూ.9540

ముగ్గురికి (ట్రిపుల్ ఆక్యుపెన్సి) - రూ.7680

పిల్లలుంటే (చైల్డ్ విత్ బెడ్) - రూ.6960

చైల్డ్ వితౌట్ బెడ్ - రూ.4470

35
IRCTC వైజాగ్ రీట్రీట్ టూర్ సాగుతుందిలా...
Image Credit : Getty

IRCTC వైజాగ్ రీట్రీట్ టూర్ సాగుతుందిలా...

విశాఖపట్నం-అరకు-సింహాచలం (2 రాత్రులు/ 3 రోజులు)

Day 1 (మొదటిరోజు)

విశాఖపట్నం రైల్వే స్టేషన్ లేదా విమానాశ్రయం లేదా బస్టాండ్ నుండి టూర్ ప్రారంభం అవుతుంది. ముందుగా వైజాగ్ లో హోటల్ కి తీసుకెళతారు... ప్రెష్ అప్ అయ్యాక నగరంలో పర్యాటక ప్రాంతాల సందర్శన ఉంటుంది. తొట్లకొండలోని పురాతన బౌద్ద సముదాయాల సందర్శన ఉంటుంది. తర్వాత రుషికొండ బీచ్ లో సరదాగా గడిపే అవకాశం కల్పిస్తారు. బీచ్ ఒడ్డునే గల కైలాసగిరి హిల్స్ పైనుండి సముద్ర అందాలను, ప్రకృతి సోయగాన్ని వీక్షించవచ్చు. ఇలా సాయంత్రం వరకు విశాఖ పర్యటన ఉంటుంది... రాత్రి ఈ నగరంలోని హోటల్లోనే బస ఉంటుంది.

Day 2 (రెండోరోజు)

ఉదయం వైజాగ్ హోటల్లో బ్రేక్ ఫాస్ట్ అనంతరం రెండోరోజు పర్యటన ప్రారంభం అవుతుంది. హోటల్ నుండి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాహనంలో అరకు ప్రయాణం ఉంటుంది. మార్గమధ్యలో దట్టమైన అడవుల మధ్యలో ఏపీ టూరిజం వారి టైడా జంగిల్ బెల్స్ రిసార్ట్ సందర్శన ఉంటుంది. ఇక పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహల సందర్శన ఉంటుంది. రాత్రికి తిరిగి విశాఖపట్నం హోటల్ కి చేరుకుంటారు... డిన్నర్ ఇక్కడే ఉంటుంది.

Day 3 (మూడోరోజు)

మూడోరోజు ఉదయం వైజాగ్ హోటల్లో భోజనం అనంతరం సింహాచలం ఆలయానికి బయలుదేరాల్సి ఉంటుంది. నగరానికి 16 కిలోమీటర్ల దూరంలోని ఆలయానికి రోడ్డు మార్గంలో ప్రయాణం ఉంటుంది. ఇక్కడ వరాహ లక్ష్మీనరసింహస్వామి (సింహాద్రి అప్పన్న) దర్శనం ఉంటుంది. అనంతరం సబ్ మెరైన్ మ్యూజియం, ఆర్కే బీచ్ సందర్శన ఉంటుంది. తిరిగి రైల్వే స్టేషన్ లేదా ఎయిర్ పోర్ట్ లేదా బస్టాండ్ లో దిగబెట్టడంతో విశాఖ పర్యటన ముగుస్తుంది.

45
ఐఆర్సిటిసి వైజాగ్ టూర్ ప్యాకేజీలో ఏ సదుపాయాలుంటాయి, ఏవి ఉండవు?
Image Credit : AP Govt Twitter

ఐఆర్సిటిసి వైజాగ్ టూర్ ప్యాకేజీలో ఏ సదుపాయాలుంటాయి, ఏవి ఉండవు?

ఐఆర్సిటిసి ప్యాకేజీలో కల్పించే సదుపాయాలు..

  • విశాఖపట్నం హోటల్లో ఏసి గదిని కేటాయిస్తారు.
  • హోటల్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్, రాత్రి డిన్నర్ ఉంటుంది.
  • రోడ్డు ప్రయాణంలో ఏసి వాహనాన్ని ఏర్పాటుచేస్తారు.
  • కొన్ని పర్యాటక ప్రాంతాల్లో టికెట్ భరిస్తారు.
  • ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇతర రవాణా పరమైన ఖర్చులు, ట్యాక్స్ లు భరిస్తారు

IRCTC టూర్ ప్యాకేజీలో లేని సదుపాయాలు..

  • మధ్యాహ్నం లంచ్, సాయంత్రం స్నాక్స్ తో పాటు ఇతర తిండి పదార్థాల ఖర్చు పర్యాటకులదే.
  • టూర్ ప్యాకేజీలో పేర్కొన్న ప్రదేశాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో ఏమైనా టికెట్స్ ఉంటే పర్యాటకులే భరించుకోవాలి
  • వైజాగ్ చేరుకునేందుకు ట్రైన్, బస్, ప్లైట్ టికెట్స్ పర్యాటకులవే.
  • టూర్ గైడ్ సర్వీస్ కావాలన్నా పర్యాటకులే ఆ ఖర్చులు భరించుకోవాలి.
  • హోటల్లో ఇతర ఖర్చులు అంటే బయటినుండి ఫుడ్ తెప్పించుకున్నా, వాటర్ బాటిల్, టిప్స్, లాండ్రీ ఇతరత్రా ఖర్చులు పర్యాటకులవే.
55
ఐఆర్సిటిసి వైజాగ్ రీట్రీట్ ట్రిప్ టికెట్ బుకింగ్స్ లేదా సమాచారం కోసం సంప్రదించండి.
Image Credit : X/Telanana Tourism

ఐఆర్సిటిసి వైజాగ్ రీట్రీట్ ట్రిప్ టికెట్ బుకింగ్స్ లేదా సమాచారం కోసం సంప్రదించండి.

  • IRCTC – విశాఖపట్నం

మెయిన్ ఎంట్రన్స్, APCDC కౌంటర్ పక్కన

విశాఖపట్నం రైల్వే స్టేషన్.

ఈమెయిల్ : ramchandra.kumar@irctc.com

మొబైల్ నంబర్ : 9281030748 / 9281495847

  • టూరిజం ఇన్ఫర్మేషన్ ఇండ్ ఫెనిలిటేషప్ సెంటర్, విజయవాడ రైల్వే స్టేషన్. ఫోన్ నెంబర్ : 9281495848
  • సౌత్ సెంట్రల్ జోన్ - జోనల్ ఆఫీస్ - హైదరాబాద్. ఫోన్ నెంబర్ : 9701360701

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Blood Pressure: బీపీ మిష‌న్ ఎలా ప‌నిచేస్తుంది.? దీని వెన‌కాల ఉన్న మెకానిజం ఏంటో తెలుసా?
Recommended image2
Guava: రోజుకి ఒక జామపండు తింటే ఏం జరుగుతుంది?
Recommended image3
Hair Oil: కొబ్బరి నూనె Vs రోజ్ మేరీ ఆయిల్.. ఈ రెండింటిలో ఏ నూనె వాడితే జుట్టు ఫాస్ట్ గా పెరుగుతుంది..!
Related Stories
Recommended image1
IRCTC Kerala Tour : తెలుగోళ్ళ కోసమే ఐఆర్సిటిసి బడ్జెట్ టూర్ ప్లాన్.. హైదరాబాద్ నుండి కేరళకు 6 రోజుల సూపర్ ప్యాకేజీ
Recommended image2
IRCTC Goa Tour : హైదరాబాద్ టు గోవా ప్లైట్ జర్నీ .. తెలుగోళ్ల కోసమే 4 రోజుల టూర్ ప్యాకేజీ, అదీ బడ్జెట్లోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved