MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Ooty Tour Package : ఊటీలో 3 రాత్రులు.. రైలు, హోటల్‌తో కలిపి ఒకే ప్యాకేజీ.. ఖర్చు ఎంతంటే?

Ooty Tour Package : ఊటీలో 3 రాత్రులు.. రైలు, హోటల్‌తో కలిపి ఒకే ప్యాకేజీ.. ఖర్చు ఎంతంటే?

IRCTC ఇప్పుడు 'అల్టిమేట్ ఊటీ' పేరుతో ఒక స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ఆరు రోజుల ట్రిప్‌లో మూడు రాత్రులు ఊటీలో గడపొచ్చు. తక్కువ ఖర్చుతో వేసవి సెలవలను కుటుంబంతో ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్.

2 Min read
Author : Arun Kumar P
Published : May 15 2026, 07:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐఆర్సిటిసి ఊటీ టూర్ ప్యాకేజ్...
Image Credit : Getty

ఐఆర్సిటిసి ఊటీ టూర్ ప్యాకేజ్...

వేసవి ఎండల నుంచి తప్పించుకుని చల్లని కొండ ప్రాంతంలో సేదతీరాలని చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటి వారికోసమే IRCTC 'అల్టిమేట్ ఊటీ' అనే ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. తక్కువ ఖర్చుతో ఆరు రోజుల ఈ ట్రిప్‌లో, అందమైన ఊటీలో మూడు రాత్రులు బస చేసే అవకాశం కల్పిస్తోంది. ప్రకృతి ప్రేమికులకు, కుటుంబంతో వెళ్లేవారికి ఈ ప్యాకేజీ బెస్ట్ ఛాయిస్.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టూర్ ప్యాకేజీ ఛార్జీలు..
Image Credit : Getty

టూర్ ప్యాకేజీ ఛార్జీలు..

ఈ టూర్ హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శబరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణం ఉంటుంది. ప్రయాణికులు 3AC, స్లీపర్ క్లాస్‌లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. కంఫర్ట్ 3AC క్లాస్‌లో ఒక వ్యక్తికి రూ.33,590 నుంచి ఛార్జీలు మొదలవుతాయి. డబుల్, ట్రిపుల్ షేరింగ్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. స్టాండర్డ్ స్లీపర్ క్లాస్‌లో ఇంకా తక్కువ ధరకే ఈ టూర్ అందుబాటులో ఉంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు ప్రత్యేక ఛార్జీలు వర్తిస్తాయి.

Related Articles

Related image1
Ooty Trip : ఈ సమ్మర్ లో ఊటీకి వెళుతున్నారా..? కేవలం రూ.1000 తోనే టూర్ పూర్తి, ఎలాగో తెలుసా..?
Related image2
Ooty Amazing things ఊటీలో ఇవి సందర్శిస్తే.. జీవితాంతం మర్చిపోరు!
35
ఊటీ ట్రిప్ సాగుతుందిలా...
Image Credit : Freepik

ఊటీ ట్రిప్ సాగుతుందిలా...

మొదటి రోజు మధ్యాహ్నం 2:25 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రైలు బయలుదేరుతుంది. బీబీ నగర్, నల్గొండ, గుంటూరు మీదుగా రాత్రంతా ప్రయాణం సాగుతుంది. రెండో రోజు ఉదయం కోయంబత్తూరు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి కారులో ఊటీకి తీసుకెళ్తారు. హోటల్‌లో చెక్-ఇన్ అయ్యాక, ఊటీ బొటానికల్ గార్డెన్, ఊటీ సరస్సు వంటి ప్రదేశాలను చూపిస్తారు.
45
ఈ టూర్ మర్చిపోలేని అనుభూతి...
Image Credit : chat gppt

ఈ టూర్ మర్చిపోలేని అనుభూతి...

మూడో రోజు దొడ్డబెట్ట శిఖరం, టీ మ్యూజియం, పైకారా జలపాతం వంటి ప్రసిద్ధ ప్రదేశాలను చూస్తారు. నాలుగో రోజు కూనూర్ ప్రాంతానికి టూర్ ఉంటుంది. పచ్చని కొండలు, తేయాకు తోటలు, చల్లని వాతావరణం ప్రయాణికులకు మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి.
55
 ఊటీ టూర్ లో ఖర్చులివే..
Image Credit : Getty

ఊటీ టూర్ లో ఖర్చులివే..

ఈ ప్యాకేజీలో రైలు టికెట్లు, కోయంబత్తూరు నుంచి ఊటీకి కారు, మూడు రాత్రులు హోటల్‌లో బస, ప్రయాణ భీమా వంటివి ఉంటాయి. కానీ మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, బోటింగ్, గుర్రపు స్వారీ, పర్యాటక ప్రదేశాల్లో ఎంట్రీ ఫీజులు ప్రయాణికులే సొంతంగా భరించాలి. వేసవి సెలవుల్లో కుటుంబంతో ప్రశాంతంగా గడపాలనుకునేవారికి ఈ IRCTC ఊటీ ప్యాకేజీ ఒక మంచి అవకాశం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Ooty Trip : ఈ సమ్మర్ లో ఊటీకి వెళుతున్నారా..? కేవలం రూ.1000 తోనే టూర్ పూర్తి, ఎలాగో తెలుసా..?
Recommended image2
Ooty Amazing things ఊటీలో ఇవి సందర్శిస్తే.. జీవితాంతం మర్చిపోరు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved