MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Ooty Trip : ఈ సమ్మర్ లో ఊటీకి వెళుతున్నారా..? కేవలం రూ.1000 తోనే టూర్ పూర్తి, ఎలాగో తెలుసా..?

Ooty Trip : ఈ సమ్మర్ లో ఊటీకి వెళుతున్నారా..? కేవలం రూ.1000 తోనే టూర్ పూర్తి, ఎలాగో తెలుసా..?

వేసవి వచ్చిందంటే చాలు… ఊటీ, కొడైకెనాల్ వంటి హిల్ స్టేషన్లు జనంతో కిక్కిరిసిపోతాయి. అందుకే తమిళనాడు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TTDC) కేవలం రూ.1000తో ఊటీని చుట్టివచ్చే వన్-డే ట్రిప్‌ను ప్రకటించింది.

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 30 2026, 10:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వేసవిలో చల్లచల్లని ఊటీ టూర్
Image Credit : Getty

వేసవిలో చల్లచల్లని ఊటీ టూర్

Ooty Trip : చుట్టూ ఎత్తైన పర్వతాలు... భూతల్లి పచ్చని చీరకట్టుకుందా అన్నట్లుగా ఎటుచూసినా చెట్లు, టీ ఎస్టేట్స్... కొండలపైనుండి జాలువారే ప్రవాహాలు, అందమైన సరస్సులు... ఈ మాటలు వింటుటేనే ఎప్పుడెప్పుడు ఆ ప్రాంతాన్ని చుట్టివద్దామా అన్న ఫీలింగ్ కలుగుతోంది కదా. ఇలాంటి ప్రకృతి అందాలతో నిండిన ప్రాంతం ఎక్కడో కాదు మన దక్షిణ భారతదేశంలోనే ఉంది. తమిళనాడులోని ఊటీ అందాలు పర్యాటకులకు కట్టిపడేస్తాయి... ప్రకృతి ప్రేమికులకు అయితే ఇది భూలోక స్వర్గమే.

25
కేవలం రూ.100 కే ఊటీ టూర్
Image Credit : @imYadav31/X

కేవలం రూ.100 కే ఊటీ టూర్

సాధారణంగా వేసవి కాలంలో దేశమంతా ఎండలు మండిపోతుంటే ఊటీలో మాత్రం చల్లని వాతావరణం ఉంటుంది. అందుకే కొత్తగా పెళ్లయిన జంటలు హనీమూన్ కి, సెలవుల్లో పిల్లలతో సరదాగా గడిపేందుకు ఫ్యామిలీస్ ఊటీకి వెళుతుంటాయి. త్వరలోనే వేసవి సెలవులు రాబోతున్నాయి..కాబట్టి మీరు కూడా కుటుంబంతో కలిసి ఊటీ వెళ్లాలనుకుంటున్నారా..? అయితే తమిళనాడు టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TTDC) కేవలం రూ.1000కే అందించే వన్-డే టూర్ ప్యాకేజీని వాడుకొండి. ఈ టూర్‌తో ఊటీలోని ముఖ్యమైన ప్రదేశాలన్నీ చుట్టేయొచ్చు.

Related Articles

Related image1
Summer Holidays : ఈ వేసవి సెలవుల్లో పిల్లలతో టూర్ ప్లాన్ చేస్తున్నారా..? టాప్ 5 కూల్ డెస్టినేషన్స్ ఇవే
Related image2
Goa Tour : కేవలం రూ.3500 తో లగ్జరీ బస్సులో గోవా టూర్... 3 నైట్స్, 4 డేస్ ఎంజాయ్
35
ఊటీ టూర్ ఇలా సాగుతుంది...
Image Credit : Istock

ఊటీ టూర్ ఇలా సాగుతుంది...

ఈ టూర్ ఉదయం 9 గంటలకు మొదలై, సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఈ 7 గంటల ట్రిప్‌లో ఊటీలోని చాలా ముఖ్యమైన ప్రదేశాలను చూడొచ్చు. 55 ఎకరాల ప్రభుత్వ బొటానికల్ గార్డెన్, నీలగిరిలోనే ఎత్తైన దొడ్డబెట్ట శిఖరం, తేయాకు తోటలు, చాక్లెట్ ఫ్యాక్టరీ, బోట్ హౌస్, కర్ణాటక పార్క్ వంటి ప్రదేశాలకు తీసుకెళ్తారు. తేయాకు ఎలా కోస్తారు, ఎలా ప్రాసెస్ చేస్తారో కూడా ఇక్కడ చూడొచ్చు.

45
కేవలం రూ.1000 కే విఐపి టూర్
Image Credit : @chetansabnis/X

కేవలం రూ.1000 కే విఐపి టూర్

ఈ వన్-డే టూర్‌ ప్యాకేజీలో మధ్యాహ్నం శాకాహార భోజనం, టీ కూడా అందిస్తారు. ఊటీలోని చారింగ్ క్రాస్ దగ్గర ఉన్న హోటల్ తమిళనాడు కాంప్లెక్స్ నుంచి టూర్ బస్సు బయలుదేరుతుంది. ఈ ట్రిప్ ప్రత్యేకత ఏంటంటే.. టూరిస్ట్ ప్లేస్‌లలో నేరుగా ప్రవేశం కోసం వీఐపీ పాస్ ఇస్తారు.

55
ఊటీ టూర్ ప్యాకేజీ కోసం ఈ నెంబర్లను సంప్రదించండి
Image Credit : @imYadav31/X

ఊటీ టూర్ ప్యాకేజీ కోసం ఈ నెంబర్లను సంప్రదించండి

ఈ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకోవడానికి లేదా మరిన్ని వివరాల కోసం +91 9176995854, +91 8148875747, లేదా +91 9176995851 నంబర్లకు కాల్ చేయవచ్చు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలనుకుంటే https://www.ttdconline.com/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

వాతావరణ పరిస్థితులు, పర్యాటకుల సంఖ్యను బట్టి ఈ టూర్‌ను నడుపుతామని తమిళనాడు టూరిజం శాఖ తెలిపింది. తక్కువ బడ్జెట్‌లో ఊటీని ఎంజాయ్ చేయాలనుకునేవారికి ఇది గొప్ప అవకాశం. వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి వెళ్లేందుకు ఈ ప్యాకేజీ చాలా బాగుంటుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రయాణం
భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
తమిళనాట ఎన్నికలు కమలహాసన్ కీలక సందేశం in Tamil Nadu Elections | Asianet News Telugu
Recommended image2
Now Playing
కేరళ త్రిస్సూర్‌లో భారీ పేలుడు 40 మందికి పైగా | Massive Explosion in Kerala | Asianet News Telugu
Recommended image3
Heatwave Alert : భారత్ పై 'మెగా ఎల్ నినో' ఎఫెక్ట్.. ఇకపై ఏంటీ పరిస్థితి..?
Related Stories
Recommended image1
Summer Holidays : ఈ వేసవి సెలవుల్లో పిల్లలతో టూర్ ప్లాన్ చేస్తున్నారా..? టాప్ 5 కూల్ డెస్టినేషన్స్ ఇవే
Recommended image2
Goa Tour : కేవలం రూ.3500 తో లగ్జరీ బస్సులో గోవా టూర్... 3 నైట్స్, 4 డేస్ ఎంజాయ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved