మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ఈ వెండి బ్రేస్లేట్ మంచి ఆప్షన్. ఇవి బడ్జెట్ రేంజ్ లోనే లభిస్తాయి. బంగారం కొనలేని వారికి ఇవి బెస్ట్ ఆప్షన్.
మీరు ఇచ్చే గిఫ్ట్‌లో ప్రేమ ఉట్టిపడాలంటే, హార్ట్ చార్మ్ బ్రేస్‌లెట్ మంచి ఆప్షన్. దీనికి చిన్న చిన్న హార్ట్ పెండెంట్లు లేదా రాళ్లు ఉంటాయి. ఇవి దానికి రొమాంటిక్ లుక్ ఇస్తాయి.
ఫ్లోరల్ మోటిఫ్స్ డిజైన్ ఉన్న సిల్వర్ బ్రేస్‌లెట్‌ను ప్రేమకు, ఎప్పటికీ తోడుంటాననే దానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే రిలేషన్‌షిప్ గిఫ్ట్ కోసం ఇది మంచి ఆప్షన్.
మీ గిఫ్ట్‌లో ప్రేమ కనిపించాలంటే, ఇన్ఫినిటీ పెండెంట్ సిల్వర్ బ్రేస్‌లెట్ కూడా మంచి ఆప్షన్. దీని మధ్యలో స్టోన్ వర్క్‌తో ఇన్ఫినిటీ సింబల్ ఉంటుంది. ఇది అనంతమైన ప్రేమకు చిహ్నం.
పుట్టినరోజు, యానివర్సరీ లేదా సర్‌ప్రైజ్ గిఫ్ట్ కోసం ఈ పెర్ల్ వర్క్ డబుల్ లేయర్ సిల్వర్ బ్రేస్‌లెట్ డిజైన్‌ను చాలామంది ఇష్టపడతారు. ఇది చాలా అందంగా, డెలికేట్ లుక్‌ను ఇస్తుంది.
మీరు ఇచ్చే గిఫ్ట్ కాస్త రిచ్‌గా, మెరుస్తూ కనిపించాలంటే, స్టోన్ స్టడెడ్ బ్రేస్‌లెట్‌ను ఎంచుకోండి. చిన్న చిన్న రాళ్లతో ఉండే ఈ డిజైన్ తక్కువ ధరలోనే చాలా అందంగా కనిపిస్తుంది.
హెవీ జ్యువెలరీ నచ్చకపోతే, ఈ మినిమల్ సిల్వర్ చైన్ బ్లాక్ బీడ్స్ బ్రేస్‌లెట్ బెస్ట్ ఆప్షన్. ఇది ఏ డ్రెస్‌తోనైనా ఈజీగా మ్యాచ్ అవుతుంది. రోజూ వేసుకోవడానికి కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
క్యూట్, ట్రెండీ డిజైన్లు ఇష్టపడేవారికి స్టార్ లాకెట్ చార్మ్ సిల్వర్ బ్రేస్‌లెట్ మంచి ఆప్షన్. దీనిపై ఉండే స్టోన్ వర్క్ దీన్ని మరింత స్టైలిష్‌గా మారుస్తుంది. చేతులకు అందంగా ఉంటాయి