MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Life
  • IRCTC Tour Package : రూ.11,999 కే 6 రోజుల ఫ్యామిలీ టూర్.. తిరుపతి, శ్రీకాళహస్తి, కొల్హాపూర్ టెంపుల్స్ తో పాటు ఇంకెన్నో

IRCTC Tour Package : రూ.11,999 కే 6 రోజుల ఫ్యామిలీ టూర్.. తిరుపతి, శ్రీకాళహస్తి, కొల్హాపూర్ టెంపుల్స్ తో పాటు ఇంకెన్నో

IRCTC Tour Package : కేవలం రూ.11,999 లోనే రైలు ఛార్జీలు, హోటల్ ఖర్చులు, ఫుడ్, ఇతర ట్రావెలింగ్ ఖర్చులు… ఆరు రోజులపాటు తిరుపతి, శ్రీకాళహస్తి, కొల్హాపూర్ టెంపుల్స్ తో పాటు ఇంకెన్నో చుట్టివచ్చేలా ఐఆర్సిటిసి టూర్ ప్లాన్. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 02 2026, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐఆర్సిటిసి ఆద్యాత్మిక టూర్ ప్లాన్..
Image Credit : Gemini AI

ఐఆర్సిటిసి ఆద్యాత్మిక టూర్ ప్లాన్..

IRCTC Tirupati Package : దక్షిణ భారతదేశంలో ప్రముఖ దేవాలయాలు అనేకం ఉన్నాయి. వీటన్నింటిని చుట్టిరావాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నపని... అంతేకాదు సమయం కూడా ఎక్కువ కావాలి. అందుకే చాలామంది IRCTC (Indian Railway Catering and Tourism Corporation) ని ఆశ్రయిస్తున్నారు... ఇక్కడ బడ్జెట్ లోనే, తక్కువ సమయంలో ఎక్కువ ప్రదేశాలను చుట్టిరావచ్చు. తాజాగా ఐఆర్సిటిసి తిరుపతి, శ్రీకాళహస్తి, కొల్హాపూర్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తిరుమల టూర్ ప్లాన్..
Image Credit : gemini

తిరుమల టూర్ ప్లాన్..

వేసవి సెలవులు ముగింపుకు చేరుకున్నాయి... ఇంకా పదిరోజులే మిగిలివున్నాయి. ఇదే సమయంలో ఎండలతీవ్రత కూడా తగ్గుతోంది... కాబట్టి చాలామంది పిల్లాపాపలతో కలిసి టూర్ ప్లాన్ చేసుకుని ఉంటారు. ఇలా మీరుకూడా తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా..? అయితే IRCTC ప్రకటించింది అద్భుతమైన ఆద్యాత్మిక టూర్ ప్లాన్ గురించి తెలుసుకోవాల్సిందే. శేషాచలం కొండల్లో కొలువైన తిరుమల వెంకటేశ్వరస్వామినే కాదు శ్రీకాళహస్తిలో కొలువైన శివలింగం, కొల్హాపూర్ లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవచ్చు.

అయితే ఈ టూర్ ముంబై నుండి ప్రారంభం అవుతుంది. ముంబై-తిరుపతి-తిరుమల-శ్రీకాళహస్తి-మహాలక్ష్మి-ముంబై... ఈ ప్రాంతాలమీదుగా 5 రాత్రులు, 6 రోజులు యాత్ర సాగుతుంది. ప్రతి బుధవారం ఈ ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభం అవుతుంది... బస, ఫుడ్, ట్రావెలింగ్ సదుపాయాలన్ని ఐఆర్సిటిసి కల్పిస్తుంది. అయితే ఆలయాల్లో దర్శన టికెట్లు, ఇతర ఖర్చులను మాత్రం పర్యాటకులు భరించాల్సి ఉంటుంది. ఇలా అన్ని ఖర్చులు కలిపి అతి తక్కువలోనే ఈ టూర్ పూర్తిచేయవచ్చు.

Related Articles

Related image1
Tirupati Train : హైదరాబాద్ నుండి తిరుపతి, అరుణాచలం, శ్రీరంగంలకు ఒకే ట్రైన్‌.. టైమింగ్స్ ఇవే..!
Related image2
Tirupati: రూ. 1000 లోపే హైదరాబాద్ టు తిరుపతి టూర్‌ ప్లాన్.. అవును ఇలా చేస్తే సాధ్య‌మే
35
IRCTC టూర్ ప్యాకేజీ ధరలు...
Image Credit : Gemini AI

IRCTC టూర్ ప్యాకేజీ ధరలు...

3ఏసి ఎకానమీ లేదా స్లీపర్

సింగిల్ పర్సన్ అయితే రూ.29,550

ఇద్దరు కలిసి అయితే (ఒక్కొక్కరికి) రూ.18,350

ముగ్గురికి అయితే (ఒక్కొక్కరికి) రూ.15,150

చైల్డ్ విత్ బెడ్ (5-11 ఏళ్లు) రూ.13,650

చైల్డ్ వితౌట్ బెడ్ (5-11 ఏళ్లు) రూ.12,950

స్లిపర్ (స్టాండర్డ్)

సింగిల్ పర్సన్ అయితే రూ.26,300

ఇద్దరు కలిసి అయితే (ఒక్కొక్కరికి) రూ.15,100

ముగ్గురు కలిసి అయితే (ఒక్కొక్కరికి) రూ.11,900

చైల్డ్ విత్ బెడ్ (5-11 ఏళ్లు) రూ.10,400

చైల్డ్ వితౌట్ బెడ్ (5-11 ఏళ్లు) రూ.9,700

45
తిరుమల టూర్ సాగుతుందిలా...
Image Credit : Getty

తిరుమల టూర్ సాగుతుందిలా...

DAY 1

ముంబైలోని LTT (Lokmanya Tilak Terminus Railway Station) నుండి రేణిగుంటకు రైలు బయలుదేరుతుంది. రాత్రంతా ప్రయాణం సాగుతుంది... ఉదయానికి రేణిగుంట చేరుకంటారు.

DAY 2

రేణిగుంట రైల్వే స్టేషన్ కు చేరుకోగానే అక్కడినుండి తిరుపతికి రోడ్డుమార్గంలో చేరుకుంటారు. అక్కడ హోటల్లో ప్రెష్ అయ్యాక తిరుచానూరు పద్మావతి అమ్మవారు, తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనం ఉంటుంది. రాత్రి తిరుపతి హోటల్లోనే డిన్నర్, బస ఉంటుంది.

DAY 3

తిరుపతి నుండి రేణిగుంటకు ప్రయాణం ఉంటుంది. ఉదయమే తిరుపతిలో బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుండి బయలుదేరాల్సి ఉంటుంది. శ్రీకాళహస్తి దర్శనం అనంతరం తిరిగి తిరుపతి రైల్వే స్టేషన్ కు రోడ్డు మార్గంలో చేరుకుంటారు. అక్కడినుండి ట్రైన్ లో కొల్హాపూర్ కు పయనం... రాత్రంతా ప్రయాణం ఉంటుంది.

55
కొల్హాపూర్ టూర్ సాగుతుందిలా...
Image Credit : fb

కొల్హాపూర్ టూర్ సాగుతుందిలా...

DAY 4

రేణిగుంట నుండి కొల్హాపూర్ కు చేరుకుంటారు. కొల్హాపూర్ రైల్వే ప్టేషన్ నుండి హోటల్ కు పయనం... ప్రెష్ అయ్యాక ఆలయానికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. తిరిగి హోటల్ కి చేరుకున్నాక డిన్నర్.. రాత్రి బస అక్కడే ఉంటుంది.

DAY 5

కొల్హాపూర్ లో బ్రేక్ ఫాస్ట్ అనంతరం హోటల్ నుండి బయలుదేరాలి. ఇక్కడి జ్యోతిబా టెంపుల్, న్యూ పాలస్ మ్యూజియం, కనేరి మఠ్ వంటివి సందర్శించాలి. రోజంతా ఇక్కడే ఉండి ముంబైకి బయలుదేరాలి.

DAY 6

కొల్హాపూర్ నుండి రైలులో ముంబైకి పయనం. ముంబైలోని CSMT (Chhatrapati Shivaji Terminus) చేరుకోవడంతో ఈ టూర్ ముగుస్తుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Beard: ఈ నూనెలు రాస్తే...అబ్బాయిలకు గడ్డం ఒత్తుగా పెరుగుతుంది.!
Recommended image2
Gold Locket: 2 గ్రాముల్లో చైన్ కి అదిరిపోయే లాకెట్ డిజైన్లు
Recommended image3
Silver Rings: రూ.1000 లోపు అద్భుత డిజైన్లలో వెండి ఉంగరాలు
Related Stories
Recommended image1
Tirupati Train : హైదరాబాద్ నుండి తిరుపతి, అరుణాచలం, శ్రీరంగంలకు ఒకే ట్రైన్‌.. టైమింగ్స్ ఇవే..!
Recommended image2
Tirupati: రూ. 1000 లోపే హైదరాబాద్ టు తిరుపతి టూర్‌ ప్లాన్.. అవును ఇలా చేస్తే సాధ్య‌మే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved