- Home
- Life
- IRCTC Maharashtra Tour Package : కేవలం రూ.5770 కే మహారాష్ట్ర టూర్.. షిరిడి, త్రయంబకేశ్వర్, పంచవటి, నాసిక్ యాత్ర
IRCTC Maharashtra Tour Package : కేవలం రూ.5770 కే మహారాష్ట్ర టూర్.. షిరిడి, త్రయంబకేశ్వర్, పంచవటి, నాసిక్ యాత్ర
IRCTC Maharashtra Tour Package : తెలుగు ప్రజలకు సూపర్ ఛాన్స్. ప్రతి వీకెండ్ లో అతి తక్కువ ధరలోనే మహారాష్ట్రలోని పుణ్యక్షేత్రాలను చుట్టివచ్చేలా ఐఆర్సిటిసి సాయిశివం పేరిట టూర్ ప్యాకేజీ ప్రకటించింది.

హైదరాబాద్ నుండి షిరిడి, త్రయంబకేశ్వర్ టూర్
IRCTC Maharashtra Tour Package : చిన్నారులకు వేసవి సెలవులు ముగింపుకు చేరుకున్నాయి… ఈ వారంరోజులే హాలిడేస్. ఇక ఈ వీకెండ్ లో రెండో శనివారం, ఆదివారం రెండ్రోజులు ఉద్యోగులకు కూడా సెలవులు రానున్నాయి. అంతేకాదు ప్రస్తుతం వేసవి ఎండలు ముగిసి వానలు మొదలయ్యాయి... వాతావరణం చల్లబడింది కాబట్టి ఫ్యామిలీతో టూర్ కి వెళ్లేందుకు ఇదే మంచి సమయం. ఇలా మీరుకూడా ఈ వీకెండ్ లో టూర్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే IRCTC (ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) హైదరాబాద్ నుండి మహారాష్ట్రలోని పుణ్యకేత్రాలను చుట్టివచ్చేలా ఓ ప్లాన్ ప్రకటించింది. అతి తక్కువ ధరలోనే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
IRCTC సాయిశివం ప్యాకేజీ వివరాలివే...
ఐఆర్సిటిసి ప్రతి వీకెండ్ లో హైదరాబాద్ నుండి మహారాష్ట్రకు టూర్ ప్లాన్ చేసింది... తెలంగాణ బార్డర్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు షిరిడి, నాసిక్, త్రయంబకేశ్వర్, పంచవటిని చుట్టిరావచ్చు. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ టూర్ సోమవారంతో ముగుస్తుంది... అంటే 3 రాత్రులు, నాలుగు రోజుల టూర్ అన్నమాట. కేవలం రూ.5770 తో ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి ఈ టూర్ ప్రారంభం అవుతుంది... స్లీపర్, 3ఏసి కోచ్ లలో ప్రయాణం ఉంటుంది.
IRCTC సాయిశివం టూర్ ప్యాకేజీ ధరలివే..
కంపర్ట్ (3AC) :
సింగిల్ పర్సన్ కు : రూ.8940
ఇద్దరికి టికెట్ బుక్ చేస్తే ఒక్కొ టికెట్ ధర : రూ.7550
ముగ్గురికి టికెట్ బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర : రూ.7520
చిన్నపిల్లలుంటే బెడ్ తో కూడిన సింగిల్ టికెట్ ధర : రూ.7410
చిన్నపిల్లలుంటే బెడ్ లేకుండా సింగిల్ టికెట్ ధర : రూ.6470
స్టాండర్డ్ (స్లీపర్) :
సింగిల్ పర్సన్ కు : రూ.7260
ఇద్దరికి టికెట్ బుక్ చేస్తే ఒక్కొ టికెట్ ధర : రూ.5860
ముగ్గురికి టికెట్ బుక్ చేస్తే ఒక్కో టికెట్ ధర : రూ.5840
చిన్నపిల్లలుంటే బెడ్ తో కూడిన సింగిల్ టికెట్ ధర : రూ.5720
చిన్నపిల్లలుంటే బెడ్ లేకుండా సింగిల్ టికెట్ ధర : రూ.4780
IRCTC సాయిశివం టూర్ సాగుతుందిలా..
Day 1 (శుక్రవారం) : హైదరాబాద్ లోని కాచీగూడ రైల్వేస్టేషన్ నుండి అజంతా ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణం ప్రారంభమవుతుంది. మొదటిరోజు రాత్రంతా ప్రయాణం సాగుతుంది.
Day 2 (శనివారం) : రెండోరోజు ఉదయం నాగర్సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడినుండి షిరిడికి రోడ్డుమార్గంలో ప్రయాణం ఉంటుంది. హోటల్లో ప్రెష్ అప్ అయ్యాక షిరిడి సాయిబాబ ఆలయంలో దర్శనానికి వెళ్లాలి. అయితే దర్శన టికెట్లు యాత్రికులే భరించాలి. రాత్రి బస షిరిడిలోనే ఉంటుంది.
Day 3 (ఆదివారం) : షిరిడి నుండి నాసిక్ పయనం అవ్వాలి... దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన త్రయంభకేశ్వర్ ఆలయాన్ని సందర్శిస్తారు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఉన్న త్రయంబకేశ్వర్ ఆలయమే పవిత్రమైన గోదావరి నది జన్మస్థలం. ఇక్కడి ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే శివలింగం మూడు ముఖాలను కలిగి ఉండి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను (త్రిమూర్తులను) సూచిస్తుంది.
ఇక్కడి నుండి పంచవటికి తీసుకెళతారు. ఇక్కడికి పెద్ద వాహనాలను అనుమతించరు కాబట్టి యాత్రికులు ఆటో రిక్షాలు, కారులో ప్రయాణించాల్సి ఉంటుంది. సాయంత్రం నాగర్సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడినుండి తిరిగి అజంతా ఎక్స్ ప్రెస్ రైల్లో రాత్రంతా హైదరాబాద్ కు పయనం ఉంటుంది.
Day 4 (సోమవారం) : ఉదయం 9:45 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకోవడంతో ప్రమాణం ముగుస్తుంది.
IRCTC సాయిశివం ప్యాకేజీలో కల్పించే సదుపాయాలివే....
ఈ సాయిశివం ప్యాకేజీ కింద ఐఆర్సిసిటిసి రైలు టికెట్లు, ఏసి వెహికిల్, రెండు రోజులు బ్రెక్ ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్ కల్పిస్తారు. అయితే ఆలయాల్లో దర్శన టికెట్లు యాత్రికులే భరించాలి. లంచ్, డిన్నర్ తో పాటు స్నాక్స్ వంటివి కూడా యాత్రికులే సమకూర్చుకోవాలి. రైల్లో భోజనం కూడా ప్రయాణికులదే. టూర్ గైడ్ తో పాటు ఇతర ఏ సర్వీసులైనా యాత్రికులు సొంతంగా భరించుకోవాలి
ఐఆర్సిటిసి టూర్ ప్యాకేజీల వివరాాల కోసం కాంటాక్ట్ చేయండి.
ఐఆర్సిటిసి - సౌత్ సెంట్రల్ జోన్,
9-1-129/1/302,3rd ప్లోర్, ఆక్స్ ఫార్డ్ ప్లాజా
S.D రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ.
మొబైల్ నంబర్: 04027702407, 9701360701.
ఐఆర్సిటిసి - టూరిజం ఇన్ఫర్మేషన్ ఆండ్ ఫెసిలిటేషన్ సెంటర్,
విజయవాడ రైల్వే స్టేషన్ - 8287932312
తిరుపతి రైల్వే స్టేషన్ - 8287932313

