MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • IRCTC Godavari Temple Tour : కేవలం రూ.5670 కే 4 రోజుల వీకెండ్ టూర్.. హైదరాబాద్ నుండి ఈ ఆంధ్రా ఆలయాలు, అందాలను చుట్టిరండి

IRCTC Godavari Temple Tour : కేవలం రూ.5670 కే 4 రోజుల వీకెండ్ టూర్.. హైదరాబాద్ నుండి ఈ ఆంధ్రా ఆలయాలు, అందాలను చుట్టిరండి

IRCTC Godavari Temple Tour : గోదావరి జిల్లాల అందాల గురించి కథలుకథలుగా చెబుతుంటారు. మరి మీరు కూడా ఈ అందాలను చూడాలనుకుంటున్నారా..? అయితే ఐఆర్సిటిసి గోదావరి టెంపుల్ టూర్ ప్లాన్ ఎంచుకొండి.

3 Min read
Author : Arun Kumar P
Published : Jun 06 2026, 12:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరబాదీలకు గోదావరి జిల్లాల అందాలను వీక్షించే సూపర్ ఛాన్స్..
Image Credit : Gemini AI

హైదరబాదీలకు గోదావరి జిల్లాల అందాలను వీక్షించే సూపర్ ఛాన్స్..

IRCTC Godavari Temple Tour : పరవళ్లు తొక్కుతూ పారే గోదావరి నది సోయగాలు, నది ఒడ్డున అందమైన దేవాలయాలు, భూతల్లి పచ్చని చీర కట్టుకుందా అన్నట్లుగా ఉండే పచ్చటి పంటపొలాలు, ఆకాశాన్ని తాకుతాయా అన్నట్లుగా రోడ్డుపక్కన కొబ్బరి తోటలు... ఆహా అనిపించేలా ఉంటుంది ఆ గోదావరి జిల్లాల అందం. ఆంధ్ర ప్రదేశ్ లోని ఈ అందమైన ప్రాంతాన్ని చుట్టివచ్చే అవకాశం హైదరాబాదీలకు కల్పిస్తోంది IRCTC (ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్). గోదావరి టెంపుల్ టూర్ పేరిట అన్నవరం, ద్రాక్షారామం, అంతర్వేది వంటి ఆలయాలతో పాటు గోదావరి జిల్లాల్లోని ప్రకృతి అందాలను వీక్షించే ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
IRCTC గోదావరి టెంపుట్ టూర్...
Image Credit : Chat GPT

IRCTC గోదావరి టెంపుట్ టూర్...

ప్రతి వీకెండ్ లో హైదరాబాద్ నుండి గోదావరి టెంపుల్ టూర్ ఉంటుంది. శుక్రవారం లింగంపల్లిలో ప్రారంభమయ్యే జర్నీ సోమవారం ముగుస్తుంది... 3 రాత్రులు, 4 పగళ్లు అంటే మొత్తంగా నాలుగు రోజుల టూర్ అన్నమాట. ఈ టూర్ ప్లాన్ ను హైదరాబాద్ లోని ఐటీ, ఇతర కార్పోరేట్ ఉద్యోగుల కోసమే ప్రత్యేకంగా రూపొందించినట్లు ఉంది. వీకెండ్ టూర్ కాబట్టి ధర ఎక్కువగా ఉంటుందని భయపడాల్సిన పనిలేదు... కేవలం రూ.5670 నుండే ప్యాకేజ్ ప్రారంభం అవుతుంది. గోదావరి తీరానగల రాజమండ్రి పట్టణాన్ని సందర్శించవచ్చు... అలాగే అన్నవరం, ద్రాక్షారామం, అంతర్వేది వంటి పుణ్యక్షేతాల దర్శనం ఉంటుంది.

ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ శైవ ఆలయాలను పంచారామాలు అంటారు... వీటిలో బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని దాక్షారామం బాగా ఫేమస్. దీనిని దక్షిణ కాశీగా భక్తులు నమ్ముతుంటారు.. ఇక్కడ శివలింగాన్ని స్వయంగా ఆ సూర్యభవానుడే ప్రతిష్ఠించారని భక్తులు నమ్ముతారు. పరమశివుడి మామగారు దక్ష ప్రజాపతి పేరుమీద ఈ ఆలయానికి దాక్షారామం పేరు వచ్చింది. ఇంతటి చరిత్ర గల ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు.

Related Articles

Related image1
IRCTC Tour Package : రూ.11,999 కే 6 రోజుల ఫ్యామిలీ టూర్.. తిరుపతి, శ్రీకాళహస్తి, కొల్హాపూర్ టెంపుల్స్ తో పాటు ఇంకెన్నో
Related image2
IRCTC North India Tour : రూ.16500కే 10 రోజుల ఉత్తరాది ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుండి కాశీ, అయోధ్య, ప్రయాగరాజ్, పూరి, గయ యాత్ర
35
గోదావరి టెంపుట్ టూర్ ప్యాకేజ్ టికెట్ ధరలివే..
Image Credit : gemini

గోదావరి టెంపుట్ టూర్ ప్యాకేజ్ టికెట్ ధరలివే..

కంపర్ట్ (3AC) :

ఒక్కరికి (సింగిల్ షేరింగ్) : రూ.15400

ఇద్దరికి (ట్విన్ షేరింగ్) : రూ.8990

ముగ్గురికి (ట్రిపుల్ షేరింగ్) : రూ.7230

5 నుండి 11 ఏళ్లలోపు చిన్నారులకు బెడ్ తో కూడిన ప్రయాణంకోసం అదనంగా రూ.6140, బెడ్ లేకుండా ప్రయాణం కోసం రూ.5020 చెల్లించాల్సి ఉంటుంది.

స్టాండర్డ్ (స్లీపర్) :

ఒక్కరికి (సింగిల్ షేరింగ్) : రూ.13840

ఇద్దరికి (ట్విన్ షేరింగ్) : రూ.7430

ముగ్గురికి (ట్రిపుల్ షేరింగ్) : రూ.5670

5 నుండి 11 ఏళ్లలోపు చిన్నారులకు బెడ్ తో కూడిన ప్రయాణంకోసం అదనంగా రూ.4580, బెడ్ లేకుండా ప్రయాణం కోసం రూ.3460 చెల్లించాల్సి ఉంటుంది.

45
గోదావరి టెంపుట్ టూర్ సాగుతుందిలా...
Image Credit : gemini

గోదావరి టెంపుట్ టూర్ సాగుతుందిలా...

DAY 1 (శుక్రవారం) :

మొదటిరోజు లింగంపల్లి నుండి రైలు ప్రారంభం అవుతుంది. బేగంపేట, సికింద్రాబాద్, భువనగిరి, కాజీపేట మీదుగా రాత్రంతా జర్నీ సాగుతుంది. ఈ స్టేషన్ల నుండి కూడా ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవచ్చు.

Day 2 (శనివారం) :

తెల్లవారుజామన రాజమండ్రి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. ఇక్కడినుండి రోడ్డుమార్గంలో హోటల్ కి చేరుకుని ప్రెష్ అయ్యాక రోడ్డుమార్గంలో అన్నవరం చేరుకుంటారు. అక్కడ సత్యనారాయణస్వామిని దర్శించుకుని సాయంత్రానికి తిరిగా రాజమండ్రి చేరుకుంటారు. ఇక్కడ గోదావరి ఘాట్, ఇస్కాన్ టెంపుల్ సందర్శన ఉంటుంది. రాత్రి రాజమండ్రిలోనే బస చేయాలి.

Day 3 (ఆదివారం) :

రాజమండ్రి నుండి అంతర్వేది ప్రయాణం ఉంటుంది. అక్కడ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దర్శనం ఉంటుంది... అలాగే బీచ్ సందర్శన ఉంటుంది. తర్వాత శ్రీ బాల బాలాజీ టెంపుల్, అప్పనపల్లి, విఘ్నేశ్వర టెంపుల్, ఐనవల్లి సందర్శన ఉంటుంది. సాయంత్రం ద్రాక్షారామం టెంపుల్ కి చేరుకుంటారు. ఆ తర్వాత తిరిగి రాజమండ్రి రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రంతా జర్నీ ఉంటుంది.

Day 4 (సోమవారం) :

తెల్లవారుజామున హైదరాబాద్ లోని సికింద్రాబాద్ కు ట్రైన్ చేరుకుంటుంది. లింగపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకోవడంతో ఈ యాత్ర ముగుస్తుంది.

55
గోదావరి టెంపుట్ టూర్ లో ఐఆర్సిటిసి కల్పించే సదుపాయాలు..
Image Credit : Gemini AI

గోదావరి టెంపుట్ టూర్ లో ఐఆర్సిటిసి కల్పించే సదుపాయాలు..

ఎంచుకున్న ప్యాకేజీని బట్టి 3AC, స్లీపర్ బెర్త్ సదుపాయం ఉంటుంది. రోడ్డు ప్రయాణంలో ఏసి వాహనం ఉంటుంది. రాజమండ్రి హోటల్లో బస ఫ్రీ. ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. టోల్, పార్కింగ్ వంటి ఖర్చులు కూడా ఉండవు.

అయితే ఫుడ్ ఖర్చులు మాత్రం ప్రయాణికులే పెట్టుకోవాలి. అలాగే దేవాలయాలు, ఇతర ప్రాంతాల్లో ఏవైనా టికెట్స్ ఉంటే అవి కూడా భరించాలి. బోటింగ్, హార్స్ రైడింగ్ వంటి గేమ్స్ కు సొంత ఖర్చులే. టూర్ గైడ్ కావాలన్నా సొంతంగా అరేంజ్ చేసుకోవాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Lockets: చిన్న పిల్లల కోసం అదిరిపోయే గోల్డ్ లాకెట్స్.. చూసేయండి
Recommended image2
Baby Earrings: 1 గ్రాములో బేబీ ఇయర్ రింగ్స్.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో
Recommended image3
Temple Jhumka: ఈ టెంపుల్ ఇయర్ రింగ్స్ తో.. చీరకు రాయల్ లుక్ గ్యారెంటీ
Related Stories
Recommended image1
IRCTC Tour Package : రూ.11,999 కే 6 రోజుల ఫ్యామిలీ టూర్.. తిరుపతి, శ్రీకాళహస్తి, కొల్హాపూర్ టెంపుల్స్ తో పాటు ఇంకెన్నో
Recommended image2
IRCTC North India Tour : రూ.16500కే 10 రోజుల ఉత్తరాది ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుండి కాశీ, అయోధ్య, ప్రయాగరాజ్, పూరి, గయ యాత్ర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved