MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • IRCTC Beta Website: ఇకపై మెరుపు వేగంతో ట్రైన్ టికెట్ బుకింగ్.. కొత్త వెబ్‌సైట్ లాంచ్!

IRCTC Beta Website: ఇకపై మెరుపు వేగంతో ట్రైన్ టికెట్ బుకింగ్.. కొత్త వెబ్‌సైట్ లాంచ్!

IRCTC Beta Website: భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. IRCTC తన కొత్త బీటా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై రైలు టికెట్లను చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ కొత్త వెబ్‌సైట్ విశేషాలేంటో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jul 16 2026, 05:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
IRCTC కొత్త బీటా వెబ్ సైట్
Image Credit : AI

IRCTC కొత్త బీటా వెబ్ సైట్

మన దేశంలో రోజూ లక్షలాదిమంది రైలు ప్రయాణం చేస్తుంటారు. తక్కువ ఖర్చుతో, సౌకర్యంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువమంది రైలు ప్రయాణం చేసేందుకు ఇష్టపడతారు. సాధారణంగా ప్రయాణికులు IRCTC యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే, పాత IRCTC వెబ్‌సైట్‌లో టికెట్ బుకింగ్‌లో కొన్ని సమస్యలు ఉండేవి. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే IRCTC కొత్త బీటా వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇది ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ని మరింత సులభతరం చేస్తుంది. ఈ కొత్త వెర్షన్‌లో వచ్చిన మార్పులేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వేగవంతమైన బుకింగ్
Image Credit : x

వేగవంతమైన బుకింగ్

IRCTC కొత్త బీటా వెబ్‌సైట్ ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉంది. దీన్ని యూజర్ ఫ్రెండ్లీగా రూపొందించారు. ప్రస్తుతం మనం వాడుతున్న IRCTC వెబ్‌సైట్ 2002లో ప్రారంభమైంది. దీని ద్వారా సగటున రోజుకు 14.5 లక్షలకు పైగా టికెట్లు బుక్ అవుతున్నాయి. దాదాపు 24 సంవత్సరాల తర్వాత IRCTC వెబ్ సైట్ లో భారీ మార్పులు తీసుకువస్తున్నారు. ఈ కొత్త వెబ్‌సైట్ డిజైన్ చాలా సింపుల్‌గా ఉంటుంది. అనవసరమైన పాప్-అప్‌లు, గ్రాఫిక్స్ వంటివి ఏమీ ఉండవు. ముఖ్యంగా, టికెట్ బుక్ చేసేటప్పుడు క్యాప్చా (Captcha) ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. దీంతో బుకింగ్ మరింత వేగంగా పూర్తవుతుంది.

34
ఇప్పుడు ఆ అవసరం లేదు
Image Credit : Getty

ఇప్పుడు ఆ అవసరం లేదు

గతంలో టికెట్ బుక్ చేసేటప్పుడు ప్రతిసారీ వ్యక్తిగత వివరాలు ఇవ్వాల్సి వచ్చేది. ఇకపై ఆ అవసరం లేదు. ఒక్కసారి మీ వివరాలు ఇస్తే సరిపోతుంది. చెక్-అవుట్ ప్రాసెస్ కూడా చాలా సులభం చేశారు. పాత వెబ్‌సైట్‌లో చాలా స్టెప్స్, ఎక్కువ స్క్రోలింగ్ ఉండేవి. కొత్త వెబ్‌సైట్‌లో ఈ దశల సంఖ్యను బాగా తగ్గించారు. ప్రస్తుత మెయిన్ వెబ్‌సైట్ హోమ్‌పేజీలోనే 'Try New Beta Version' అనే లింక్ ద్వారా ఈ కొత్త సైట్‌లోకి వెళ్లొచ్చు. పాత లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌తోనే లాగిన్ అవ్వొచ్చు. కొత్త అకౌంట్ అవసరం లేదు.

44
ఒక్క క్లిక్ తో..
Image Credit : Gemini AI

ఒక్క క్లిక్ తో..

కొత్త వెబ్ సైట్లో బుకింగ్ హిస్టరీ, రీఫండ్ స్టేటస్‌ను ఒక్క క్లిక్‌తో చూసే సదుపాయాన్ని మెరుగుపరిచారు. రైలు వెతికేటప్పుడు, మీరు కోరిన తేదీలో టికెట్లు లేకపోతే, ఆ తర్వాత తేదీల్లో టికెట్ల లభ్యతను (Alternative Dates Availability) ఈ సైట్ ఆటోమేటిక్‌గా చూపిస్తుంది. ప్రయోగాత్మక దశ పూర్తయ్యాక, ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మరిన్ని మార్పులు చేసి, త్వరలోనే దీన్ని ప్రధాన వెబ్‌సైట్‌గా మారుస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ప్రయాణం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Mettelu: ఈ అందమైన మెట్టెలు చూస్తే ఫిదా అయిపోతారు
Recommended image2
Aloe Vera: కలబందను ఇలా వాడితే మీ అందం రెట్టింపు కావడం పక్కా!
Recommended image3
దేవుడి గదిలో మట్టి కుండ, రాతి ఉప్పు పెట్టి చూడండి... కొన్ని రోజుల్లోనే మీ జీవితంలో మార్పులు
Related Stories
Recommended image1
Railway Track: రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో ఎప్పుడైనా ఆలోచించారా?
Recommended image2
Train Horn Meaning: ట్రైన్ హారన్ వెనుక ఇంత అర్థముందా? ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved