MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • IRCTC North India Tour : రూ.16500కే 10 రోజుల ఉత్తరాది ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుండి కాశీ, అయోధ్య, ప్రయాగరాజ్, పూరి, గయ యాత్ర

IRCTC North India Tour : రూ.16500కే 10 రోజుల ఉత్తరాది ట్రిప్.. తెలుగు రాష్ట్రాల నుండి కాశీ, అయోధ్య, ప్రయాగరాజ్, పూరి, గయ యాత్ర

తెలుగు ప్రజలకు IRCTC బంపరాఫర్ ప్రకటించింది. హైదరాబాద్ తో సహా తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల నుండి ఉత్తరాదిలోని పుణ్యక్షేత్రాలకు నేరుగా యాత్రను ప్రారంభించవచ్చు... కేవలం ఒక్క టికెట్ తో. ఈ టూర్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 04 2026, 05:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
 తెలుగు ప్రజలకు సూపర్ ఛాన్స్..
Image Credit : Gemini AI

తెలుగు ప్రజలకు సూపర్ ఛాన్స్..

IRCTC North India Tour : రుతుపవనాలు కేరళను తాకాయి కాబట్టి ఇక వేసవి ముగిసినట్లే. మెళ్లిగా వర్షాలు మొదలై రాబోయే రోజుల్లో జోరందుకుంటాయి... ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ఇలా వర్షాల సమయంలో ఫ్యామిలీ అంతా ఏదైనా టూర్ కి వెళితే హాయిగా గడపవచ్చు. ఇలా ఆలోచించే తెలుగవారి కోసమే అన్నట్లుగా IRCTC (ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) ఉత్తర భారతదేశ టూర్ ప్లాన్ రెడీ చేసింది. హైదరాబాద్ నుండి ప్రారంభమయ్యే ఈ ఆద్యాత్మిక యాత్ర ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ పట్టణాల మీదుగా సాగుతుంది. కాబట్టి తెలుగు ప్రజలకు అనుకూలంగా ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఉత్తరాది పుణ్యక్షేత్రాల టూర్ ప్లాన్ ఇదే..
Image Credit : Gemini AI

ఉత్తరాది పుణ్యక్షేత్రాల టూర్ ప్లాన్ ఇదే..

దక్షిణాది రాష్ట్రాల ప్రజలు ఉత్తర భారతదేశంలోని ప్రముఖ దేవాలయాలని సందర్శించాలని భావిస్తుంటారు. అలాంటివాటిలో ఆ పరమశివుడు వెలిసిన వారణాసి (కాశీ), శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య, పూరి జగన్నాథ ఆలయం, ప్రయాగరాజ్, గయ వంటి పుణ్యక్షేత్రాలు ఉంటాయి. కానీ ఈ ఆలయాలన్నింటిని సందర్శించాలంటే ఖర్చుతో కూడుకున్న పని. ఇలాంటివారి కోసమే ఇండియన్ రైల్వేకు చెందిన సంస్థ ఐఆర్సిటిసి కేవలం రూ.16,500కే ఈ ఆలయాలను చుట్టివచ్చేలా యాత్ర ప్యాకేజీని తీసుకొచ్చింది. 9 రాత్రులు, 10 పగళ్ల పాటు ఈ యాత్ర సాగుతుంది.

ఈ యాత్రలో ఒడిషాలోని పూరి జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయం... బిహార్ గయలోని విష్ణుపాద ఆలయం... ఉత్తర ప్రదేశ్ లోని కాశీ విశ్వనాథ ఆలయం, విశాలాక్షి, అన్నపూర్ణేశ్వరి ఆలయాలను దర్శించుకోవచ్చు. అలాగే ప్రసిద్ధ గంగా హారతిని చూసే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఉత్తర ప్రదేశ్ లోనే అయోధ్య రామజన్మభూమి ఆలయం, హనుమాన్ గఢీ, సరయూ నది హారతి, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమానికి కూడా తీసుకెళ్తారు.

35
తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి అవకాశం...
Image Credit : Gemini AI

తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంచి అవకాశం...

ఈ యాత్ర కోసం 'భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ రైలు'ను ఏర్పాటు చేశారు. ఈ రైలు ఆగస్టు 4, 2026 లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. తెలంగాణలోని అనేక ప్రాంతాల నుండి సికింద్రాబాద్‌కు రైళ్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఇక్కడికి చేరుకుని ఈ యాత్రను ప్రారంభించవచ్చు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లోని చాలా రైల్వే స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణం సాగుతుంది. ఇలా తెలుగు ప్రజలందరు ఈ నార్త్ ఇండియా టూర్ అవకాశాన్ని సులభంగా వినియోగించుకోవచ్చు.

ప్రయాణికులు రైలు ఎక్కడానికి, దిగడానికి పలు స్టేషన్లలో అవకాశం కల్పించారు. తెలంగాణలోని సికింద్రాబాద్, చర్లపల్లి, కాజీపేట, వరంగల్, ఖమ్మం స్టేషన్లు... ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమహేంద్రవరం, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం జంక్షన్‌లలో ఈ రైలు ఆగుతుంది.

45
ఉత్తరాది పుణ్యక్షేత్రాల టూర్ టికెట్ ధరలివే..
Image Credit : Gemini AI

ఉత్తరాది పుణ్యక్షేత్రాల టూర్ టికెట్ ధరలివే..

ఉత్తరాది పుణ్యక్షేత్రాల దర్శనం కోసం ప్రకటించిన భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ రైలులో మీ బడ్జెట్‌కు తగినట్లు వివిధ క్లాస్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

స్లీపర్ క్లాస్ (ఎకానమీ) : ఒక్కొక్కరికి రూ. 16,500 (5-11 ఏళ్ల పిల్లలకు రూ. 15,400)

థర్డ్ ఏసీ (3AC) : ఒక్కొక్కరికి రూ. 25,600 (పిల్లలకు రూ. 24,300)

సెకండ్ ఏసీ (2AC) : ఒక్కొక్కరికి రూ. 33,400 (పిల్లలకు రూ. 31,800)

ఈ 10 రోజుల యాత్రలో కేవలం ప్రయాణం మాత్రమే కాదు అనేక సౌకర్యాలు ఉంటాయి. స్థానికంగా తిరగడానికి వాహనాలు, వసతి, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం (శాకాహారం), టూర్ గైడ్ సేవలు, ప్రయాణ భీమా వంటి అనేక సౌకర్యాలు ఈ ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.

55
ఉత్తరాది పుణ్యక్షేత్రాల టూర్ కి టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి..?
Image Credit : Instagram sudesh_das8 and sri_khetra_.puri

ఉత్తరాది పుణ్యక్షేత్రాల టూర్ కి టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి..?

  • ఈ యాత్రకు టికెట్లు బుక్ చేసుకోవడానికి IRCTC అధికారిక వెబ్ సైట్ https://www.irctctourism.com/bgaurav?searchKey=&tagType=&travelType=Domestic§or=All&bdar=3 లింక్‌పై క్లిక్ చేయండి.
  • IRCTC పేజీ ఓపెన్ కాగానే కిందకు స్క్రోల్ చేయండి... AYODHYA- KASHI: PUNYA KSHETRA YATRA WITH BAIDYANATH DHAM టూర్ ప్యాకేజీ కనిపిస్తుంది.
  •  కుడి వైపున ఉన్న 'బుక్ నౌ' బటన్‌పై క్లిక్ చేయండి. 
  •  తర్వాత మీ వివరాలను నమోదు చేయండి. 
  •  మీరు ఏ స్టేషన్ నుంచి రైలు ఎక్కుతారో ఆ వివరాలు ఇవ్వండి. 
  • చివరగా, డబ్బులు చెల్లించి మీ టికెట్‌ను బుక్ చేసుకోండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Mettelu: ఈ అందమైన మెట్టెలు చూస్తే ఫిదా అయిపోతారు
Recommended image2
Aloe Vera: కలబందను ఇలా వాడితే మీ అందం రెట్టింపు కావడం పక్కా!
Recommended image3
దేవుడి గదిలో మట్టి కుండ, రాతి ఉప్పు పెట్టి చూడండి... కొన్ని రోజుల్లోనే మీ జీవితంలో మార్పులు
Related Stories
Recommended image1
IRCTC Tour Package : నేపాల్ పశుపతినాథ్ నుండి శ్రీశైలం మల్లన్న వరకు.. రూ.15 వేలకే ఐఆర్సిటిసి సూపర్ టూర్ ప్లాన్
Recommended image2
IRCTC Tour Package : రూ.11,999 కే 6 రోజుల ఫ్యామిలీ టూర్.. తిరుపతి, శ్రీకాళహస్తి, కొల్హాపూర్ టెంపుల్స్ తో పాటు ఇంకెన్నో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved