Yoga day 2022: గర్భిణులు ఈ యోగాసనాలు చేస్తే డెలివరీ సులువుగా అవుతుంది..!
Yoga day 2022: మన శారీరక, మానసిక ఎదుగుదలకు యోగా చాలా ముఖ్యం. యోగా (international yoga day 2022) గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి ఏడాది జూన్ 21 న ప్రపంచ యోగా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తారు. యోగా ప్రతి వయస్సు వారు చేయొచ్చుు. దీన్నిచేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా గర్భధారణ సమయంలో యోగా చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ సమయంలో ఏ యోగాసనాలు వేయాలి? ఏది చేయకూడదు? అనే విషయాల్లో అవగాహన ఉండాలి. ఇంతకు గర్భిణులు ఎలాంటి ఆసనాలు వేయొచ్చు తెలుసుకుందాం పదండి.

మర్జారియాసన్ (margariasana): గర్భధారణ సమయంలో చాలా మంది స్త్రీలు వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఇలాంటి వారు మార్జారియాసనం (margariasana)వేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఇది వెన్నునొప్పిని తగ్గించడమే కాకుండా కండరాలను బలంగా చేస్తుంది.
వజ్రాసనం (Vajrasana): గర్భధారణ సమయంలో వజ్రాసనం చేయడం వల్ల కాళ్ళు, మోకాళ్లు, చీలమండలు బలపడతాయి. మానసిక ఒత్తిడి నుంచి కూడా బయటపడతారు. అంతే కాదు తిన్న తర్వాత వజ్రాసనం వేయడం వల్ల జీర్ణశక్తి కూడా బలపడుతుంది.
తడాసనం: నిటారుగా నిలబడి మీ చేతులను పైకి లేపి తడాసనం చేయడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కండరాలు కూడా దృఢంగా ఉంటాయి.
సీతాకోకచిలుక ఆసనాలు (butterfly asana): సీతాకోకచిలుక ఆసనాలు చేయడం వల్ల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీకు విశ్రాంతినిస్తుంది. తొడల ఎముకలను సాగదీస్తుంది, అలాగే సాధారణ డెలివరీ అవకాశాలను పెంచుతుంది.
Viparita Karani : ఈ యోగాసనం ద్వారా కాళ్ల నొప్పులు తొలగిపోతాయి. గర్భధారణ సమయంలో నిద్రలేమి సమస్యలు ఉంటే పడుకునే ముందు ఈ ఆసనం వేయండి.
ప్రాణాయామం (Pranayam): ప్రాణాయామం గర్భధారణ సమయంలో సులభమైన, అత్యంత ప్రభావవంతమైన ఆసనాలలో ఒకటి. దీన్ని చేసేటప్పుడు శ్వాస, ఉచ్ఛ్వాస ప్రక్రియను పునరావృతం చేస్తూ ఉండాలి. ఇది మీకు మానసిక ఒత్తిడిని కలిగించదు. శ్వాసకోశ సమస్యలను కూడా దూరం చేస్తుంది.
కోనసన (konasana): కోనసనం చేయడం ద్వారా గర్భధారణ సమయంలో గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. అంతే కాదు ఈ ఆసనం వేయడం వల్ల కండరాలు కూడా బలపడతాయి.
త్రికోణాసనం : గర్భిణీ స్త్రీలు తమ మొదటి త్రైమాసికం నుంచి అంటే 3 నెలల తరువాత ఈ యోగాసనాన్ని ప్రారంభించవచ్చు. దీనిలో త్రికోణాసనం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వెన్ను, నడుము, మెడను బలోపేతం చేయడంతో పాటు జీర్ణశక్తిని బలోపేతం చేస్తుంది.
గర్భిణీ స్త్రీలు వైద్యుడి అనుమతి లేకుండా ఎటువంటి యోగాసనాలు వేయకూడదు. ఒకవేళ మీ గర్భధారణకు ఎలాంటి సమస్య లేనట్లయితే డాక్టర్ అనుమతి తరువాత మీరు ఈ యోగాసనాన్ని వేయవచ్చు.