చలికాలంలో చాలామంది ముఖం నల్లగా మారుతుంది. ట్యానింగ్ అవుతుంది. ఇంట్లో చేసిన ఫేస్ ప్యాక్ వేసుకుంటే మీ చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
ఫేస్ మాస్క్ తయారుచేయడం చాలా సులభం. 2 చెంచాల శనగపిండి, 1 చెంచా ముల్తానీ మట్టి, కాఫీ, నిమ్మరసం, 2 చెంచాల పెరుగు కావాలి.
అన్ని పదార్థాలను కలిపి పెట్టుకోండి. ఈ ఫేస్ మాస్క్‌ను ముఖానికి, మెడకు రాసుకోవచ్చు. సున్నితంగా మసాజ్ చేసి 20 నిమిషాలు అలానే వదిలేయండి. తర్వాత ముఖం కడుక్కోండి.
ఆ తర్వాత శుభ్రమైన నీటితో ముఖం కడుక్కోండి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే ట్యానింగ్ తగ్గుతుంది. శనగపిండితో మీ ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.
ఫేస్ ప్యాక్ కోసం అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇంట్లో దొరికే వాటితో ఈ ఫేస్‌ప్యాక్‌ను మూడుసార్లు వాడితే మీ ముఖంపై మంచి గ్లో వస్తుంది.
ప్రతి ఇంట్లోను శెగనపిండి ఉంటుంది. వందల రూపాయలు బ్యూటీ పార్లర్ కు ఖర్చుపెట్టే బదులు శెనగపిండి వాడడం మంచిది.
శెనగపిండిలో చిటికెడు పసుపు కలిపి ముఖానికి పట్టింవచ్చు. ముల్తాని మట్టి, కాస్త పాలు వంటివి కలిపి రాసినా చాలు. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన అవసరం రాదు.