పెట్రోల్ ధర తగ్గి నీళ్ల ధర పెరిగితే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?
నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంత అవసరమో అందరికీ తెలుసు. శరీరానికి సరిపడా నీళ్లు తాగితే సగం జబ్బులు రావంటారు నిపుణులు. నీళ్లకి అంతా ప్రాధాన్యం ఉంది. కానీ ఏదో ఒకరోజు పెట్రోల్ రేట్ తగ్గి.. నీళ్ల రేటు పెరిగితే ఏమవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మార్పు మన జీవితంపై ఎలా ఉంటుందో ఒకసారి జస్ట్ అలా ఊహించుకుందామా?

ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు తాగడం అవసరం. ఒకప్పుడు ఫ్రీగా దొరికిన నీళ్లను.. ఇప్పుడు కొనుక్కొని తాగుతున్నాం. స్థాయిని బట్టి వాటర్ బాటిల్ రేటు మారిపోతుంటుంది. ఏదో ఒక రోజు వాటర్ కి రేటు పెరిగి పెట్రోల్ కి ధర తగ్గిందనుకోండి అప్పుడు ఏమవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఇప్పుడు ఆలోచిద్దాం పోయేదేముంది.
పెట్రోల్ రేటు తగ్గితే?
పెట్రోల్ రేటు తగ్గితే కార్ లేదా బైక్ నడపడంలో ఆనందిస్తారు. తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయచ్చు. దూరం ప్రయాణాలు కూడా తక్కువ ఖర్చుతో చేయచ్చు. ఎక్కడికైనా హాయిగా వెళ్లొచ్చు. ట్రాన్స్ పోర్టేషన్ ఖర్చు తగ్గుతుంది. దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా దీని ప్రభావం ఉంటుంది.
తక్కువ ధరకే పెట్రోల్ వస్తే దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు వస్తాయి. ట్రాన్స్ పోర్ట్, గూడ్స్ వెహికల్స్ అద్దె తగ్గుతుంది. దీనివల్ల అన్ని వస్తువుల ధరలు తగ్గుతాయి. కానీ దీనివల్ల ఎక్కువ మంది వాహనాలు నడుపుతారు. కాలుష్యం పెరిగి పర్యావరణానికి ప్రమాదం ఏర్పడుతుంది.
నీళ్లు రేటు పెరిగితే ఏమవుతుంది?
నీళ్ల రేటు పెరిగితే జీవితం కష్టమవుతుంది. ప్రతి గ్లాసు నీటి గురించి ఆలోచించాల్సి వస్తుంది. ఇంట్లో నీటిని తక్కువగా వాడాల్సి వస్తుంది. నీటిని ఆదా చేసి తాగితే డీహైడ్రేషన్, కిడ్నీ సమస్యలు వస్తాయి. పేద ప్రజలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని ప్రభావం వ్యవసాయంపై కూడా పడుతుంది. నీళ్లు రేటు పెరిగితే వ్యవసాయం కష్టమవుతుంది. పంటలు సరిగ్గా పండవు. ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయి.
పేద, ధనిక వర్గాల మధ్య తేడా పెరుగుతుంది!
నీళ్ల రేటు పెరిగితే ధనవంతులు ఎక్కువ నీళ్లు వాడుకోగలరు. కానీ పేదలకు చాలా ఇబ్బంది అవుతుంది. దీనివల్ల సామాజిక అసమానతలు పెరుగుతాయి. ధనవంతులకు నీళ్లు సులువుగా దొరుకుతాయి. పేదలు మాత్రం కష్టపడాల్సి వస్తుంది.
ఖర్చు పెరుగుతుంది.
నీళ్లు రేటు పెరిగితే, వ్యవసాయం, వ్యాపారం రెండూ దెబ్బతింటాయి. దీనివల్ల ఆహార పదార్థాల ధరలు పెరుగుతాయి. పెట్రోల్ రేటు తగ్గితే సంతోషంగా ఉంటుంది. కానీ నీళ్లు రేటు పెరిగితే మన జీవితం మరింత ఖరీదైందిగా మారుతుంది.
భవిష్యత్ తరాలకు నీరు ఉండాలంటే?
పెట్రోల్ రేటు తగ్గి నీళ్ల రేటు పెరగడం సాధ్యం కాదు. కానీ అలా జరిగితే దేశానికి మంచిది కాదు. ఇది ఆర్థికంగా చాలా సమస్యలను తెస్తుంది. దీనివల్ల సమాజంలో అసమానతలు, పోరాటాలు పెరుగుతాయి. అందుకే నీటి విలువను తెలుసుకోవాలి. నీటిని ఆదా చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే భవిష్యత్ తరాలకు కూడా నీటి కొరత లేకుండా ఉంటుంది.