- Home
- Astrology
- Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు అక్రమ సంబంధాలు పెట్టుకునే అవకాశం ఎక్కువ, వీరితో జాగ్రత్త
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వాళ్లు అక్రమ సంబంధాలు పెట్టుకునే అవకాశం ఎక్కువ, వీరితో జాగ్రత్త
Birth Date: సంఖ్యాశాస్త్రం చెబుతున్న ప్రకారం ప్రేమ, పెళ్లి విషయంలో అందరూ నిజాయితీగా ఉండరు. కొంతమంది తెలియక తప్పులు చేస్తుంటారు. తమ భాగస్వాములను మోసం చేసి వేరే ఎఫైర్లు పెట్టుకుంటారు. వీరి మనసు చంచలంగా ఉంటుంది.

రాడిక్స్ సంఖ్య 5
ఏ నెలలోనైనా 5, 14, 23 తేదీల్లో పుట్టిన వాళ్లు చాలా చురుకుగా ఉంటారు. ఏదైనా కొత్తగా చేయాలని ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఒకేరకమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడరు. ప్రేమ విషయంలో వీళ్లకు త్వరగా బోర్ కొట్టేస్తుంది. ఒకే పార్ట్ నర్ తో సర్దుకుపోలేరు. వీళ్లు తెలియకుండానే కొత్త మనుషుల వైపు ఆకర్షితులవుతారు. వీళ్లను కంట్రోల్ చేయడం జీవిత భాగస్వామికి కొంచెం కష్టమే.
రాడిక్స్ సంఖ్య 3
ఏ నెలలోనైనా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వాళ్లు చాలా బాగా మాట్లాడగలరు. ఎవరినైనా సులభంగా తమ మాటలతోనే కట్టి పడేస్తారు. వీళ్లతో ఉండటం చాలా సరదాగా ఉంటుంది కాబట్టి వీరి వైపు ఎంతో మంది ఆకర్షితులవుతారు. వీరి స్నేహపూర్వక ప్రవర్తన కొన్నిసార్లు దారి తప్పి సమస్యలను సృష్టిస్తుంది. తమ భాగస్వామి కంటే ఇతరులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీళ్లు సులభంగా ఇతరులకు లొంగిపోయే అవకాశం ఎక్కువ.
రాడిక్స్ సంఖ్య 8
ఏ నెలలో నైనా 8, 17, 26 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ సంఖ్య 8 అవుతుంది. ఈ అంకెకు అధిపతి శని దేవుడు. అందుకే వీళ్లు పనులను చాలా రహస్యంగా చేస్తారు. తమ మనసులో ఏముందో భాగస్వామికి చెప్పరు. ఏదైనా విషయంలో అసంతృప్తిగా ఉంటే, దాన్ని నేరుగా చెప్పకుండా వేరే మార్గాల్లో నడుస్తారు. ఇలా కొన్నిసార్లు మోసం చేస్తారు కూడా.
రాడిక్స్ సంఖ్య 2
ఏ నెలలోనైనా 2, 11, 20, 29 తేదీల్లో పుట్టిన వారి రాడిక్స్ సంఖ్య 2 అవుతుంది. వీరికి భావోద్వేగాలు చాలా ఎక్కువ. తమ పార్ట్‌నర్ నుంచి ఎక్కువ ప్రేమను ఆశిస్తారు. వాళ్ల నుంచి తగినంత ప్రేమ, సమయం దొరకకపోతే ఆ లోటును పూడ్చుకోవడానికి బయట స్నేహాలను కోరుకుంటారు. దీని వల్ల ఆ బంధాలు అక్రమ సంబంధాలకు దారితీయవచ్చు. ఇది నెమ్మదిగా వారి వివాహ బంధంలో పగుళ్లకు దారితీస్తుంది.

