MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Unlucky Plants: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు.. వెంటనే తీసేయండి!

Unlucky Plants: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు.. వెంటనే తీసేయండి!

Unlucky Plants: వాస్తు శాస్త్రమే కాదు పురాణాల ప్రకారం ఇంట్లో ఉండే మొక్కలు కూడా జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొన్ని మొక్కల వల్ల నెగెటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి, మనసులోకి వచ్చేస్తుంది. శ్రీకృష్ణుడే స్వయంగా కొన్ని మొక్కలు ఉండకూదడని చెప్పారు.

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 17 2026, 10:19 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కాక్టస్ వంటి ముళ్ల మొక్కలు
Image Credit : Getty

కాక్టస్ వంటి ముళ్ల మొక్కలు

వాస్తు ప్రకారం కాక్టస్‌తో సహా కొన్ని ముళ్ల మొక్కలను ఇంట్లో పెంచకూడదు. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం, ఈ మొక్కలు బాధ, ఒత్తిడిని కలిగిస్తాయి. ఇంట్లో పెరిగే ఈ మొక్కల వల్ల తరచూ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి. ఇవి మానసిక అశాంతికి దారితీస్తాయి. గులాబీలు తప్ప మిగతా అన్ని ముళ్ల మొక్కలు ఇంటి సంతోషానికి అడ్డుగా మారతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బోన్సాయ్ మొక్కలు
Image Credit : Getty

బోన్సాయ్ మొక్కలు

ఈ రోజుల్లో ఇంటీరియర్ డెకరేషన్ కోసం బోన్సాయ్ మొక్కలు బాగా పాపులర్ అయ్యాయి. బోన్సాయ్ అంటే పొట్టి మొక్కలు.  వాస్తు ప్రకారం వీటిని ఇంట్లో పెంచడం చాలా అశుభంగా భావిస్తారు. బోన్సాయ్ అనేది సహజ పెరుగుదల ఆగిపోయిన మొక్క. దీన్ని ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల కెరీర్, ఆర్థిక పురోగతికి ఆటంకం కలుగుతుందని చెబుతారు.

35
చింత చెట్టు
Image Credit : Getty

చింత చెట్టు

పాత నమ్మకాల ప్రకారం చింత చెట్టులో నెగెటివ్ శక్తులు దాగి ఉంటాయి. ఇంటి దగ్గర చింత చెట్లను పెంచకూడదు. ఇవి భయానక వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఆ ఇంటి కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ చెట్టు ఇంట్లోకి పేదరికాన్ని తీసుకొస్తుంది. ఇంట్లో ఉన్న సంపద అనవసరంగా కరిగిపోతుంది.

45
పాలు కారే మొక్కలు
Image Credit : Getty

పాలు కారే మొక్కలు

కొమ్మలు లేదా ఆకులు తుంచినప్పుడు తెల్లగా పాలలాంటి ద్రవం వచ్చే మొక్కలు చాలా ఉంటాయి. అలాంటి మొక్కలను కూడా ఇంట్లో ఉంచకూడదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కలు ఇంట్లోని పాజిటివ్ ఎనర్జీని పూర్తిగా పీల్చేస్తాయి. ఇలా జరగడం వల్ల ఆ ఇంట్లోకి ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

55
గోరింటాకు
Image Credit : Getty

గోరింటాకు

గోరింటాకు మొక్కను ఎంతో మంది ఇంటి పెరడులో, లేదా ఇంటి ముందు పెంచుతూ ఉంటారు. దీన్ని చేతికి మెహెందీని పెట్టుకునేందుకు వాడతారు. కానీ దీన్ని ఇంట్లో పెంచడం మంచిది కాదు. ఇది చెడు శక్తులను ఆకర్షిస్తుంది.

ఇంట్లో ఏదైనా మొక్క ఎండిపోతుంటే, వెంటనే దాన్ని పీకేయండి. ఎండిన మొక్కలు దురదృష్టానికి కారణంగా చెప్పుకుంటారు. ఇవి ఇంట్లో నెగెటివిటీని వ్యాపింపజేస్తాయి. అంతే కాదు ఇంట్లోకి వచ్చే ధన ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. దీనివల్ల ఇంట్లో అభివృద్ధి ఆగిపోతుంది. పేదరికం మిమ్మల్ని చుట్టుముడుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
తోటపని
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Kova Sweet: పాలు కాచే పనిలేకుండా మిల్క్ పౌడర్‌తో ఈజీగా కోవాలు చేసేయండిలా
Recommended image2
Diamond Ring: అమ్మాయిల మనసు దోచే లైట్ వెయిట్ డైమండ్ రింగ్స్
Recommended image3
ఈ పండు గుజ్జుతో ఫేస్ ప్యాక్ రోజూ వేశారంటే వారంలో ముఖానికి మెరుపు ఖాయం
Related Stories
Recommended image1
Losing Footwear: గుడిలో చెప్పులు పోతే మంచిదా? జ్యోతిషశాస్త్రం ఏం చెబుతోంది?
Recommended image2
Cheap Dating City: ప్రపంచంలోనే ప్రేమికులకు డేటింగ్ చేసేందుకు చవక నగరం ఇదే, మనదేశంలోనే ఉంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved