లో బీపీ సమస్యా..? ఇదిగో పరిష్కారం..
బీపీ ఎక్కువైనా.. తక్కువైనా ప్రమాదమే.. సాధారణ రక్తపోటు 120/80 వరకు ఉంటుంది. ఇంతకు తగ్గితే మెదడు, గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు దెబ్బతింటాయి.

మీరు ఆరోగ్యంగా ఉండాలంటే.. రక్తపోటు నార్మల్ గా ఉంటడం చాలా ముఖ్యం. ఇది పెరిగినా.. తగ్గినా ఎన్నో ప్రాణాంతక సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అయితే కొంతమంది అధిక రక్తపోటుతో బాధపడితే మరికొంతమంది మాత్రం తక్కువ రక్తపోటుతో ఇబ్బంది పడుతుంటారు. సాధారణ రక్తపోటు 120/80 వరకు ఉంటుంది. కానీ ఇది 90/60కి చేరుకుంటే రక్తపోటు తగ్గినట్టు. దీంతో మీరు హైపోటెన్షన్ సమస్య బారిన పడతారు. దీనివల్ల మీ గుండె, మూత్రపిండాలు, మెదడు, ఊపిరితిత్తులపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే రక్తపోటు నార్మల్ గా ఉండేట్టు చూసుకోవాలి. బీపీ తక్కువగా ఉన్నవారు రక్తపోటును ఎలా పెంచాలో తెలుసుకుందాం పదండి.
కాఫీ
చాలా సేపటి వరకు ఎలాంటి ఆహార పదార్థాలను తినకపోతే కూడా రక్తపోటు తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితిలో వెంటనే మీరు కాఫీని తాగండి. దీనిలో ఉండే కెఫిన్ కంటెంట్ బీపీని సాధారణ స్థితికి తెస్తుంది. కాఫీ మీకు లోబీపీ సమస్యలను పోగొడుతుంది.
ఉప్పు
అధిక రక్తపోటుతో బాధపడేవారు ఉప్పును ఎక్కువగా తీసుకోకూడదు. కానీ రక్తపోటు తక్కువగా ఉన్నవారు ఉప్పును తీసుకోవచ్చు. ఇందుకోసం నిమ్మరసంలో ఉప్పును కలిపి తాగాలి. ఇది మీ శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.
గింజలు
బాదం పప్పులు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా ఉపయోగపడతాయి. వీటితో రక్తపోటును కూడా పెంచొచ్చన్న సంగతి మీకు తెలుసా..? రాత్రి పూట కొన్ని గింజలను తీసుకుని నీళ్లలో వేసి బాగా మరిగించాలి. వీటిని గ్రైండ్ చేసి తినాలి. అలాగే వీటి వాటర్ ను కూడా తాగాలి. ఇది మీ రక్తపోటును నార్మల్ స్టేజ్ కి తీసుకొస్తుంది.
నీరు
మన శరీరానికి నీరు చాలా అవసరం. శరీరంలో నీటి కొరత ఏర్పడితే కూడా రక్తపోటు తగ్గుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మనం రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగాలి. అప్పుడే మన బాడీ హైడ్రేట్ గా, ఆరోగ్యంగా ఉంటుంది. మనన శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి కొబ్బరి నీరు, నిమ్మరసం సహాయపడతాయి.