Dosa Batter: దోశ పిండి మిగిలిపోతే ఈ వంటకాలన్నీ చేసేయండి, పిల్లలు ఇష్టంగా తింటారు
Dosa Batter: దోశ పిండి మిగిలిపోయిందా? మళ్లీ అవే దోశలు వేసే బదులు, అదే పిండితో కారం పొంగనాలు, కరకరలాడే బోండా, వెజిటబుల్ పాన్‌కేక్ వంటి ఎన్నో కొత్త వంటకాలు ప్రయత్నించవచ్చు. వాటి రెసిపీలు ఇక్కడ ఇచ్ాచము.
13

Image Credit : Asianet News
మిగిలిన పిండితో గుంత పొంగనాలు రెసిపీ
కావాల్సిన పదార్థాలు:
దోశ పిండి – 1 కప్పు
రవ్వ – 2 టేబుల్ స్పూన్లు
సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1
పచ్చిమిర్చి – 1
తురిమిన అల్లం – ½ టీస్పూన్
తరిగిన కరివేపాకు, కొత్తిమీర – కొద్దిగా
నూనె – తగినంత
తయారీ విధానం:
- ఒక గిన్నెలో దోశ పిండి, రవ్వ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
- పిండి మరీ గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. కానీ, పొంగనాల పెనంలో వేసేటప్పుడు పిండి మరీ పల్చగా ఉండకూడదు.
- పొంగనాల పెనం వేడి చేసి, ప్రతి గుంటలో కొద్దిగా నూనె వేయాలి.
- గుంటలో ముప్పావు వంతు వరకు పిండి వేసి, మంటను మీడియంలో పెట్టి మూతపెట్టి ఉడికించాలి.
- అడుగు భాగం గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి రాగానే, తిరగేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
23
Image Credit : Asianet News
వెజిటబుల్ పాన్ కేక్
కావాల్సిన పదార్థాలు:
దోశ పిండి – 1 కప్పు
తురిమిన క్యారెట్ – ¼ కప్పు
సన్నగా తరిగిన ఉల్లిపాయ – ½
సన్నగా తరిగిన క్యాప్సికమ్ – 2 టేబుల్ స్పూన్లు
మిరియాల పొడి – ¼ టీస్పూన్
కొత్తిమీర – కొద్దిగా
నూనె – తగినంత
తయారీ విధానం:
- దోశ పిండిలో తురిమిన క్యారెట్, ఉల్లిపాయ, క్యాప్సికమ్, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
- దోశ పెనం వేడి చేసి కొద్దిగా నూనె రాయాలి.
- ఒక చిన్న గరిటెడు పిండి తీసుకుని, పల్చటి దోశలా కాకుండా కాస్త మందంగా గుండ్రంగా పోసుకోవాలి.
- మంటను మీడియంలో పెట్టి మూతపెట్టి ఉడికించాలి.
- అడుగు భాగం బాగా ఉడికాక, తిరగేసి రెండో వైపు కూడా కాల్చుకోవాలి.
33
Image Credit : Asianet News
శాండ్ విచ్
కావాల్సిన పదార్థాలు:
దోశ పిండి – 1 కప్పు
ఉడికించి మెదిపిన బంగాళదుంప – 1
సన్నగా తరిగిన ఉల్లిపాయ – ½
పసుపు – చిటికెడు
కారం – ¼ టీస్పూన్
జీలకర్ర – ¼ టీస్పూన్
కొత్తిమీర – కొద్దిగా
నూనె – తగినంత
తయారీ విధానం:
- ఒక గిన్నెలో మెదిపిన బంగాళదుంప, ఉల్లిపాయ, పసుపు, కారం, జీలకర్ర, కొత్తిమీర వేసి బాగా కలపాలి.
- దోశ పెనం మీద చిన్నవిగా, కాస్త మందంగా దోశలు పోసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి.
- ఒక దోశ మీద తయారు చేసుకున్న బంగాళదుంప మసాలాను సమానంగా పరచాలి.
- దాని మీద మరో దోశను ఉంచి తేలికగా నొక్కాలి.
- మళ్లీ దోశ పెనం మీద పెట్టి రెండు వైపులా కొద్దిగా నూనె రాసి, బయట కరకరలాడే వరకు కాల్చుకోవాలి.
- చిన్న ముక్కలుగా కట్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.
Latest Videos

