Cauliflower: కాలీఫ్లవర్‌ను వీటితో క్లీన్ చేశారంటే.. దాక్కున్న పురుగులు కూడా పోతాయి
Cauliflower: కాలీఫ్లవర్ లో సహజంగానే పురుగులు పడుతుంటాయి. అందుకే చాలా మంది తినేందుకు భయపడతారు. నిజానికి కాలీఫ్లవర్ లోని పురుగులను తొలగించేందుకు చాలా సింపుల్ చిట్కాలు ఉన్నాయి.

కాలీఫ్లవర్ తినడం అవసరం
శీతాకాలంలో కాలీఫ్లవర్ మార్కెట్లలో అధికంగా లభిస్తుంది. దీనిలో ఎన్నో రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు. కానీ ఇంట్లో కాలీఫ్లవర్ వండాలంటే ఎంతో మంది భయపడతారు. అందులో పురుగులు ఉంటాయని తినరు. కానీ కాలీఫ్లవర్ మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. ఇది తినడానికి రుచిగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. క్యాబేజీలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి, ఫోలేట్, ఫైబర్, పొటాషియం, మాంగనీస్ వంటి అనేక పోషకాలుంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన పోషకాలు నిండుగా ఉంటాయి. కాబట్టి పురుగులకు భయపడి కాలీఫ్లవర్ తినడం మానేయకూడదు. ఆ పురుగులను జాగ్రత్తగా తొలగించి అప్పుడు వండుకుని తినాలి. లేకుంటే ఇందులో ఉండే పోషకాలు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది.
పురుగులను వదిలించే చిట్కాలు
కాలీఫ్లవర్లో ఉండే పోషకాలు మన జీర్ణవ్యవస్థకు, గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ ఇందులో తరచుగా పురుగులు ఉంటాయి. వాటిని తొలగించే చిట్కాలు కొన్ని ఉన్నాయి. కేవలం రెండు పదార్థాల సహాయంతో కాలీఫ్లవర్లోని పురుగులను సులభంగా వదిలించుకోవచ్చు. వీటితో కాలీఫ్లవర్లోని పురుగులు పూర్తిగా తొలగిపోతాయి. పువ్వులో మూలల్లో ఇరుక్కున్న చిన్న పురుగులు కూడా తొలగిపోతాయి. ఇందుకోసం మీరు పసుపు, ఉప్పును వాడాలి. ఈ రెండు సాయంతో సులభంగా పురుగులను తొలగించుకోవచ్చు. ఎలా తొలగించుకోవాలో తెలుసుకోండి.
ఇలా తొలగించండి
కాలీఫ్లవర్లోని పురుగులను తొలగించేందుకు ముందుగా ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకోండి. అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు కాలీఫ్లవర్‌ను ఈ ద్రావణంలో వేసి నానబెట్టండి. ఇలా చేయడం వల్ల కాలీఫ్లవర్లో ఉన్న పురుగులు బయటికి వచ్చి తేలిపోతాయి. వాటిని తొలగించేయాలి. ఆ తర్వాత క్యాబేజీ పూర్తిగా శుభ్రంగా, తినడానికి సురక్షితంగా ఉంటుంది. ఇది చాలా సింపుల్ పద్దతి. నీటిలో వేశాక కనీసం అరగంట పాటూ వదిలేయాలి. కాలీఫ్లవర్ మునిగేలా నీళ్లు వేయడం మర్చిపోవద్దు.
కాలీఫ్లవర్ కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు
కాలీఫ్లవర్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాని ఆకృతిని జాగ్రత్తగా చూడండి. పువ్వులు విడివిడిగా లేదా చెల్లాచెదురుగా ఉంటే దాన్ని కొనొద్దు. అందులో పురుగులు ఉండే అవకాశం ఉంది. కొనేటప్పుడు ఆకులను పరిశీలించాలి. ఆకులు వాడిపోయినట్టు ఉన్నా లేదా పసుపు రంగులో ఉన్న వాటిని కొనకండి. వాటిలో కీటకాలు ఉండే అవకాశం ఉంది. ఆకులు మాత్రం తాజాగా ఉండేలా చూసుకోండి. పురుగులున్న కాలీఫ్లవర్ తక్కువ బరువు ఉంటుంది. పురుగులు లేని క్యాబేజీ కొంచెం బరువుగా ఉంటుంది. కాలీఫ్లవర్ కొనేటప్పుడు చెడు వాసన వస్తుంటే దాన్ని కొనకండి. అది లోపల పాడైపోయి ఉండొచ్చు. మంచి కాలీఫ్లవర్ కి ఎలాంటి వాసన ఉండదు. కాబట్టి కాలీఫ్లవర్ చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి.

