- Home
- Entertainment
- Dil Raju Wife: మా అక్క డబ్బులు కోసమే పెళ్లి చేసుకుందన్నారు, మేము కూడా రిచ్.. దిల్ రాజు భార్య తమ్ముడి కామెంట్స్
Dil Raju Wife: మా అక్క డబ్బులు కోసమే పెళ్లి చేసుకుందన్నారు, మేము కూడా రిచ్.. దిల్ రాజు భార్య తమ్ముడి కామెంట్స్
Dil Raju Wife: దిల్ రాజు రెండో భార్య తేజస్విని అలియాస్ వైగా రెడ్డి. ఆమెకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. అందులో ఒకరు తరుణ్ ఉండవల్లి. ఈయన డాక్టర్. తన అక్క పెళ్లి గురించి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు.

దిల్ రాజు బావమరిది తరుణ్
తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్‌ఫుల్ నిర్మాతగా దిల్ రాజు మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన భార్య చిన్న వయసులోనే మరణించడంతో రెండో పెళ్లి చేసుకున్నారు. రెండో భార్య పేరు తేజస్విని అలియాస్ వైగా రెడ్డి. ఆమె బ్రాహ్మిణ్ కాగా దిల్ రాజు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు. వీరిద్దరూ ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అప్పటికే దిల్ రాజు తన కూతురికి పెళ్లి చేశారు. ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తేజస్విని, దిల్ రాజుల వివాహం ఒక గుడిలో సాధారణంగా జరిగింది. ఆ పెళ్లి తర్వాత ఎంతోమంది డబ్బుల కోసమే తేజస్విని దిల్ రాజును పెళ్లి చేసుకుందని ఎన్నో కామెంట్లు చేశారు. దీనిపై తాజా ఇంటర్వ్యూలో దిల్ రాజు భార్య తేజస్విని తమ్ముడు తరుణ్ ఉండవల్లి మాట్లాడారు.
మేము కూడా ధనవంతులమే
తరుణ్ ఉండవల్లి మాట్లాడుతూ తను డాక్టర్ గా పనిచేస్తున్నానని, ఇక తన తమ్ముడు హైకోర్టులో అడ్వకేట్ అని చెప్పారు. తల్లి కూడా హైకోర్టులో అడ్వకేట్ గానే పనిచేస్తుండగా, తండ్రి బిజినెస్ చేసి ఇప్పుడు అన్నీవదిలేసి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారని వివరించారు. అక్క తేజస్విని అంటే తనకు ఎంతో ఇష్టమని, చిన్నప్పటి నుంచి తనతోనే ఎక్కువగా మాట్లాడే వాడినని చెప్పారు. అక్క తేజస్విని దిల్ రాజుతో ప్రేమ విషయాన్ని కూడా తనతోనే ముందుగా చెప్పిందని.. ఆ పెళ్ళికి ఒప్పించడానికి ఇంట్లో చాలా కష్టపడ్డానని వివరించారు. అయితే అక్క డబ్బులు కోసం ఆశపడి దిల్ రాజును పెళ్లి చేసుకుందని కొంతమంది కామెంట్లు చేశారని అన్నారు. అయితే తమకు అలాంటి ఆలోచనే లేదని, తాము కూడా బాగా సెటిల్ అయిన ఫ్యామిలీ అని, ధనవంతులమేనని చెప్పారు తరుణ్. అక్క కేవలం టైంపాస్ కోసమే ఒక ఎయిర్ లైన్స్‌లో గ్రౌండ్ స్టాఫ్ గా ఉద్యోగం చేసేందుకు వెళ్లిందని, అది కూడా చాలా తక్కువ సమయమే చేసిందని చెప్పారు.
పెళ్లికి ఒప్పించాల్సి వచ్చింది
తన అక్క ఎయిర్ లైన్స్‌లో గ్రౌండ్ స్టాఫ్ గా పని చేస్తున్నప్పుడే దిల్ రాజు పరిచయమయ్యారని, ఎక్కువసార్లు వారిద్దరూ కలవడంతో పరిచయం పెరిగిందని ...అది పెళ్లి వరకు దారి తీసిందని చెప్పారు. అయితే తమ ఇంట్లో అక్కడ పెళ్లికి పెద్దవాళ్లు అంత త్వరగా ఒప్పుకోలేదని అన్నారు. తమది బ్రాహ్మిణ్ సామాజిక వర్గం కావడంతో అభ్యంతరాలు వచ్చాయని అన్నారు. చివరికి తానే ముందుండి అక్క పెళ్లికి ఇంట్లో వారిని ఒప్పించినట్టు చెప్పారు. దిల్ రాజు గురించి చెబుతూ తన బావ చాలా ఫన్నీగా ఉంటారని, ఇంట్లో బాగా కలిసి పోతారని వివరించారు. తమది చాలా ఆధ్యాత్మికమైన ఫ్యామిలీ అని చెప్పుకొచ్చారు తరుణ్. ఉదయం 5:30కి పూజ మొదలుపెడితే కొన్నిసార్లు సాయంత్రం వరకు చేస్తూనే ఉంటామని.. అలాంటి సమయంలో దిల్ రాజు గారు మీ అక్కకు ఇంతసేపు పూజలు నేర్పొద్దు అంటూ ఉంటారని తరుణ్ వివరించారు.
దిల్ రాజు కొడుకు గురించి
దిల్ రాజు కొడుకు కొడుకు గురించి కూడా చెప్పారు తరుణ్. ‘మా మేనల్లుడి పేరు శ్రీ అన్వయ్ రెడ్డి. చాలా నాటీ పిల్లాడు.మా అక్క వాడికి టీవీలు ఫోన్లు అలవాటు చేయలేదే. వాడికి ఏదైనా సరే వెంటనే అర్థం చేసుకునే శక్తి ఉంది. బాబును చూసే కేర్ టేకర్లకు కూడా ఫోన్లు, టీవీలు వద్దని చాలా కఠిన ఆంక్షలు పెట్టింది’ అని చెప్పారు తరుణ్. బాబుకి ఇప్పుడు డాన్స్, పెయింటింగ్ ట్రైనింగ్ ఇస్తున్నట్టు అన్నారు. మా అక్కలోని డైనమిజం, మా బావ బ్రెయిన్ కలిపి బాబుకి వచ్చింది అని చెప్పారు. ‘మా అక్క దిల్ రాజు గురించి ఫస్ట్ చెప్పినప్పుడు నాకు చాలా షాక్ అనిపించింది.. కానీ మా బావ మా అక్కను మహారాణిలా చూసుకుంటాడు.. మేము ఇప్పుడు అందరం సంతోషంగా ఉన్నాము, బయట వచ్చే చెడు కామెంట్లను పట్టించుకోము మా బావగారు కూడా వాటిని పట్టించుకోవద్దని చెప్పేసారు’ అని ముగించాడు తరుణ్

