MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Gaining Fat : ఎంత తిన్నా బక్కగానే కనిపిస్తున్నారా? ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించండి

Gaining Fat : ఎంత తిన్నా బక్కగానే కనిపిస్తున్నారా? ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించండి

Gaining Fat : కొందరు లావుగా ఉన్నామని బాధపడితే.. మరికొందరు అయ్యో నేను మరీ ఇంత బక్కగా ఉన్నానే అంటూ తెగ ఇదైపోతుంటారు. కొంతమంది ఎంత తిన్నా ఒంటికి పట్టకా అలాగే పుల్లలాగ ఉంటారు. దీనికి కారణాలు వారి శరీరతత్వం కూడా కావొచ్చు. అలాంటి వారు కొన్ని చిట్కాలను పాటిస్తే ఈజీగా బరువెక్కొచ్చు. 

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Jan 27 2022, 10:57 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


Gaining Fat : లావుగా కంటే బక్కగా ఉండటానికే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. కారణం లావుగా ఉంటే ఏ పని చేతకాదని, ముఖ్యంగా అందవిహీనంగా కనిపిస్తామని , ఇష్టంగా ఏ డ్రెస్ లు వేసుకోలేమని భావిస్తారు. అందుకే లావుగా ఉన్నవాళ్లు సన్నగా అవడానికి ఎన్నెన్నో ప్రయోగాలుచేస్తుంటారు. ఇకపోతే సన్నగా పుల్లలాగ ఉన్నావాళ్లు కూడా తాము లావైపోతే ఎంతబావుంటుందో అంటూ కళలు కంటారు. అయితే బక్కగా ఉన్నవాళ్లలో కొందరు ఫుడ్ ను పుష్టిగా తీసుకున్నా అలాగే సన్నగా ఉంటారు. అలా ఉండటానికి కారణం వారి శరీరతత్వమే. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇంకొందరు జన్యుపరంగా వచ్చిన కారణాల వల్ల కూడా ఎంత తిన్నా ఒంటికి పట్దదు. ఇవే కాకుండా థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు కూడా బరువు పెరగలేకపోతుంటారు. వాళ్లు తీసుకున్న ఆహారం వంటబట్టకున్నా బరువు పెరిగే అవకాశం లేదు. అయితే ఈ బరువు పెరగడానికి కారణాలేంటో కొన్ని రకాల టెస్టుల ద్వారా తెలుసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే ఎంత తిన్నా ఒంటబట్టని వారు కొన్ని ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే చక్కగా బరువు పెరడంతో పాటుగా బలంగా కూడా తయారవుతారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం..

35


ఆహారం బాగా తీసుకుంటేనే బరువు పెరుగుతారు. ఆహారం తీసుకోవాలంటే ఆకలి బాగా వేయాలి. అయితే ఈ ఆకలిని పెంచడంలో అల్లం, శొంఠి బాగా ఉపయోగపడతాయి. బక్కగా ఉన్నామని బాధపడేవారు వీటిని తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. తద్వార వారు బరువు పెరుగుతారు. రాత్రి పడుకునే ముందు వేడి వేడి అన్నాన్నితీసుకుని అందులో పాలు పోసి తోడుపెట్టాలి. దాన్ని పొద్దున్నే తింటే బరువు పెరుగుతారు. దీని వల్ల Body heat కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే జిలకర్ర, ధనియాలు, శొంఠిని సమ పాలల్లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ పొడిని ప్రతి రోజూ అన్నంలో కలుపుకుని తింటే ఈజీగా బరువు పెరగడంతో పాటుగా ఆకలి కూడా బాగా పెరుగుతుంది. 

45

కొన్ని దాల్చిన చెక్కలను తీసుకుని బాగా ఎండబెట్టి వాటిని మొత్తగా పొడిలా తయారుచేసుకోవాలి. ఈ పొడిని గాలి చొరబడని సీసాలో భద్రపరచాలి. ఇకపోతే ఒక గ్లాసు బాగా కాగబెట్టిన పాలను తీసుకుని అందులో తయారు చేసిపెట్టుకున్న దాల్చిన చెక్క పౌడర్, చక్కెర ను ఒక చెంచా చొప్పున వేసి బాగా కలుపుకోవాలి. ఈ పాలను ప్రతి రోజూ మార్నింగ్ టైంలో తాగితే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు ఈ పాలు ఒంట్లో ఉన్న వేడిని, వాతాన్ని కూడా తగ్గిస్తాయి. ముఖ్యంగా మెదడు పనితీరును మెరుగు పరచడంలో ఇవి బాగా ఉపయోగపడతాయి. అంతేకాదు శరీర బరువు పెరిగి పుష్టిగా కూడా అవుతారు. జీర్ణశక్తి కూడా పెరుగుతుంది. 

55

శరీరం బక్క పల్చగా ఉన్నవారికి అవిసె గింజలు, నువ్వులు, సోయా గింజలు కూడా బాగా ఉపయోగపడతాయి. శరీరం సౌష్టవంగా తయారవ్వాలంటే ప్రతి రోజూ ఫ్రెష్ గా ఉండే పండ్లను తీసుకోవడంతో పాటుగా శరీరానికి అవసరమయ్యే నీటిని కూడా తాగుతూ ఉండాలి. అలాగే వేరు శెనగలు, బాదం పప్పు, ఆక్రోట్, పిస్తాలను కూడా రోజూ వారి ఆహారం లో చేర్చుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. వీటితో పాటుగా మీగడ తీయని పెరుగు తీసుకుంటే కూడా శరీర బరువు పెరుగుతుంది. అలాగే వెన్న తీయని పాలు కూడా శరీర బరువును పెంచడంలో బాగా సహాయపడతాయి. ఈ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే ఈజీగా బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు.  

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Life Lessons : దశావతారాల నుంచి Gen-Z నేర్చుకోవాల్సిన 10 జీవిత పాఠాలు
Recommended image2
Thailand Trip New Rules: థాయ్‌లాండ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? సెప్టెంబర్ 15 నుంచి భారతీయులకు కొత్త రూల్స్
Recommended image3
Urine : మూత్రం ఎందుకు దుర్వాసన వస్తుంది? అసలు శరీరంలో మూత్రం ఎలా తయారవుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved