Vitamin D : శరీరానికి ఎండ తగలకపోతే ఈ రోగాలొస్తయ్.. జాగ్రత్త..
Vitamin D : మన శరీరానికి విటమిన్ డి ఎంతో అవసరం. ఇది లోపిస్తే జుట్టు ఊడిపోవడం, స్కిన్ డ్రై గా మారడం, ఎముకలు బలం కోల్పోవడం వంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ లోపం నుంచి బయటపడాలంటే మాత్రం మీరు ఉదయం పూట కాసేపు ఎండలో ఖచ్చితంగా కూర్చోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Vitamin D : మన దేశంలో సుమారుగా 72 శాతం జనాభా విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారట. ఈ విటమిన్ డి మన బాడీకి అత్యంత అవసరమైనది. ఇది లోపిస్తే మాత్రం మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎముకల్లో సత్తువ లేకపోవడం, జుట్టు విపరీతంగా ఊడిపోవడం, చర్మం పొడిబారడం వంటి అనేక సమస్యలను తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విటమిన్ డి మనకు సూర్య రశ్మి ద్వారా లభిస్తుంది. కాగా ఉదయం పూట కాసేపు ఎండలో నిలబడకపోవడం వల్లే నేడు చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే వివిధ ఆహారాల ద్వారా కూడా ఈ విటమిన్ డి లభిస్తుంది. కానీ అది అన్ ప్రాసెస్డ్ విటమిన్.
ఈ మధ్య కాలంలో విటమిన్ డి లోపంతో బాధపడేవారు 18 నుంచి 40 ఏండ్ల లోపు వారే ఎక్కువ మొత్తంలో ఉన్నారట. కాగా ఈ విటమిన్ డి లోపంతో వీరు ప్రమాదరకమైన హైపర్ టెన్షన్, గుండె సంబంధిత రోగాలు, జాయింట్ పెయిన్స్ వంటి సమస్యతలతో బాధపడుతున్నట్టు పలు పరిశోధనలు వెళ్లడిస్తున్నాయి. ముఖ్యంగా ఈ విటమిన్ డి లోపం కారణంగా ఎంతో మంది దీర్ఘకాలిక రోగాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
మన శరీరంలో విటమిన్ డి లోపించడం వల్ల అనేక శారీరక సమస్యలతో పాటుగా మానసిక రుగ్మతలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే మీలో విటమిన్ డి లోపం ఉంటే వైద్యలను సంప్రదించి వారి సలహాలను, సూచనలనుు తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా ఒక అరగంట సేపైనా ఉదయాన్నే ఎండలో కూర్చోవాలి. అప్పుడే మన శరీరానికి కావాల్సిన విటమిన్ డి లభిస్తుంది.
ఈ సూర్య రశ్మి మన శరీరానికి తగలడం వల్ల ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా.. దీంతో ప్రమాదకరమైన క్యాన్సర్, కండరాల నొప్పి, క్షయ వంటి రోగాలను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ డి లోపం ఉన్నవారు తమ రోజు వారి ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను, జున్ను, పాలు, గుడ్లు వంటిని చేర్చుకోవాలి. చలికాలంలో ప్రతి రోజూ ఉదయం పూట సుమారుగా రెండు గంటల సేపు ఎండలో ఉండాలి. అదే ఎండాకాలమైతే ఒక 20 నిమిషాలు కూర్చుంటే చాలు. దీనివల్ల మీ బాడీకి కావాల్సిన విటమిన్ డి అందుతుంది.
మీకు తెలుసా.. మగవారిలోకంటే ఆడవారిలోనే విటమిన్ డి లోపిస్తుందట. ఎందుకంటే ఆడవారు ఉదయం ఇంటిపనుల్లోనే బిజీగా ఉంటారు. అలాగే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడంతో ఈ విటమిన్ డి లోపిస్తుంది. ఈ కారణంగా వారు చర్మ సంబంధిత రోగాలను, తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు. అందుకే సమయాన్ని కుదుర్చుని కాసేపు ఎండలో ఉండండి. అన్ని సమస్యలు తొలగిపోతాయి.