MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Lemon: ఈ ఒక్క పని చేస్తే.. ఎన్ని నెలలు అయినా నిమ్మకాయలు ఫ్రెష్ గా ఉంటాయి..!

Lemon: ఈ ఒక్క పని చేస్తే.. ఎన్ని నెలలు అయినా నిమ్మకాయలు ఫ్రెష్ గా ఉంటాయి..!

Lemon: మార్కెట్లో నిమ్మకాయల రేటు రోజు రోజుకీ భారీగా పెరిగిపోతోంది. అంత పెట్టి కొన్న నిమ్మకాయలైనా రెండు, మూడు రోజుల్లోనే ఎండిపోతున్నాయి. అలా అవ్వకుండా.. నిమ్మకాయలు ఎన్ని నెలలు అయినా తాజాగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 24 2026, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Lemon Storage
Image Credit : X

Lemon Storage

నిమ్మకాయలు ప్రతి ఇంట్లోనూ రోజూ ఉపయోగపడే ముఖ్యమైన పదార్థం. సలాడ్లు, కూరలు, పానీయాలు ఇలా చాలా వాటికి రుచిని పెంచడంలో నిమ్మకాయలు ముందు ఉంటాయి. చాలామంది ఇవి తరచూ అవసరమవుతాయని ఒకేసారి ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. కానీ సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే అవి త్వరగా వాడిపోయి, రసం ఇంకిపోతాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. వారాలు, నెలలు కాదు, ఏకంగా సంవత్సరమైనా వాటిని తాజాగా ఉంచొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నిమ్మకాయ వల్ల కలిగే లాభాలు..
Image Credit : Gemini AI

నిమ్మకాయ వల్ల కలిగే లాభాలు..

నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొద్దిగా నిమ్మరసం పిండితే చాలు, ఏ వంటకమైనా రుచి అద్భుతంగా మారుతుంది. విటమిన్ 'సి' సమృద్ధిగా ఉండే నిమ్మకాయలు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడతాయి.

33
నిమ్మకాయలను తాజాగా ఉంచే 3 ఉత్తమ పద్ధతులు
Image Credit : AI Image

నిమ్మకాయలను తాజాగా ఉంచే 3 ఉత్తమ పద్ధతులు

1. నీటిలో నిల్వ చేయడం: నిమ్మకాయలను తాజాగా ఉంచడానికి ఇది సులభమైన మార్గాలలో ఒకటి. నిమ్మకాయలను ఒక ఎయిర్‌టైట్ కంటైనర్‌లో ఉంచి, అవి పూర్తిగా మునిగే వరకు నీటితో నింపాలి. కంటైనర్‌ను గట్టిగా మూసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా చేయడం వల్ల నిమ్మకాయలు వాడిపోకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

2. టిష్యూ పేపర్‌లో చుట్టడం: మొదట నిమ్మకాయలను కడిగి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత ప్రతి నిమ్మకాయను విడివిడిగా టిష్యూ పేపర్‌లో లేదా న్యూస్‌పేపర్‌లో చుట్టి ఒక ఎయిర్‌టైట్ కంటైనర్‌లో లేదా జిప్-లాక్ బ్యాగ్‌లో పెట్టాలి. వీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే వారాల తరబడి తాజాగా ఉంటాయి.

3. కొద్దిగా నూనె రాయడం: నిమ్మకాయలను కడిగి ఆరబెట్టిన తర్వాత, వాటి చర్మంపై కొద్దిగా ఆవనూనె లేదా ఏదైనా వంట నూనెను పలుచగా రాయాలి. ఆ తర్వాత వాటిని ఒక కంటైనర్‌లో వేసి ఫ్రిజ్‌లో భద్రపరచాలి. ఈ నూనె పొర తేమ ఆవిరి కాకుండా కాపాడుతుంది, దీంతో నిమ్మకాయలు ఎండిపోకుండా ఫ్రెష్‌గా ఉంటాయి. నిమ్మకాయలు వృథా కాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మీరు కూడా ఈసారి ఎక్కువ నిమ్మకాయలు కొన్నప్పుడు ఈ సింపుల్ పద్ధతులను ట్రై చేసి.. తాజాగా ఉండేలా చూసుకోండి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afternoon Nap: మధ్యాహ్నం నిద్రపోతే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Recommended image2
Gulab Jamun Village: ఈ గ్రామంలోనే గులాబ్ జామ్ పుట్టింది.. ఇక్కడ తిన్న రుచి మరెక్కడా దొరకదు..!
Recommended image3
Gold Haram: 5 తులాల్లో వచ్చే బంగారు హారం.. పట్టు చీరలతో లుక్ అదుర్స్!
Related Stories
Recommended image1
Job: కుక్కల ఫుడ్ టేస్ట్ చేసే ఉద్యోగం... లక్షల్లో జీతం, ఈ ఉద్యోగానికి ఎలాంటి క్వాలిటీస్ కావాలో తెలుసా?
Recommended image2
Hing: పులిహోరకు రుచిని పెంచే ఈ మసాలా.. దెయ్యాల ఆహారమా..?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved