Holi Colour Removal: బట్టలపై పడిన హోలీ కలర్స్ వదిలించేదెలా?
Holi Colour Removal: హోలీ.. రంగుల పండుగే కాదు. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా కలిసి ఆనందంగా గడపడం. అలాంటి బ్యూటీఫుల్ మూమెంట్స్ లో బట్టలపై రంగులు పడటం, వాటిని ఉతకలేక ఇబ్బంది పడతారు. అందుకే ఈ టిప్ ఫాలో అయి చిటికెలో మరకలను వదిలించి జ్ఞాపకాలను పోగుచేసుకుండి.

హోలీ అంటే ఆల్ ఇన్ వన్ సెలబ్రేషన్
హోలీ అంటే రంగుల పండుగ. ఎంజాయ్ మెంట్, ఉత్సాహం, స్నేహం..ఆల్ ఇన్ వన్ సెలబ్రేషన్. కానీ హోలీ ముగిసిన తర్వాత చాలా మందికి ఎదురయ్యే పెద్ద సమస్య ఏమిటంటే దుస్తులపై పడిన కలర్స్. ముఖ్యంగా కెమికల్ కలర్స్ అయితే అవి సులభంగా పోవు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే హోలీ కలర్స్‌ను దుస్తుల నుంచి చాలా వరకు తొలగించవచ్చు.
వేడి నీటిలో నానబెట్టకూడదు
రంగు పడిన వెంటనే దుస్తులను వేడి నీటిలో నానబెట్టకూడదు. వేడి నీరు వాడితే రంగు మచ్చ మరింతగా గట్టిపడుతుంది. బదులుగా చల్లని నీటిలో ముందుగా బాగా కడగాలి. ఇలా చేస్తే పైపైన ఉన్న రంగు తొలగిపోతుంది.
సోప్ లేదా లిక్విడ్ డిటర్జెంట్ వాడాలి
సబ్బు లేదా లిక్విడ్ డిటర్జెంట్ ఉపయోగించాలి. మరక ఉన్న చోట నేరుగా డిటర్జెంట్ రాసి 10–15 నిమిషాలు ఉంచి ఆపై తేలికగా రుద్దాలి. అయితే బలంగా రుద్దితే క్లాత్ పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా చేయాలి.
నిమ్మరసం మంచి పరిష్కారం
తెల్ల దుస్తులపై రంగు మచ్చలు పడితే నిమ్మరసం మంచి పరిష్కారం. మచ్చ ఉన్న చోట నిమ్మరసం రాసి కొద్దిసేపు ఎండలో ఉంచాలి. ఆ తర్వాత కడిగితే మచ్చ తగ్గుతుంది. అలాగే బేకింగ్ సోడా, వెనిగర్ మిశ్రమం ఫలితం ఉంటుంది. ఈ రెండింటిని కలిపి పేస్ట్‌లా చేసి మచ్చపై రాసి కొద్దిసేపు ఉంచి కడగాలి.
డ్రై క్లీనింగ్‌కు ఇవ్వడం మంచిది
సిల్క్, షిఫాన్ వంటి సున్నితమైన వస్త్రాలపై రంగు పడితే కెమికల్స్ ఉపయోగించకుండా డ్రై క్లీనింగ్‌కు ఇవ్వడం మంచిది. లేకపోతే క్లాత్ నాణ్యత దెబ్బతింటుంది.
మరో ముఖ్యమైన చిట్కా
దుస్తులను వాషింగ్ మెషీన్‌లో వెంటనే వేయకూడదు. ముందుగా చేతితో మచ్చ తగ్గించే ప్రయత్నం చేయాలి. లేదంటే రంగు ఇతర దుస్తులకు కూడా అంటుకునే అవకాశం ఉంటుంది.
హోలీ ఆడేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. పాత దుస్తులు వేసుకోవడం, డార్క్ కలర్ బట్టలు ఎంచుకోవడం మంచిది. అలాగే స్కిన్, హెయిర్‌పై కొద్దిగా నూనె రాసుకుంటే రంగు సులభంగా తొలగుతుంది.

