ఒంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువైందా? ఇదిగో ఈ కూరగాయలను తింటే ఫాస్ట్ గా కరిగిపోతుంది
శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే గుండెపోటు, స్ట్రోక్, డయాబెటీస్, అధిక రక్తపోటు వంటి ఎన్నో రోగాలు చుట్టుకుంటాయి. ఒకరకంగా చెప్పాలంటే ఈ కొలెస్ట్రాల్ మన లైఫ్ టైం ను తగ్గిస్తుంది. అందుకే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా చూసుకోవాలి.

Vegetables
పేలవమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ విపరీతంగా పేరుకుపోతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువైతే సిరలు ఇరుగ్గా మారుతాయి. దీంతో శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరగదు. దీనివల్ల గుండెపోటుతో పాటుగా ఎన్నో ప్రాణాంతక రోగాలొచ్చే ప్రమాదం పెరుగుతుంది. అయితే కొన్ని కూరగాయలు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బీన్స్
బీన్స్ మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతిరోజూ తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ కూరగాయలో ఫైబర్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇక ఈ బీన్స్ లో ఉండే పీచు పదార్థం మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. దీంతో ఆటోమెటిక్ గా చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి.
వెనిగర్ తో ఉల్లి, వెల్లుల్లిని తినండి
క్యాన్సర్ పై చేసిన ఒక అధ్యయనంలో.. వెనిగర్ తో ఉల్లి, వెల్లుల్లిని అలాగే పచ్చిగా తింటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఫాస్ట్ గా కరగడం మొదలవుతుందని తేలింది. ఇలా తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు రక్తప్రవాహం కూడా పెరుగుతుంది. దీంతో గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.
బెండకాయ
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బెండకాయ కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. బెండకాయలో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ రక్తంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం కూడా తగ్గుతుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
బ్రోకలీ
బ్రోకలీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. బ్రోకలీని తినడం వల్ల అధిక రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అలాగే పేగు సమస్యలు కూడా తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. బ్రోకలీలో కొవ్వు కొంచెం కూడా ఉండదు.
వంకాయ
వంకాయ కూడా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను ఇట్టే కరిగించేస్తుంది. వీటిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు సహాయపడుతుంది.
ఉల్లిపాయ
ఉల్లిచేసే మేలు ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. ఉల్లిపాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఫ్లెవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఉల్లిని తినడం వల్ల మీ శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ చాలా ఫాస్ట్ గా కరిగిపోతుంది. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.