MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Gold Care Tips: పాత నగలకు కొత్త మెరుపు.. ఈ ట్రిక్ తో మీ జ్యూవెలరీ తళతళా మెరవడం ఖాయం.

Gold Care Tips: పాత నగలకు కొత్త మెరుపు.. ఈ ట్రిక్ తో మీ జ్యూవెలరీ తళతళా మెరవడం ఖాయం.

Gold Care Tips: బంగారం కొంటాం. కొన్ని రోజులు బాగానే ఉంటుంది. మెరుపు తగ్గకుండా చూసుకోవడం ముఖ్యం. కానీ కొన్ని రోజులకు మురికి పట్టేస్తాయి. క్లీన్ చేయడం కష్టం. పాలిష్ కోసం తీసుకెళ్తే డబ్బులు దండగ. ఇంట్లోనే ఇలాంటి ఇబ్బంది లేకుండా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. 

2 Min read
Author : Nandini Arava
Published : May 16 2026, 02:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రూ.1 షాంపూతో కొత్త వాటిలా మెరిసిపోతాయి
Image Credit : Getty

రూ.1 షాంపూతో కొత్త వాటిలా మెరిసిపోతాయి

పాతబడిన బంగారు ఆభరణాలను క్లీన్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. కాస్త టైం కేటాయిస్తే నిగనిగలాడిపోతాయి. పాలిష్ కోసమని మనీ కూడా వేస్ట్ చేయక్కర్లేదు. ఎలా క్లీన్ చేయాలంటే… 
ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో రెండు చుక్కల బేబీ షాంపూ లేదా మైల్డ్ లిక్విడ్ సోప్ వేయండి. మీ నగలని ఓ 15 నిమిషాలు ఆ లిక్విడ్‍లో నానబెడితే చాలు. మురికి దానంతట అదే పోతుంది. వెంటనే మీ పాత గోల్డ్ నగలు మిలమిలమెరిసిపోతాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టమాట రసంతో నగలకు తళతళా మెరవడం ఖాయం
Image Credit : Getty

టమాట రసంతో నగలకు తళతళా మెరవడం ఖాయం

టమాటా రసమే కదా అని తక్కువ అంచనా వేయకండి. దీనికి మొండి మరకలను, జిడ్డును వదిలించే అద్భుతమైన గుణం ఉంది. బంగారు నగలు పాతబడినప్పుడు కొద్దిగా టమాటా రసాన్ని తీసుకుని నగలపై బాగా పట్టించి ఓ 10 నిమిషాల పాటు అలానే వదిలేయండి. టమాటాలో ఉండే సహజసిద్ధమైన ఆమ్లాలు నగల మూలల్లో పేరుకుపోయిన మురికిని లూజ్ చేస్తాయి. ఆ తర్వాత పాత టూత్ బ్రష్‌తో మెల్లగా రుద్ది, మంచి నీటితో కడిగేసి కాటన్ గుడ్డతో తుడిస్తే చాలు. మీ పాత బంగారం కొత్తదానిలా తళతళా మెరవడం ఖాయం.

Related Articles

Related image1
Gold Locket: పిల్లల ఫేవరేట్ కార్టూన్స్ తో గోల్డ్ లాకెట్స్
Related image2
Gold Nose Pin: ముఖ అందాన్ని పెంచే ముక్కుపుడకలు.. చూస్తే ఫిదా అవుతారు!
35
బేకింగ్ సోడా సూపర్ రెమిడీ..కానీ జాగ్రత్త తప్పనిసరి
Image Credit : Getty

బేకింగ్ సోడా సూపర్ రెమిడీ..కానీ జాగ్రత్త తప్పనిసరి

బేకింగ్ సోడా చిట్కా నిజంగా వంటింట్లోనే దొరికే ఒక సూపర్ రెమెడీ! అయితే ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. బేకింగ్ సోడా అనేది వెండి (Silver) నగలను శుభ్రం చేయడానికి, వాటి నలుపును వదిలించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ, బంగారు నగల విషయానికి వస్తే బేకింగ్ సోడా కాస్త గరుకుగా ఉండటం వల్ల, వాటిపై సున్నితంగా రుద్దాలి. లేదంటే నగలపై చిన్న చిన్న గీతలు పడే ప్రమాదం ఉంది. బేకింగ్ సోడాలో కొన్ని నీళ్లు కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారుచేయండి. ఈ పేస్ట్‌ను నగలపై వేసి మెత్తటి క్లాత్‍తో లేదా కాటన్ క్లాత్‍తో నెమ్మదిగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయండి. పాత నగలకు క్షణాల్లో కొత్త కళ వస్తుంది.

45
పసుపుతో బంగారు నగలకు రిచ్ లుక్
Image Credit : Getty

పసుపుతో బంగారు నగలకు రిచ్ లుక్

నగలను శుభ్రం చేసిన తర్వాత చివరగా కొద్దిగా పసుపు రాయడం అనేది మన ఇళ్లలో తరతరాలుగా వస్తున్న ఒక సంప్రదాయం. పసుపుకు ఉన్న యాంటీసెప్టిక్, యాంటీ-బాక్టీరియల్ గుణాల వల్ల క్లీన్ చేసేందుకు పనిచేస్తుంది. పైగా, ఇది బంగారానికి ఒక సహజసిద్ధమైన పసుపు రంగు మెరుపును ఇస్తుంది. అయితే జాగ్రత్త తప్పనిసరి. పసుపు రాసిన తర్వాత నగలను అలాగే పెట్టేయకూడదు. ఎందుకంటే పసుపు పొడి నగల మూలల్లో లేదా డిజైన్ల సందుల్లో ఉండిపోతే అక్కడ తేమ చేరి మురికి పేరుకుపోయే అవకాశం ఉంది. 

55
నగలు మళ్లీ ఆభరణాలు నల్లగా మారకుండా ఉండాలంటే..
Image Credit : Getty

నగలు మళ్లీ ఆభరణాలు నల్లగా మారకుండా ఉండాలంటే..

నగలు దాచుకునే పెట్టెలో లేదా లాకర్‌లో ఒక చిన్న చాక్ పీస్ వేయడం అనేది నగల మెరుపును కాపాడుతుంది. ఇదొక సూపర్ ట్రిక్. చాక్ పీస్‌కు తేమను పీల్చుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. ఇది పెట్టెలోని తడిదనాన్ని, తేమను పూర్తిగా లాగేసుకోవడం వల్ల నగలు మెరుపు తగ్గదు. దానివల్ల మీ వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు, ఇమిటేషన్ జ్యువెలరీ త్వరగా నల్లబడకుండా, ఎక్కువ కాలం కొత్తవాటిలా మెరుస్తూ ఉంటాయి. కేవలం కొన్ని నెలలకు ఒకసారి ఆ పాత చాక్ పీస్ ముక్కను మార్చి కొత్తది పెడితే సరిపోతుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Saree Designs: పండగలకు పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే చీరల డిజైన్లు
Recommended image2
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image3
Birds: ఈ గ్రామంలో పక్షులన్నీ ఒకేసారి ఆత్మహత్య చేసుకుంటాయి.. అది కూడా సెప్టెంబర్ నెలలోనే.. ఎందుకో తెలుసా?
Related Stories
Recommended image1
Gold Locket: పిల్లల ఫేవరేట్ కార్టూన్స్ తో గోల్డ్ లాకెట్స్
Recommended image2
Gold Nose Pin: ముఖ అందాన్ని పెంచే ముక్కుపుడకలు.. చూస్తే ఫిదా అవుతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved