MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Dupatta Reuse: పాత చున్నీలతో అందమైన బ్లౌజులు.. తక్కువ ఖర్చుతో కొత్త లుక్!

Dupatta Reuse: పాత చున్నీలతో అందమైన బ్లౌజులు.. తక్కువ ఖర్చుతో కొత్త లుక్!

Dupatta Reuse: ఫ్యాషన్ ప్రపంచంలో ప్రతి రోజూ కొత్త ట్రెండ్స్ వస్తూనే ఉంటాయి. కానీ అందంగా కనిపించడానికి ఎప్పుడూ కొత్త దుస్తులే కొనాల్సిన పని లేదు. మన ఇంట్లోని పాత చున్నీలతో కూడా అద్భుతమైన బ్లౌజులు డిజైన్ చేసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Jun 03 2026, 04:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పాత చున్నీలతో కొత్త బ్లౌజులు
Image Credit : instagram

పాత చున్నీలతో కొత్త బ్లౌజులు

మన ఇంట్లో వాడకుండా పడి ఉన్న పాత చున్నీలు చాలా ఉంటాయి. సూట్ పాడైపోయినా, రంగు పోయినా లేదా ఫ్యాషన్ మారిపోయినా చున్నీలు మాత్రం మంచి స్థితిలోనే ఉంటాయి. అలాంటి చున్నీలను పారేయకుండా వాటితో అందమైన బ్లౌజులు డిజైన్ చేసుకుంటే డబ్బు ఆదా కావడంతో పాటు ప్రత్యేకమైన స్టైల్ కూడా సొంతమవుతుంది. చున్నీలపైన ఉండే అందమైన ఎంబ్రాయిడరీ, ప్రింట్స్, మిర్రర్ వర్క్, లేస్ డిజైన్లను ఉపయోగించి ఇలాంటి స్టైలిష్ బ్లౌజులు కుట్టించుకోవచ్చు. చున్నీపై ఉన్న ఎంబ్రాయిడరీ భాగాన్ని బ్లౌజ్ ముందు భాగంలో లేదా చేతులపై ఉపయోగిస్తే ఖరీదైన డిజైనర్ బ్లౌజ్‌లా కనిపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
షర్ట్ స్టైల్ బ్లౌజ్
Image Credit : instagram

షర్ట్ స్టైల్ బ్లౌజ్

ఫ్యాషన్ అంటే ఎప్పుడూ కొత్తవి కొనడం మాత్రమే కాదు. మన దగ్గర ఉన్న పాత దుస్తులను కూడా క్రియేటివ్ గా రీయూజ్ చేసుకోవచ్చు. పాత చున్నీలతో ఇలాంటి షర్ట్ స్టైల్ బ్లౌజులు డిజైన్ చేయించడం ద్వారా తక్కువ ఖర్చులో స్టైలిష్ లుక్ పొందవచ్చు. అంతేకాకుండా ప్రతి బ్లౌజ్ ప్రత్యేకంగా, మన అభిరుచికి అనుగుణంగా తయారవుతుంది.

36
హెవీ డిజైన్ బ్లౌజు
Image Credit : instagram

హెవీ డిజైన్ బ్లౌజు

చాలా సూట్స్ మీదకు పట్టు, బెనారసీ, సిల్క్ ఫ్యాబ్రిక్ ఉన్న చున్నీలు వస్తాయి. అలాంటి చున్నీలు ఎన్ని రోజులైనా పాతబడవు. చిరిగిపోవు కూడా. అలాంటి చున్నీలతో మరో చీర లేదా లెహంగా పైకి స్టైలిష్ బ్లౌజు డిజైన్ చేయించుకోవచ్చు. పట్టు బోర్డర్ ని నెక్, స్లీవ్స్ దగ్గర డిజైన్ చేస్తే లుక్ అదిరిపోతుంది. అచ్చం కొత్తదానిలా కనిపిస్తుంది.

46
మోడ్రన్ బ్లౌజు
Image Credit : instagram

మోడ్రన్ బ్లౌజు

కాటన్ చున్నీలతో ఇలాంటి స్టైలిష్, మోడ్రన్ బ్లౌజులు డిజైన్ చేసుకోవచ్చు. ఒక వేళ మీ దగ్గర ఎక్కువ చున్నీలు ఉంటే.. మీకు నచ్చిన కలర్ చున్నీలతో ప్యాచ్‌వర్క్ బ్లౌజ్ కూడా తయారు చేయించుకోవచ్చు. ఇది ట్రెండీగా, యూనిక్‌గా ఉంటుంది. మ్యాచింగ్ కాటన్ శారీస్ తో జత చేస్తే అదిరిపోయే లుక్ మీ సొంతమవుతుంది.

56
ప్రింటెడ్ బ్లౌజులు
Image Credit : instagram

ప్రింటెడ్ బ్లౌజులు

ప్రింటెడ్ లేదా నెట్ చున్నీలతో హై నెక్, డీప్ నెక్ బ్లౌజ్‌లు చాలా అందంగా కనిపిస్తాయి. ఇవి చీరకు మోడ్రన్ టచ్ ఇస్తాయి. అలాగే లైట్ వెయిట్ చున్నీలతో సింపుల్ స్లీవ్‌లెస్ లేదా బోట్ నెక్ బ్లౌజ్‌లు డిజైన్ చేయించుకుంటే క్యాజువల్, పార్టీ వేర్ రెండింటికీ చక్కగా ఉపయోగపడతాయి.

66
లేస్ బోర్డర్ బ్లౌజులు
Image Credit : instagram

లేస్ బోర్డర్ బ్లౌజులు

లేస్ బోర్డర్ చున్నీలతో జీరో నెక్ ఎల్బో స్లీవ్స్ ఉన్న బ్లౌజులు డిజైన్ చేసుకోవచ్చు. ఇవి మోడ్రన్ టచ్ ఇస్తాయి. తక్కువ ధరలో మంచి లుక్ పొందవచ్చు.  గుజరాతీ లేదా రాజస్థానీ శైలిలో ఉన్న మిర్రర్ వర్క్ చున్నీలతో ఫెస్టివల్ లేదా ఫంక్షన్‌లకు సరిపోయే బ్లౌజ్‌లు రూపొందించవచ్చు. అయితే చున్నీతో బ్లౌజు డిజైన్ చేసేటప్పుడు చున్నీ ఫ్యాబ్రిక్ బలంగా ఉందో లేదో ముందుగా పరిశీలించాలి. అవసరమైతే లోపల లైనింగ్ ఫ్యాబ్రిక్ ఉపయోగించడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఫ్యాషన్
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం.. మీపై అసూయ ఉన్నవారిని ఎలా గుర్తించాలో తెలుసా?
Recommended image2
Moral Story: కర్మ ఈజ్ బూమరాంగ్.. పక్కవారిపై నింద వేసి సంతోషపడుతున్నారా? మీ కళ్లు తెరిపించే కథ ఇది
Recommended image3
Gold Saree: పండగ వేళ బంగారంలా మెరిసిపోయే గోల్డెన్ శారీ డిజైన్లు..
Related Stories
Recommended image1
Old Saree Reuse Ideas: పాత కాటన్ చీరతో కొత్త డ్రెస్సులు.. ఓ లుక్కేయండి
Recommended image2
Saree Reuse: పాత చీరలను పడేస్తున్నారా? ఇలా చేస్తే డబ్బు ఆదా.. అద్భుతమైన లుక్ మీ సొంతం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved