- Home
- Life
- Karupatti Jaggery: చెరుకు నుంచి తయారవ్వని బెల్లం ఇది.. మన దేశంలోనే ఫేమస్, స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Karupatti Jaggery: చెరుకు నుంచి తయారవ్వని బెల్లం ఇది.. మన దేశంలోనే ఫేమస్, స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Karupatti Jaggery: బెల్లం అంటే చెరకు నుంచే తయారౌతుందని మనకు తెలుసు. కానీ, అసలు చెరకుతో సంబంధం లేకుండా తయారయ్యే బెల్లం ఒకటి ఉందని మీకు తెలుసా? అసలు ఏంటి ఈ కరుపట్టి బెల్లం..? దీని స్పెషాలిటీ ఇదే..

ఈ బెల్లం ప్రత్యేకత ఏంటి?
మనం సాధారణంగా వాడే బెల్లం అంతా చెరకు రసంతోనే తయారౌతుందని అందరికీ తెలుసు. కానీ, చెరుకు రసంతో అసలు సంబంధం లేకుండా, కేవలం తాటి చెట్ల నుంచి లభించే సహజసిద్ధమైన రసంతో తయారయ్యే ఒక అద్భుతమైన బెల్లం ఉంది. అదే దక్షిణ భారతదేశపు ఫేమస్ బెల్లం కరుపట్టి బెల్లం. దీనినే తాటి బెల్లం అని కూడా పిలుస్తారు. చెరకు బెల్లానికి భిన్నంగా తయారయ్యే ఈ కరుపట్టి బెల్లం ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం...
చెరకుతో సంబంధం లేకుండా తయారయ్యే బెల్లం...
సాధారణంగా బెల్లం లేదా పంచదార తయారు చేయడానికి చెరకు గడలు అవసరం. కానీ, కరుపట్టి బెల్లం తయారీకి చెరకుతో ఎలాంటి పనీ లేదు. తాటి చెట్లకు కుండలు కట్టి, వాటి నుంచి సేకరించే సహజసిద్ధదమైన తాటి ఈత రసం లేదా కల్లును సేకరిస్తారు. ఎలాంటి రసాయనాలు, కృత్రిమ బ్లీచీంగ్ ఏజెంట్లు కలపకుండా, ఈ తాటి రసాన్ని పెద్ద కడవల్లో పోసి.. సంప్రదాయ పద్ధతిలో సహజంగా మరిగిస్తారు. రసం పూర్తిగా చిక్కబడిన తర్వాత దానిని అచ్చులుగా పోసి గట్టిపరుస్తారు. అలా తయారైన అసలు సిసలైన నల్లటి బెల్లం కరుపట్టి..
GI ట్యాగ్ తో గుర్తింపు..
ఈ కరపట్టి బెల్లానికి ప్రత్యేకంగా జీఐ ట్యాగ్ కూడా ఇచ్చారు. ఈ ప్రత్యేకమైన తయారీ విధానం, స్వచ్ఛత కారణంగానే దీనికి ఈ గుర్తింపు లభించింది. ఇది కేవలం సాధారణ బెల్లం మాత్రమే కాదు... మన పూర్వీకులు ఆచరించిన ఆరోగ్యకరమైన జీవన విధానికి ఒక ప్రతీక.
ఈ బెల్లం తో ఆరోగ్య ప్రయోజనాలు...
సాధారణ బెల్లంతో పోలిస్తే.. ఈ బెల్లం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చెరకు బెల్లం, పంచదారతో పోలిస్తే.. కరుపట్టి బెల్లంలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. ఇది డయాబెటిస్ ఉన్నవారికి లేదా బరువు తగ్గాలి అనుకునేవారికి మంచి హెల్దీ ఆప్షన్. ఈ బెల్లంలో మన శరీరానికి అవసరం అయ్యే ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనతను తగ్గించి, శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది.
చలికాలంలో లేదా దగ్గు, జలుబు చేసినప్పుడు కరుపట్టి బెల్లాన్ని సుగంధ ద్రవ్యాలతో కలిపి తీసుకుంటే గొంతుకు తక్షణ ఉపశమనం లభిస్తుంది. భోజనం తర్వాత చిన్న ముక్క కరుపట్టి బెల్లం నమలడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది, ఎసిడిటీ సమస్యలు దరిచేరవు.
వంటకాల్లో దీని ప్రత్యేకత: కెమికల్స్ కలవని ఈ సహజసిద్ధమైన కరుపట్టిని టీ, కాఫీ, కొన్ని రకాల స్వీట్లు, సాంప్రదాయ పిండి వంటల్లో వాడతారు. ఇది వంటకాలకు అద్భుతమైన సువాసనను, ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. చెరకు రసంతో కాకుండా, ప్రకృతి ఇచ్చిన తాటి వృక్షాల అమృతంలా తయారయ్యే ఈ కరుపట్టిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.





