Mehendi Designs: నాణాలు, గాజులు, స్పూనుతో సింపుల్ గా అందమైన మెహెందీ డిజైన్లు ఇలా వేసేయండి
దీపావళికి మెహెందీ (Mehendi Designs) పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారా? ఇక్కడ మేము సింపుల్ గా మెహెందీ డిజైన్లు ఇచ్చాము. మెహెందీ వేసుకోవడం రానివారు కూడా ఈ పద్ధతిలో డిజైన్లు వేసుకోవచ్చు.

దీపావళికి మెహెందీ
దీపావళి పండుగ వచ్చిందంటే అమ్మాయిలంతా మెహెందీ పెట్టుకునేందుకు సిద్ధమైపోతారు. కానీ అందరికీ డిజైన్లు వేయడం రాదు. ఎవరో ఒకరిని రిక్వెస్టు చేసి వేయించుకుంటారు. నిజానికి మీకు మీరే మెహెందీ డిజైన్లు ప్రయత్నించవచ్చు. కేవలం రూపాయి నాణాలు, గాజులు, స్పూన్లతోనే అందమైన డిజైన్లను ప్రయత్నించవచ్చు. ఇక్కడ మేము అలాంటి డిజైన్లు ఇచ్చాము. ఇలా మీరు ప్రయత్నిస్తే చేయి నిండుగా అందమైన మెహెందీ కళకళలాడిపోతుంది. ఇక్కడిచ్చిన ఫోటోలో కాటన్ బడ్ తో డిజైన్లు ఎలా గీయాలో చూపించారు. చుక్కలు పెట్టాక అలా కాటన్ బడ్ తో గీస్తే అవి పువ్వుల్లాగా వస్తాయి.
రూపాయి నాణాలతో
గాజులతో ప్రయత్నించినట్టే రూపాయి నాణాలతో కూడా డిజైన్ వేయవచ్చు. రూపాయి నాణాన్ని చేతిమీద పెట్టి చుక్కలు పెట్టుకోవాలి. తరువాత కాటన్ బడ్ పువ్వులా గీసుకోవాలి.
గాజులతో...
మీ దగ్గర ఉన్న గాజులతో అందమైన మెహెందీ డిజైన్ వేసుకోవచ్చు. చిన్న పిల్లల గాజులు, పెద్దవాళ్లు గాజులు చేతిమీద పెట్టుకుని డిజైన్ వేయచ్చు. గాజును పెట్టి చుక్కలు, గీతలు సరైన పద్ధతిలో డిజైన్ వేసేందుకు ప్రయత్నించండి.
స్పూనుతో..
ఇంట్లో ఉన్న స్పూనును కూడా మెహందీ డిజైన్ కోసం వాడేయచ్చు. ఫోటోలో చూసిన విధంగా స్పూను పెట్టి చుక్కలు పెట్టండి. తరువాత కాటన్ బడ్ తో డిజైన్ గీయండి. అంటే చేయి నిండుగా అందమైన మెహెందీ సిద్ధం.