- Home
- Astrology
- Zodiac signs: కుజ శుక్ర కలయికతో కోటీశ్వర యోగం పొందే రాశులు ఇవిగో, ఇల్లు భూమి కొనే ఛాన్స్
Zodiac signs: కుజ శుక్ర కలయికతో కోటీశ్వర యోగం పొందే రాశులు ఇవిగో, ఇల్లు భూమి కొనే ఛాన్స్
పద్దెనిమిది సంవత్సరాల తర్వాత కుజ శుక్ర సంయోగం జరగబోతోంది. ఈ రెండూ కూడా శుభగ్రహాలే. దీనివల్ల కొన్ని రాశుల (Zodiac signs) వారికి విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది.

కుజ శుక్ర సంయోగం
జ్యోతిష్య శాస్త్రంలో కుజ శుక్ర సంయోగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత కుజుడు శుక్రుడు వృశ్చిక రాశిలో సంయోగం చెందుతున్నారు. కుజుడు శక్తికి, ధైర్యానికి, బలానికి, కోపానికి, సంపదకు సూచిక. ఇక శుక్రుడు అందానికి, ఆనందానికి, సంపదకు, శ్రేయస్సుకు కారణంగా చెబుతారు. కుజుడు నవంబర్లో వృశ్చిక రాశిలోకి ప్రవేశించి శుక్రుడితో కలిసి బలమైన యోగం ఏర్పడుతోంది.
వృశ్చిక రాశి
ఈ రాశి వారికి మొదటి ఇంట్లో కుజ, శుక్ర కలయిక జరుగుతుంది. దీనివల్ల మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం బలపడుతుంది. అవివాహితులకు పెళ్లి జరిగే అవకాశం ఉంది. చాలా కాలంగా మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కొత్త ఇల్లు, భూమి కొనే అవకాశం కూడా ఉంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. వారి పదకొండవ ఇంట్లో కుజుడు, శుక్రుడు సంయోగం జరుగుతుంది. దీనివల్ల వారికి విపరీతంగా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. స్టాక్ మార్కెట్ వంటి పెట్టుబడుల నుంచి కూడా లాభాలను పొందుతారు. ఉద్యోగ రంగంలో కూడా పదోన్నతి వచ్చే అవకాశం ఉంది.
మీన రాశి
ఈ రాశి వారికి తొమ్మిదవ ఇంట్లో కుజుడు, శుక్రుడు కలయిక జరగబోతుంది. దీనివల్ల వీరికి అదృష్టం దక్కుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా వస్తాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉన్న ఉద్యోగులకు పదోన్నతి దక్కే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.