MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Weight Loss Tips: ఒక్క నెలలో 4 కేజీల వరకు హెల్తీగా బరువు తగ్గాలా? ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు!

Weight Loss Tips: ఒక్క నెలలో 4 కేజీల వరకు హెల్తీగా బరువు తగ్గాలా? ఈ 5 టిప్స్ ఫాలో అయితే చాలు!

Weight Loss Tips: బరువు తగ్గాలనుకునేవారిలో చాలామందికి ఒక్క నెలలో ఎంత బరువు తగ్గొచ్చు? అనే సందేహం ఉంటుంది. నిపుణుల ప్రకారం సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే నెలలో 2 నుంచి 4 కేజీల వరకు బరువు తగ్గడం సాధ్యమే. మరి హెల్తీగా బరువు తగ్గాలంటే ఏం చేయాలో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 19 2026, 02:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
హెల్తీగా బరువు తగ్గే టిప్స్
Image Credit : Getty

హెల్తీగా బరువు తగ్గే టిప్స్

బరువు తగ్గాలని చాలామంది అనుకుంటారు. కానీ బరువు తగ్గేటప్పుడు వేగం కంటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. సాధారణంగా వారానికి అర కేజీ నుంచి ఒక కేజీ వరకు తగ్గడం సురక్షితమైన పద్ధతిగా నిపుణులు చెబుతున్నారు. అంటే నెలకు 2 నుంచి 4 కేజీల వరకు తగ్గడం సాధ్యమే. అయితే ప్రతి ఒక్కరి శరీరం ఒకేలా ఉండదు. వయసు, ప్రస్తుత బరువు, ఆహారం, ఇతర ఆరోగ్య పరిస్థితులను బట్టి బరువు తగ్గే వేగం మారుతుంది. నెలలో 4 కేజీల వరకు తగ్గాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో కావాలో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఆహారంపై శ్రద్ధ
Image Credit : Getty

ఆహారంపై శ్రద్ధ

బరువు తగ్గాలంటే ముందుగా ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. అన్నం, రొట్టె లేదా ఇతర కార్బోహైడ్రేట్లను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే వాటిని సరైన మోతాదులో తీసుకోవాలి. ప్లేట్‌లో కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పప్పులు, శనగలు, పెసలు, గుడ్లు, చేపలు, చికెన్ వంటి ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని కూడా తగిన మోతాదులో తీసుకోవాలి. పండ్లు, సంపూర్ణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు వంటి పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది.

36
షుగర్ డ్రింక్స్ వద్దు
Image Credit : gemini ai

షుగర్ డ్రింక్స్ వద్దు

చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారం, కూల్‌ డ్రింక్స్, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, స్వీట్లు, బిస్కెట్లు, కేకులు, ఫాస్ట్ ఫుడ్ వంటి వాటిని తగ్గించాలి. ముఖ్యంగా టీ, కాఫీలలో ఎక్కువ చక్కెర వేసుకునే అలవాటు ఉంటే క్రమంగా తగ్గించుకోవాలి. దాహం వేసినప్పుడు కూల్‌ డ్రింక్స్ లేదా షుగర్ డ్రింక్స్ కి బదులుగా నీటిని ఎంచుకోవడం మంచి అలవాటు. పండ్లను జ్యూస్‌గా తాగడం కంటే నేరుగా తినడం వల్ల ఫైబర్ కూడా లభిస్తుంది.

46
ఆహారం మోతాదు ముఖ్యం
Image Credit : unsplash

ఆహారం మోతాదు ముఖ్యం

ఎంత హెల్తీ ఫుడ్ అయినా మోతాదుకు మించి తింటే బరువు పెరగవచ్చు. అందుకే ఎంత తింటున్నాం? అనే విషయంపై దృష్టి పెట్టాలి. భోజనాన్ని నెమ్మదిగా తినాలి. టీవీ లేదా మొబైల్ చూస్తూ తినడం తగ్గిస్తే ఎంత తింటున్నామో మనకు బాగా తెలుస్తుంది. ఆకలి లేకపోయినా అలవాటుగా స్నాక్స్ తినడం మానుకోవాలి. రాత్రి సమయంలో తరచుగా ఏదో ఒకటి తినే అలవాటు ఉంటే దాన్ని తగ్గించుకోవడం మంచిది.

56
వ్యాయామం అవసరం
Image Credit : Instagram

వ్యాయామం అవసరం

బరువు తగ్గడానికి వ్యాయామం కూడా చాలా అవసరం. రోజూ కొంత సమయం నడవడం సులభమైన మార్గం. మొదట 20 నుంచి 30 నిమిషాలతో ప్రారంభించి, క్రమంగా సమయాన్ని పెంచుకోవచ్చు. లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఉపయోగించడం, దగ్గరి ప్రదేశాలకు వాహనం బదులుగా నడిచి వెళ్లడం, ఎక్కువసేపు కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి కదలడం వంటి చిన్న మార్పులు కూడా ఉపయోగపడతాయి.

66
నిద్ర ముఖ్యం
Image Credit : Getty

నిద్ర ముఖ్యం

నిద్రను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. సరైన నిద్ర లేకపోతే అలసట పెరగడంతో పాటు తినే అలవాట్లు కూడా మారవచ్చు. అందుకే ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, తగినంత నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా కొందరు ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. కాబట్టి నడక, ధ్యానం, యోగా లేదా మనసుకు ప్రశాంతత ఇచ్చే ఇతర పనులకు కొంత సమయం కేటాయించాలి.

బరువు తగ్గుతున్నప్పుడు ప్రతిరోజూ బరువు చూసుకుని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శరీరంలో నీటి పరిమాణం మారడం వల్ల బరువులో చిన్న చిన్న మార్పులు సహజంగానే ఉంటాయి. వారానికి ఒకసారి బరువు చూసుకోవడం, అలాగే నడుము చుట్టుకొలతలో మార్పులను గమనించడం మంచిది. త్వరగా బరువు తగ్గాలని భోజనం పూర్తిగా మానేయడం, చాలా తక్కువగా తినడం, క్రాష్ డైట్లు పాటించడం లేదా తెలియని బరువు తగ్గించే మందులు, సప్లిమెంట్లు వాడటం మంచిది కాదు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rice Storage: బియ్యానికి పురుగులు ప‌డుతున్నాయా? ఈ సింపుల్ టిప్స్‌తో చెక్ పెట్టొచ్చు
Recommended image2
Viral News: బిర్యానీ కోసం 15 ఏళ్ల కెరియర్ త్యాగం.. ఉద్యోగమే వదిలేసి దేశాలు తిరుగుతున్న చెఫ్
Recommended image3
French Fries: నూనె లేకుండా ఫ్రెంచ్ ఫ్రైస్‌.. ఇలా చేస్తే క్రిస్పీతో పాటు టేస్ట్ ఖాయం
Related Stories
Recommended image1
Parenting: మగపిల్లలు తప్పు చేసినప్పుడు తండ్రి అస్సలు చెప్పకూడని 5 మాటలు ఇవే!
Recommended image2
Did You Know: ఆకలి లేకపోయినా తినాలని ఎందుకు అనిపిస్తుందో తెలుసా? అసలు కారణం ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved