Negative Energy test: మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందో లేదో ఇలా తెలుసుకోండి
Negative Energy test: ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ ఇంట్లోని వారికి సమస్యలు వస్తాయి. ఆరోగ్య ఇబ్బందులు వస్తాయి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందో లేదో తెలుసుకునేందుకు చిన్న చిట్కా ఉంది.

ఇంట్లో నెగిటివ్ శక్తి ఉంటే...
ఇంట్లో ప్రశాంతత లేకపోవడం, కారణం లేకుండా గొడవలు పెరగడం, అసహనం అధికంగా కలగడం వంటి సమస్యలు వస్తున్నాయంటే నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. వాస్తు శాస్త్రం కూడా ఇదే విషయాన్ని చెబుతుంది. ఇలాంటి సమస్యలకు నెగటివ్ ఎనర్జీ కారణం. ఒకప్పుడు సంతోషంగా ఉన్న ఇంట్లో ఒక్కసారిగా ఆర్థిక సమస్యలు రావడం, పనులు అనుకున్నట్టు జరగకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య దూరం పెరగడం లాంటి పరిస్థితులు కనిపిస్తే ఇంటి వాతావరణంలో ప్రతికూల శక్తులు ఉన్నాయేమో అనుమానించాలి. వాస్తు నిపుణులు చెబుతున్న ప్రకారం ఇంట్లోకి పాజిటివ్ శక్తి ప్రవాహం తగ్గినప్పుడు ఆ ప్రభావం ఆ ఇంట్లోని వ్యక్తుల మనసు, ఆరోగ్యం, ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుంది.
ఈ చిన్న పరీక్ష చేయండి
ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా లేదా తెలుసుకునేందుకు వాస్తు శాస్త్రంలో ఒక సులభమైన పరీక్ష ఉంది. ఒక గాజు బౌల్ తో తీసుకుని అందులో శుభ్రమైన నీళ్లు పోయాలి. ఆ నీళ్లలో కొన్ని గులాబీ పువ్వుల రేకులు వేసి, ఆ గిన్నెను ఇంట్లో ఏదైనా ఒక మూలలో 24 గంటల పాటు ఉంచాలి. ఒక రోజు తర్వాత నీటిని గమనించాలి. నీటి రంగు మారిపోతే లేదా దుర్వాసన వస్తే ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నాయని భావిస్తారు. రంగు మారకపోయినా... ఇంట్లో తరచూ సమస్యలు ఎదురవుతున్నట్లయితే వాస్తు లోపాల వల్ల ఇబ్బందులు ఉండవచ్చని నిపుణులు చెబుతారు. ఈ పద్ధతి చాలా సులభమైనదే. దీన్ని చాలామంది నమ్ముతారు.
నెగటివ్ ఎనర్జీ ఇలా తొలగించండి
నెగటివ్ ఎనర్జీని తొలగించేందుకు వాస్తు శాస్త్రంలో కొన్ని సాధారణ చిట్కాలు ఉన్నాయి. ఇంట్లో ఉదయం సూర్యకాంతి, స్వచ్ఛమైన గాలి బాగా వచ్చేలా కిటికీలు తెరిచి ఉంచాలి. పాడయిన వస్తువులు, వాడని సామాన్లు ఇంట్లో ఉంచకుండా బయటపడేయాలి. ఇంటి నాలుగు మూలల్లో రాతి ఉప్పు ఉంచాలి. దీనివల్ల ప్రతికూల శక్తి తగ్గుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుస్తూ ఉండాలి. అలాగే ఉదయం లేదా సాయంత్రం కర్పూరం, ధూపం వెలిగించడం ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు.
ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర
ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర కొన్ని వస్తువులు ఉంచడం కూడా శుభ ఫలితాలు ఇస్తుందని అంటారు. నిమ్మకాయలు, ఎండిమిర్చిని దారానికి గుచ్చి ద్వారం వద్ద వేలాడదీయాలి. ఇది దుష్ట శక్తులను దూరం చేస్తుందని అంటారు. ఇంట్లో ఎప్పుడూ శుభ్రత పాటించడం చాలా ముఖ్యమని వాస్తు శాస్త్రం చెబుతుంది. గందరగోళంగా ఉన్న ఇల్లు మనసుకు భారంగా మారుతుంది. మొక్కలు, పూజాస్థలంలో పవిత్ర వస్తువులు ఉంచడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుందని నమ్మకం. ఇలా వాస్తు చిట్కాలు పాటించడం వల్ల జీవితం సాఫీగా, ఆనందంగా సాగుతుంది.

