- Home
- Astrology
- Lucky Birth Stars: ఈ 4 నక్షత్రాల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు, జీవితంలో దేనికీ లోటుండదు
Lucky Birth Stars: ఈ 4 నక్షత్రాల్లో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు, జీవితంలో దేనికీ లోటుండదు
Lucky Birth Stars: ఒక వ్యక్తి పుట్టిన రాశి మాత్రమే కాదు, అతడు పుట్టిన నక్షత్రం కూడా ఆ వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కొన్ని నక్షత్రాల్లో పుట్టిన చాలా అదృష్టవంతులు. వారికి జీవితంలో సిరిసంపదలు, సంతోషాలు నిండి ఉంటాయి.

అదృష్ట నక్షత్రాలు
జ్యోతిష శాస్త్రం చెబుతున్న ప్రకారం జన్మ నక్షత్రం ఆ వ్యక్తి జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. రాశి లాగే నక్షత్రం కూడా జీవితాన్ని మార్చుతుంది. ధనం, విజయం, పేరు ప్రతిష్టలు వంటి అంశాలపై నక్షత్ర ప్రభావం అధికంగానే ఉంటుంది. తెలుగులో 27 నక్షత్రాలు ఉన్నాయి. అందులో కొన్ని నక్షత్రాలు ఎంతో శుభకరమైనవిగా భావిస్తారు. ఆ నక్షత్రాలలో జన్మించడం అదృష్టంగా చెబుతారు. ఈ నక్షత్రాలలో జన్మించిన వారికి జీవితంలో ఐశ్వర్యం, ఉన్నత స్థానం, సుఖసంతోషాలు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పండితులు చెబుతారు.జీవితంలో మంచి ఫలితాలను ఇచ్చే నాలుగు నక్షత్రాల గురించి ఇక్కడ ఇచ్చాము. ఈ నక్ష్రతాల్లో పుట్టడం నిజంగా అదృష్టమని అంటారు.
పుష్యమి నక్షత్రం
పుష్యమి నక్షత్రాన్ని జ్యోతిషశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన నక్షత్రంగా భావిస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులకు క్రమశిక్షణ, బాధ్యత భావం ఎక్కువగా ఉంటుంది. చిన్న వయసులోనే కష్టాలు ఎదురైనా వాటిని తట్టుకుని నిలుచుంటారు. ఆ కష్టాల నుంచే జీవితంలో క్రమంగా ఎదుగడం నేర్చుకుంటారు. కుటుంబంలో మంచి గౌరవం పొందుతారు. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభాలు స్థిరంగా వస్తూనే ఉంటాయి. ధనం విషయంలో ఎప్పుడూ లోటు అనిపించదు. కష్టపడే స్వభావం ఉండటంతో సంపాదించిన ధనాన్ని జాగ్రత్తగా వినియోగిస్తారు. ఈ నక్షత్ర ప్రభావంతో జీవితంలో స్థిరత్వం లభిస్తుందని నమ్మకం.
ఉత్తర ఫల్గుణి నక్షత్రం
ఉత్తర ఫల్గుణి నక్షత్రంపై సూర్యుడు, శుక్రుడి ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ నక్షత్రంలో జన్మించినవారికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. బాధ్యతలు తీసుకోవడంలో ముందుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు, పరిపాలనా రంగం, రాజకీయాలు వంటి రంగాలలో పనిచేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్టలు పొందుతారు. ధనం మాత్రమే కాదు, ఇతరులకు సహాయం చేసే మనసు కూడా వీరిలో ఉంటుంది. కుటుంబానికి అండగా నిలుస్తారు. జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుని ఇతరులకు ఆదర్శంగా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
రోహిణి నక్షత్రం
రోహిణి నక్షత్రం చంద్రుడి ఆధీనంలో ఉంటుంది. రోహిణి నక్షత్రంలో పుట్టినవారు ఎంతో అందమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. తమ మాట తీరుతోనే ఇతరులను తమవైపు ఆకట్టుకునే శక్తిని కలిగి ఉంటారు. వీరికి సుఖాలు, విలాసవంతమైన జీవితం అంటే చాలా ఇష్టం. వ్యవసాయం, వ్యాపారం, కళలు, సినీరంగం వంటి రంగాలలో మంచి పేరును సంపాదిస్తారు. ధనం సంపాదన విషయంలో అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబ జీవితం కూడా సంతోషంగా సాగుతుంది. ఈ నక్షత్రంలో జన్మించినవారికి ఇల్లు, వాహనాలు, భూములు వంటి ఆస్తులు వంటి బాగా సంపాదిస్తారు.
స్వాతి నక్షత్రం
స్వాతి నక్షత్రానికి రాహువుతో అనుబంధం ఉంటుంది. వీరిపై రాహువు ప్రభావం కూడా ఎక్కువ. స్వాతి నక్షత్రంలో పుట్టినవారికి స్వతంత్ర భావనలు ఎక్కువగా ఉంటాయి. తాము ఎవరి ఆధీనంలోనూ ఉండకుండా తమ శక్తితో ఎదగాలనే తపన ఉంటుంది. కొత్త ఆలోచనలు, సాహస నిర్ణయాలు తీసుకునే ధైర్యం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి విజయాలు అందుతాయిి. విదేశీ ప్రయాణాలు, విదేశీ అవకాశాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డబ్బు సంపాదనలో మంచి తెలివి తేటలు చూపిస్తారు. ఒకసారి స్థిరపడితే జీవితాంతం ఆర్థిక భద్రత ఉండేలా జాగ్రత్తపడతారు. కష్టకాలం వచ్చినా మళ్లీ లేచి నిలబడే శక్తి స్వాతి నక్షత్రం వారికి అధికంగా ఉంటుంది.

