- Home
- Astrology
- Venus Mars Effects: రెండు శత్రుగ్రహాల కలయిక, ఈ 4 రాశులు ఆ 5 రోజుల పాటూ జాగ్రత్తగా ఉండాలి
Venus Mars Effects: రెండు శత్రుగ్రహాల కలయిక, ఈ 4 రాశులు ఆ 5 రోజుల పాటూ జాగ్రత్తగా ఉండాలి
Venus Mars Effects: శుక్రుడు, కుజుడు ఇద్దరూ ఎంతో ముఖ్యమైన గ్రహాలు. వీరిద్దరికీ ఏమాత్రం పడదు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల నాలుగు రాశుల వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

కుజ శుక్రుల ప్రభావం
జ్యోతిషశాస్త్రంలో గ్రహాల కలయికలు ఎంతో ముఖ్యమైనవి. ఒకే రాశిలో లేదా నక్షత్రంలో కొన్ని గ్రహాలు కలిస్తే అవి వ్యక్తల జీవితాలపై ప్రభావం చూపుతాయని విశ్వసిస్తారు. 2026 జనవరి నెలలో శుక్రుడు, మంగళుడు ఒకరికొకరు అత్యంత సమీపంగా రాబోతున్నారు. దీన్ని గ్రహ యుద్ధంగా చెప్పుకుంటారు. శుక్రుడు సుఖసంతోషాలు, ప్రేమ, సంపదకు కారకుడు కాగా.. కుజుడు ఆవేశం, ధైర్యం, కోపానికి సూచిక. ఈ రెండు గ్రహాల శక్తులు ఎదురెదురుగా ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి, అనవసర వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.
జనవరి 6 నుంచి జనవరి 10 మధ్య ఈ శుక్రుడు, కుజుడు ఒకరికొకరు దగ్గరగా వస్తారు. దీని వల్ల కొన్ని రాశుల వారి జీవితంలో చిన్న విషయాలకే కోపం రావడం, నిర్ణయాల్లో తొందరపాటు కనిపించవచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు, సహోద్యోగులతో మాటల తగాదాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
మేష రాశి
మేష రాశి వారికి కుజుడు,శుక్రుడు మధ్య జరిగే ఘర్షణ... వారి జీవితంలో ఒత్తిడి, కోపం, చిరాకును పెంచుతుంది. చేసే పనిలో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈ సమయంలో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ అయిదు రోజులపాటూ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. నిద్రలేమి, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా కూడా నష్టపోయే అవకాశం ఉంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ అయిదు రోజుల సమయం ఒత్తిడిని, అశాంతిని పెంచుతుంది. కొంతమంది ఆర్థిక పరిస్థితి అస్థిరంగా మారిపోతుంది. జనవరి 6 నుంచి 10 వరకు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా సమాధానం ఇవ్వకుండా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్, యోగా వంటివి సాధన చేయాలి. ఫన్నీ వీడియోలు చూసేందుకు ప్రయత్నించాలి.
తులా రాశి
వచ్చే జనవరి 6 నుంచి 10వ తేదీ వరకు తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితోనైనా వివాదం జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ రాశి వారు మానసికంగా కలత చెందే అవకాశం ఉంది. చట్టపరమైన చర్యల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇల్లు, పనిని సమతుల్యం చేసుకోవడం కష్టంగా మారుతుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. నిద్ర, విశ్రాంతి కోసం సమయం కేటాయించుకోవాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఒత్తిడి, ఆందోళన విపరీతంగా పెరిగిపోతాయి. ఈ రాశి వారు మానసికంగా అలసిపోయినట్లు అయిపోతారు. ఈ రాశివారు అయిదు రోజుల పాటూ వాదనలు, గొడవలకు దూరంగా ఉండాలి. లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి.

