Telugu

బొప్పాయిని రెగ్యులర్ గా తింటే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Telugu

బరువు తగ్గడంలో..

బొప్పాయిలో ఫైబర్ ఎక్కువ. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

Image credits: Pixabay
Telugu

ఆకలి నియంత్రణ

బొప్పాయిలోని ఫైబర్ వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అనవసరమైన ఆకలి తగ్గుతుంది.

Image credits: Pixabay
Telugu

కంటికి రక్షణ

కంటి కార్నియాను రక్షించే విటమిన్ ఎ బొప్పాయిలో పుష్కలంగా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు 'మాక్యులర్ డిజెనరేషన్' ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

Image credits: Getty
Telugu

చర్మ సంరక్షణ

విటమిన్ సి కి మంచి మూలమైన బొప్పాయి శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Image credits: Getty
Telugu

నెలసరి నొప్పికి చెక్

నెలసరి సమయంలో వచ్చే తీవ్రమైన నొప్పి తగ్గడానికి బొప్పాయి సహాయపడుతుంది. ఈ సమస్య ఉన్న మహిళలు బొప్పాయిని రెగ్యులర్ గా తినడం మంచిది. 

Image credits: Getty
Telugu

రోగనిరోధక శక్తి

బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచే 'బీటా కెరోటిన్' కూడా బొప్పాయిలో ఉంటుంది.

Image credits: Getty
Telugu

గుండె ఆరోగ్యం

పొటాషియం, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున గుండె ఆరోగ్యానికి బొప్పాయి ఒక ఉత్తమమైన ఆహారం.

Image credits: Getty
Telugu

మలబద్ధకం నివారణ

బొప్పాయిలో అధికంగా ఉండే నీటి శాతం కడుపు ఉబ్బరాన్ని తగ్గించి, మలబద్ధకాన్ని నివారించడం ద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Image credits: Getty

Soft Chapati: పిండిలో ఇవి కలిపితే.. చపాతీలు చాలా మృదువుగా వస్తాయి

Meenakari Bangles: చీరల మీదకు అదిరిపోయే మీనాకారీ బ్యాంగిల్స్.. ఇవిగో!

Mangalsutra Designs: మహిళలు మెచ్చే ట్రెండీ నల్లపూసల డిజైన్లు ఇవి

Mettela Designs: ఈ వెండి మెట్టెలు చూస్తే ఎవ్వరైనా వావ్ అనాల్సిందే!