Telugu

Soft Chapati: పిండిలో ఇవి కలిపితే.. చపాతీలు చాలా మృదువుగా వస్తాయి

Telugu

పిండిలో అవకాడో పేస్ట్ కలపండి

గోధుమ పిండిలో నీళ్లు పోసి కలిపే ముందు, ఒక పండిన అవకాడో తొక్క, గింజ తీసేసి మెత్తని పేస్ట్‌లా చేసుకోండి. దీనిని పిండిలో వేసి బాగా కలపడం వల్ల చపాతీలు చాలా మృదువుగా వస్తాయి.

Image credits: freepik
Telugu

ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలపండి

 పిండిలో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీల్లా ఒత్తుకుని, పెనంపై కాల్చుకుంటే ఎంతో మెత్తగా వస్తాయి.

Image credits: ఏఐ ఆధారంగా రూపొందించిన చిత్రం
Telugu

పిండి కలిపేటప్పుడు కాస్త నెయ్యి వాడండి

చపాతీ పిండిని కలిపే సమయంలో కొద్దిగా నెయ్యి వేయడం వల్ల పిండికి సహజమైన మృదుత్వం వస్తుంది. దీనివల్ల చపాతీలు చాలా సేపటి వరకు గట్టిపడకుండా సాఫ్ట్‌గా ఉంటాయి.

Image credits: Getty
Telugu

పెరుగు కలిపి పిండిని నానబెట్టండి

గోధుమ పిండిలో కొద్దిగా పెరుగు వేసి పిండిని కలపవచ్చు. ఇలా కలిపిన పిండిని ఒకటి నుండి రెండు గంటల పాటు పక్కన ఉంచి, ఆ తర్వాత చపాతీలు చేసుకుంటే దూదిలా మెత్తగా వస్తాయి.

Image credits: Getty
Telugu

పిండి కలపడానికి గోరువెచ్చని నీళ్లు వాడండి

 చపాతీ పిండి కలిపేటప్పుడు చల్లటి నీళ్లకు బదులుగా గోరువెచ్చని నీళ్లను ఉపయోగించండి. ఇది పిండిని త్వరగా మృదువుగా మార్చి, చపాతీలు సాఫ్ట్‌గా రావడానికి సహాయపడుతుంది.

Image credits: Pixabay
Telugu

కొబ్బరి నూనెతో కూడా పిండి కలపవచ్చు

 ఇంట్లో నెయ్యి లేదా పెరుగు అందుబాటులో లేకపోతే, పిండి కలిపేటప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె  వేసి కలపవచ్చు. దీనివల్ల కూడా చపాతీలు చాలా మృదువుగా, రుచిగా వస్తాయి.

Image credits: Getty

Meenakari Bangles: చీరల మీదకు అదిరిపోయే మీనాకారీ బ్యాంగిల్స్.. ఇవిగో!

Mangalsutra Designs: మహిళలు మెచ్చే ట్రెండీ నల్లపూసల డిజైన్లు ఇవి

Mettela Designs: ఈ వెండి మెట్టెలు చూస్తే ఎవ్వరైనా వావ్ అనాల్సిందే!

Hair Care: తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!