Glowing Skin: జస్ట్ 2 స్పూన్లు చాలు..ముఖం మెరిసిపోతుంది.
Glowing Skin: మచ్చల్లేని మెరిసే ముఖం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కొనుగోలు చేస్తారు, బ్యూటీ ట్రీట్మెంట్లు కూడా చేయించుకుంటారు. కానీ ఇంట్లో సులభంగా లభించే సహజ ఇంగ్రీడియంట్ తో ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు.

చిన్న చిన్న చిట్కాలతో ఫేష్ బ్యూటీ డెవలప్
చిన్న చిన్న చిట్కాలతో ఫేష్ బ్యూటీ డెవలప్ చేసుకోవచ్చు. కానీ చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోరు.ఎంతసేపు ఇన్ స్టంట్ గ్లో, పార్లర్లు, కాస్ట్లీ ప్రొడక్టులకై పాకులాడుతారు. అలా ఉన్న అందాన్ని పొగొట్టుకుంటారు. మచ్చలు, టానింగ్ పోవాలంటే ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు. పచ్చి పాలతోనే మెరిసే చర్మం పొందొచ్చు. చాలా కాలంగా పచ్చి పాలను చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. ఇది సహజమైనది కావడంతో అన్ని రకాల చర్మాలకు సరిపోతుంది.
చర్మానికి పచ్చి పాల ప్రయోజనాలు
పచ్చి పాలలో చర్మ ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. దీంతో చర్మం తాజాగా, మెత్తగా కనిపిస్తుంది. అలాగే పాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి చర్మాన్ని రక్షిస్తాయి.
ఇందులో ఉండే విటమిన్ A..చర్మాన్ని తేమగా ఉంచి ముఖ కాంతిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పాలలో ఉన్న ప్రోటీన్లు స్కిన్ ను దృఢంగా, యవ్వనంగా ఉంచడంలో కూడా ఉపయోగపడతాయి. అందుకే పచ్చి పాలను సహజమైన స్కిన్ కేర్ టిప్‌గా చాలా మంది ఉపయోగిస్తారు.
ముఖానికి పచ్చి పాలు రాస్తే ఏమవుతుంది?
ముఖం ఎక్కువగా ఎండిపోయి, డల్‌గా కనిపిస్తే పచ్చి పాలు మంచి పరిష్కారం అవుతుంది. పచ్చి పాలను ముఖానికి రాస్తే చర్మానికి తేమ అందుతుంది. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. అంతేకాకుండా పాలలోని లాక్టిక్ యాసిడ్ చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి ముఖాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.
ఇది చర్మంపై ఉన్న టానింగ్, మచ్చలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే చర్మంలో ఉన్న చిన్నపాటి వాపులను తగ్గించి ముఖానికి ఫ్రెష్ లుక్ ఇస్తుంది. పచ్చి పాలలో ఉండే విటమిన్ A వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
పచ్చి పాలను ముఖానికి ఎలా ఉపయోగించాలి?
ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడగాలి. తరువాత రెండు టీస్పూన్లు పచ్చి పాలను తీసుకుని అందులో కొద్దిగా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి సుమారు 15 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగితే చర్మం తాజాగా, మెత్తగా కనిపిస్తుంది. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేస్తే ముఖం సహజంగా మెరిసిపోతుంది.

