Curd and Turmeric Face Pack: పెరుగులో పసుపు కలిపి ముఖానికి రాస్తే ఏమవుతుందో తెలుసా?
పెరుగు, పసుపు.. ఈ రెండు పదాలు వినగానే చాలా మందికి అమ్మమ్మల చిట్కాలు గుర్తొస్తాయి. పెరుగులో పసుపు కలిపి రాస్తే ముఖం సహజంగా మెరుస్తుందని చాలామంది నమ్మకం. కానీ నిజంగా ఇది చర్మానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

పెరుగు, పసుపు ఫేస్ ప్యాక్
పెరుగు, పసుపు రెండూ సహజ పదార్థాలే కాబట్టి చాలామంది వీటిని ముఖానికి వాడుతుంటారు. వీటి మిశ్రమం చర్మానికి మేలు చేస్తుందని చాలామంది నమ్మకం. కానీ నిజంగా ఈ ఫేస్ ప్యాక్ ఎలా పనిచేస్తుంది? అందరికి సెట్ అవుతుందా? లేక ఏవైనా సమస్యలు వస్తాయా? అసలు ఈ ఫేస్ ప్యాక్ గురించి చర్మ నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మృదువుగా, కాంతివంతంగా..
పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మంపై పేరుకుపోయిన మృత కణాలను నెమ్మదిగా తొలగించి, కొత్త కణాలు బయటకు రావడానికి సహాయపడుతుంది. దీనివల్ల చర్మం కొంచెం స్మూత్‌గా, కాంతివంతంగా కనిపిస్తుంది. అంతేకాదు పెరుగులోని ప్రొబయోటిక్ లక్షణాలు.. చర్మానికి తేమను అందిస్తాయి.
మొటిమలు తగ్గడానికి
పసుపులో ఉండే కర్క్యుమిన్ అనే పదార్థం యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. నిపుణుల ప్రకారం.. ఇది మొటిమలు, రెడ్‌నెస్, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే పసుపును స్కిన్ కేర్ ప్రోడక్టుల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే పసుపును నేరుగా వాడినప్పుడు చాలా తక్కువ మోతాదులో ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వారానికి ఒకసారి
పెరుగు, పసుపు రెండింటిని కలిపి వాడటం వల్ల ముఖానికి ఫ్రెష్ లుక్ వస్తుంది. టాన్ తగ్గుతుంది, చర్మం సాఫ్ట్‌గా మారుతుంది. ముఖ్యంగా ఆయిలీ స్కిన్ లేదా మిక్స్‌డ్ స్కిన్ ఉన్నవారు, వారానికి ఒకసారి ఈ మిశ్రమాన్ని వాడటం వల్ల స్కిన్ క్లీన్‌గా మారుతుంది.
ఈ సమస్యలు రావొచ్చు
సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి పసుపు వల్ల ఇరిటేషన్, దురద, మంట వంటి సమస్యలు రావొచ్చు. కాబట్టి ఈ మిశ్రమాన్ని వాడేముందు తప్పనిసరిగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ కోసం చిటికెడు పసుపు, ఫ్రెష్ పెరుగు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
10-15 నిమిషాలు
నిపుణుల ప్రకారం పెరుగు, పసుపు మిశ్రమాన్ని ముఖానికి రాసినప్పుడు 10–15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉంచకూడదు. ఆ సమయం తర్వాత నార్మల్ వాటర్ తో లేదా మైల్డ్ క్లెన్సర్‌తో ముఖం కడగాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మించకుండా వాడటం మంచిది.

