Weight Loss Fruit: వేసవిలో ఈ ఒక్క పండును తిన్నా.. చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారు తెలుసా..?
Weight Loss Fruit: వేసవిలో మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, జీర్ణవ్యవస్థను బాగు చేసుకోవడానికి బొప్పాయిని తినడం చాలా ముఖ్యం. కానీ ఈ పండు బరువును కూడా తగ్గిస్తుందన్న ముచ్చట మీకు తెలుసా..?

Weight Loss Fruit: వేసవి దాహాన్ని తీర్చడానికి మనకు ఎన్నో రకాల పండ్లు సహాయపడతాయి. పండ్లు మనల్ని ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచడంతో పాటుగా.. శరీరాన్ని హైడ్రేట్ గా కూడా ఉంచుతాయి. మనల్ని ఆరోగ్యంగా ఉంచే పండ్లలో బొప్పాయి ( papaya ) కూడా ఒకటి. ఈ పండును ఫిట్ నెస్ (Fitness)ను కోరుకునే ప్రతి ఒక్కరూ తింటుంటారు.
ఇందులో విటమిన్ ఎ (Vitamin A), విటమిన్ సి, నియాసిన్, మెగ్నీషియం (Magnesium), కెరోటిన్, ఫైబర్, ఫోలేట్, పొటాషియం, కాపర్, కాల్షియం, ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు.. వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయి. ముఖ్యంగా బొప్పాయి అధిక బరువును (Overweight)కూడా తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
బొప్పాయిని బరువు తగ్గించే పండు (Weight loss fruit)అని కూడా అంటారు. అయితే ఈ పండు బరువు తగ్గడానికి నేరుగా సహాయపడనప్పటికీ.. ఇది జీర్ణక్రియ (Digestion)ను మెరుగుపరుస్తుంది. ఇది బొడ్డు కొవ్వు (Belly fat)ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ బొప్పాయి పండును తింటే మీకు ఎక్కువ సేపు ఆకలిగా అనిపించదు. అంతేకాదు.. దీనివల్ల మీరు ఎక్కువ మొత్తంలో ఫుడ్ ను తినలేరు. కరెక్టుగా ఒక నెల రోజుల పాటు దీన్ని తింటే మీలో మార్పును చూసి ఆశ్చర్యపోతారు.
బొప్పాయిని తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు..
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది: బొప్పాయిలో ఎన్నో ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. అంతేకాదు.. ఇది క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పలు అధ్యయనాలు కూడా తేల్చి చెప్పాయి.
గుండె ఆరోగ్యం బాగుంటుంది: మన దేశంలో హార్ట్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ గుండె జబ్బులు సోకడానికి మనం తీసుకునే ఆయిలీ ఫుడ్స్ కూడా కారణమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే బొప్పాయి పండును రోజువారి ఆహారంలో చేర్చుకుంటే ఇందులో ఉండే లైకోపీన్, విటమిన్ సి గుండె జబ్బులను నివారించడంలో సహాయపడతాయి. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడతాయి.
Papaya
బొప్పాయిని కూడా చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బొప్పాయిని తీసుకోవడం వల్ల ల చర్మం మెరిసిపోతుంది. దీనిని యాంటీ ఏజింగ్ గా కూడా ఉపయోగిస్తారు. అంతేకాదు బొప్పాయి ఆకులను మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నివారణకు కూడా ఉపయోగిస్తారు.
ఇది జీర్ణక్రియ, బరువు పెరగడం, మధుమేహం, క్యాన్సర్, కొలెస్ట్రాల్, బీపి వంటి వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తుంది. అందుకే దీనిని తప్పకుండా తినాలని నిపుణులు చెబుతున్నారు.