MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Life
  • Parenting Tips: పిల్లల వయసును బట్టి ఒక తండ్రి రోజూ పిల్లలతో ఎంత టైం గడపాలో తెలుసా?

Parenting Tips: పిల్లల వయసును బట్టి ఒక తండ్రి రోజూ పిల్లలతో ఎంత టైం గడపాలో తెలుసా?

Parenting Tips: నేటి బిజీ జీవితంలో చాలామంది తండ్రులు కుటుంబం కోసం రోజంతా ఉద్యోగం లేదా వ్యాపారంలో గడిపేస్తున్నారు. అయితే పిల్లలకు తండ్రి సంపాదన ఎంత అవసరమో, ఆయనతో గడిపే సమయం కూడా అంతే ముఖ్యం. మరి తండ్రి, పిల్లలకి ఎంత టైం కేటాయించాలో ఇక్కడ చూద్దాం. 

2 Min read
Author : Kavitha G
Published : Jun 09 2026, 04:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వయసును బట్టి పిల్లలతో తండ్రి ఎంత టైం గడపాలి?
Image Credit : Getty

వయసును బట్టి పిల్లలతో తండ్రి ఎంత టైం గడపాలి?

నిపుణుల ప్రకారం పిల్లల పెంపకంలో తల్లి పాత్ర ఎంత ముఖ్యమో, తండ్రి పాత్ర కూడా అంతే ముఖ్యం. ప్రస్తుత కాలంలో చాలామంది తండ్రులు ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర బాధ్యతలతో బిజీగా ఉండటం వల్ల పిల్లలతో గడిపే సమయం తగ్గిపోతోంది. అయితే పిల్లల మానసిక, భావోద్వేగ, సామాజిక ఎదుగుదలలో తండ్రితో గడిపే సమయం కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లల వయసును బట్టి వారికి అవసరమైన శ్రద్ధ, ప్రేమ, మార్గదర్శకత్వం మారుతూ ఉంటుంది. అందుకే ప్రతి వయసులో తండ్రి పిల్లలతో ఎంత సమయం గడపాలి? ఆ సమయంలో ఏం చేయాలి వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
3 సంవత్సరాలలోపు పిల్లలు
Image Credit : Getty

3 సంవత్సరాలలోపు పిల్లలు

3 సంవత్సరాలలోపు వయసున్న పిల్లలు తమ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు. ఇది పిల్లలలో భద్రతా భావం, ఆత్మవిశ్వాసం, భావోద్వేగ అనుబంధం ఏర్పడే దశ. అందువల్ల తండ్రులు రోజుకు సుమారు 3 నుంచి 5 గంటల వరకు పిల్లలతో గడపడానికి ప్రయత్నించాలి. వారిని ఎత్తుకోవడం, ఆటలు ఆడించడం, బయటకు తీసుకెళ్లడం లేదా కాసేపు వారితో మాట్లాడటం వంటివి చేయాలి. ఇవి పిల్లల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి. ఈ సమయంలో పిల్లలు తండ్రి ప్రేమను ఎక్కువగా అనుభవిస్తారు.

Related Articles

Related image1
Child Psychology: పిల్లల్ని బెదిరించి చదివిస్తే సక్సెస్ అవుతారా? సైకాలజీ ఏం చెబుతోంది?
Related image2
Child Psychology: పిల్లల్ని పదే పదే చెంపపై కొడుతున్నారా? వాళ్లు ఎలా మారిపోతారో తెలుసా?
35
4-7 సంవత్సరాల పిల్లలు
Image Credit : freepik

4-7 సంవత్సరాల పిల్లలు

4 నుంచి 7 సంవత్సరాల వయసు వచ్చే సరికి పిల్లల్లో ఊహాశక్తి, నేర్చుకునే ఆసక్తి మరింత పెరుగుతుంది. ఈ వయసులో తండ్రి, పిల్లల కోసం రోజుకు 2 నుంచి 3 గంటల సమయం కేటాయించడం మంచిది. కథలు చెప్పడం, కలిసి ఆటలు ఆడటం, కొత్త విషయాలు నేర్పించడం వంటివి పిల్లల ఆలోచనా శక్తిని పెంచుతాయి. తండ్రి పిల్లలతో కలిసి సమయం గడపడం వల్ల పిల్లల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి.

45
8-12 సంవత్సరాల పిల్లలు
Image Credit : Instagram

8-12 సంవత్సరాల పిల్లలు

8 నుంచి 12 సంవత్సరాల వయసులో పిల్లలు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభిస్తారు. ఈ దశలో తండ్రి పాత్ర మార్గదర్శకుడిగా మారుతుంది. కాబట్టి తండ్రి రోజుకు కనీసం 2 గంటల పాటు పిల్లలతో గడపడం మంచిది. హోంవర్క్ చేయడంలో సహాయం చేయడం, స్కూల్‌లో జరిగిన విషయాలు అడిగి తెలుసుకోవడం, వారి స్నేహితులు, ఆసక్తుల గురించి మాట్లాడటం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు తమ సమస్యలను తండ్రితో పంచుకునే అలవాటు పెంచుకుంటారు.

55
13 సంవత్సరాలు దాటిన పిల్లలు
Image Credit : Twitter

13 సంవత్సరాలు దాటిన పిల్లలు

13 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలు యుక్త వయస్సులోకి అడుగుపెడతారు. ఈ సమయంలో వారికి స్వేచ్ఛ కావాలనిపించినా, తల్లిదండ్రుల మార్గదర్శకత్వం అవసరమే. కాబట్టి తండ్రి రోజుకు కనీసం ఒక గంట సమయాన్ని పిల్లల కోసం కేటాయించడం మంచిది. స్నేహితుడిలా మాట్లాడటం, వారి అభిప్రాయాలను వినడం, చదువులు, కెరీర్, జీవిత లక్ష్యాల గురించి చర్చించడం ద్వారా తండ్రి, పిల్లల మధ్య బంధం మరింత బలపడుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిన్నారుల సంరక్షణ
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Black Beads: నల్లపూసలకు మ్యాచింగ్ బ్రేస్లేట్ డిజైన్లు.. చూసేయండి
Recommended image2
Dosa: దోశ పెనానికి అతుక్కుపోతోందా? ఇదొక్కటి చేస్తే.. హోటల్ స్టైల్ దోశ ఇంట్లోనే..!
Recommended image3
Rice vs Chapati vs Jowar Roti: అన్నం, చపాతీ, జొన్న రొట్టె.. వీటిలో రాత్రి భోజనానికి ఏది బెస్ట్?
Related Stories
Recommended image1
Child Psychology: పిల్లల్ని బెదిరించి చదివిస్తే సక్సెస్ అవుతారా? సైకాలజీ ఏం చెబుతోంది?
Recommended image2
Child Psychology: పిల్లల్ని పదే పదే చెంపపై కొడుతున్నారా? వాళ్లు ఎలా మారిపోతారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved