MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • ఓ అండర్ వేర్ ఎన్నిరోజులు వాడాలో తెలుసా?

ఓ అండర్ వేర్ ఎన్నిరోజులు వాడాలో తెలుసా?

లోదుస్తులు ఎలా వాడాలి, ఎన్నిరోజులు వాడాలో చాలామందికి తెలియదు. ముఖ్యంగా జననేంద్రియాల వద్ద ఉపయోగించే అండర్ వేర్ శుభ్రంగా ఉండటం చాలా ముఖ్యం.. లేదంటే ఆరోగ్య సమస్యలు తప్పవు. మరి ఓ అండర్ వేర్ ఎంతకాలం వాడితే మంచిదో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 22 2026, 12:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అండర్ వేర్ ఎలా వాడాలి?
Image Credit : Gemini AI

అండర్ వేర్ ఎలా వాడాలి?

Underwear : చాలామంది సిగ్గు, బిడియంతో కొన్ని విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయరు... దీంతో కొన్నిసార్లు అనుకోని అనర్థాలు ఎదురవుతాయి. ఇలా లోదుస్తుల గురించి మాట్లాడేందుకు ఇబ్బందిపడేవారు చాలామంది ఉంటారు... అందుకే వాటి వాడకం గురించి అవగాహన ఉండదు. ముఖ్యంగా అండర్ వేర్ ఎలా వాడాలి? ఓ అండర్ వేర్ ఎన్నిరోజులు వాడాలి? అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది... లేదంటే చర్మ సమస్యలతో పాటు అనారోగ్యం తప్పదు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఓ అండర్ వేర్ ఎన్నిరోజులు వాడాలి?
Image Credit : Getty

ఓ అండర్ వేర్ ఎన్నిరోజులు వాడాలి?

మనం ధరించే బట్టల కింద అంటే చర్మానికి నేరుగా తాలేలా వేసుకునే దుస్తులను లోదుస్తులు (Innerwear) అంటారు. ఇలా పురుషులు, మహిళలు తమ సౌకర్యానికి తగ్గట్లుగా వివిధ రకాల లోదుస్తులు వాడతారు. శరీరం నుండి విడుదలయ్యే చెమటతో పాటు ఇతర రకాల ద్రవాలను ఈ ఇన్నర్ వేర్స్ పీల్చుకుంటాయి... కాబట్టి తొందరగా పాడయిపోతుంటాయి. అందుకే సాధారణ దుస్తుల్లా ఎక్కువరోజులు వాడకుండా వీటిని తరచూ మారుస్తుండాలి.

పురుషులు, మహిళలు అండర్ వేర్ ఉపయోగిస్తుంటారు... దీన్ని సున్నితమైన జననేంద్రియాల వద్ద వాడుతుంటారు. అంటే చెమటతో పాటు జననేంద్రియాల నుండి విడుదలయ్యే ద్రవాలను కూడా అండర్ వేర్ పీల్చుకుంటుంది. కాబట్టి తొందరగా పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే పురుషులు అయితే ఓ అండర్ వేర్ 6 నెలల నుండి ఏడాది వరకు వాడవచ్చు... అదే మహిళలు అయితే 3 నుండి 6 నెలలు వాడాలి... ఆ తర్వాత తప్పకుండా మార్చాలి.

Related Articles

Related image1
New Clothes: కొత్త దుస్తులు ఉతక్కుండా వేసుకుంటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Related image2
Clothes Stains: దుస్తులపై పడిన మొండి మరకలు ఇలా నిమిషాల్లో మాయం చేసేయండి
35
అండర్ వేర్ ఎక్కువరోజులు వాడితే ఏమవుతుంది?
Image Credit : Freepik

అండర్ వేర్ ఎక్కువరోజులు వాడితే ఏమవుతుంది?

అండర్ వేర్ చెమటతో పాటు జననేంద్రియాల ద్రవాలను పీల్చుకుంటుంది కాబట్టి బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా పెరుగుతాయి. వీటివల్ల జననేంద్రియాల వద్ద చర్మం దెబ్బతింటుంది... దురద, ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ఇతరరకాల వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే వాషింగ్ మెషిన్ లో వేసినా, చేతితో ఉతికినప్పటికీ అండర్ వేర్ ఎక్కువరోజులు వాడటం మంచిదికాదు. కాబట్టి సాధారణంగా ఒక అండర్‌వేర్‌ను 6 నెలల నుండి ఏడాది వరకు వాడిన తర్వాత పారేసి కొత్తవి కొనుక్కోవడం మంచిది.

45
ఎలాంటి అండర్ వేర్ వాడాలి?
Image Credit : ChatGPT

ఎలాంటి అండర్ వేర్ వాడాలి?

అండర్ వేర్ ను చాలా సున్నితమైన ప్రాంతాల్లో దరిస్తాం కాబట్టి ఎలాంటి ఫ్యాబ్రిక్ వాడాలన్నది చాలా ముఖ్యం. చెమటతో పాటు ఇతర ద్రవాలను పీల్చుకునేలా ఉండాలి, చర్మానికి హాని కలిగించకుండా ఉండాలి... కాబట్టి కాటన్ ఫ్యాబ్రిక్ అండర్ వేర్ లు వాడటం ఉత్తమం. ఇవి గాలి ఆడేలా చేసి చెమటను త్వరగా పీల్చుకుంటాయి. అలాగే ఉతికిన తర్వాత వీటిని నీడలో కాకుండా నేరుగా ఎండలో ఆరబెట్టడం వల్ల బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది.

55
ప్రతిరోజు అండర్ వేర్ ఉతకాలా?
Image Credit : Getty

ప్రతిరోజు అండర్ వేర్ ఉతకాలా?

అండర్‌వేర్‌ను కచ్చితంగా ప్రతిరోజూ (కనీసం రోజుకు ఒక్కసారైనా) మార్చాలి. ఇక వర్కవుట్స్ చేసినప్పుడు, జిమ్‌కు వెళ్లినప్పుడు లేదా ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల చెమట పట్టినప్పుడు రోజుకు రెండు సార్లు మార్చడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకే అండర్‌వేర్‌ను ఒకటి కంటే ఎక్కువ రోజులు వాడటం వల్ల చెమట, తడి చేరి బ్యాక్టీరియా, ఫంగస్ వేగంగా పెరుగుతాయి. ఒక్కసారి వాడిన తర్వాత అండర్ వేర్ ను శుభ్రంగా ఉతికి ఎండలో ఆరబెట్టాలన్నమాట.

ఇలా జరిగితే అండర్ వేర్ వెంటనే మార్చేయండి

ఎలాస్టిక్ సాగిపోయి, లూజ్ అయినప్పుడు.

బట్ట పల్చబడిపోయి లేదా చినిగిపోయినప్పుడు.

వేసుకున్నప్పుడు అసౌకర్యంగా అనిపించినప్పుడు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Air fryer: ఎయిర్ ఫ్రైయర్‌లో స్టీల్ గిన్నెలు వాడవచ్చా? వాడితే ఏమవుతుంది?
Recommended image2
Chicken: జ్వరం వచ్చినప్పుడు చికెన్ వంటకాలు తినవచ్చా? తింటే ఏమవుతుంది?
Recommended image3
Chepala Ulli Karam: ఆదివారం అదిరిపోయే చేపల ఉల్లికారం..లొట్టలేస్తారు అంతే..
Related Stories
Recommended image1
New Clothes: కొత్త దుస్తులు ఉతక్కుండా వేసుకుంటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
Recommended image2
Clothes Stains: దుస్తులపై పడిన మొండి మరకలు ఇలా నిమిషాల్లో మాయం చేసేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved