MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Sabudana: సగ్గుబియ్యం దేనితో తయారు చేస్తారు..? ఆరోగ్యానికి మంచిదేనా? ఉపవాసం తర్వాత ఎందుకు తినాలి?

Sabudana: సగ్గుబియ్యం దేనితో తయారు చేస్తారు..? ఆరోగ్యానికి మంచిదేనా? ఉపవాసం తర్వాత ఎందుకు తినాలి?

Sabudana: ఒంట్లో కాస్త నీరసంగా ఉంటే.. సగ్గుబియ్యం జావ తాగుతాం. దేవుడికి ఏదైనా పూజ చేసి.. రోజంతా ఉపవాసం ఉంటే.. తర్వాత సగ్గుబియ్యంతో చేసిన వంటకాలు మాత్రమే తినమని ఇంట్లో పెద్దలు చెబుతారు. అసలు.. ఇవి ఎలా తయారౌతాయి? వీటితో ప్రయోజనం ఏంటి?

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 12 2026, 09:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సగ్గుబియ్యం తింటున్నారా?
Image Credit : Freepik

సగ్గుబియ్యం తింటున్నారా?

మన దేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో సగ్గుబియ్యం ఉంటాయి. ఏదో ఒక రూపంలో సగ్గుబియ్యం తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా, మన దేశంలో ఉపవాసాలు ఉన్నప్పుడు లేదా వేసవి కాలంలో చలువ చేస్తుందని సగ్గుబియ్యంతో చేసిన జావ, ఖీర్ లేదా వడలను ఎక్కువగా తింటూ ఉంటాం. అసలు ఈ సగ్గుబియ్యం దేనితో తయారౌతాయి? ఇవి నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా? ఉపవాస సమయాల్లో దీనిని తీసుకోవాలని ఎందుకు చెబుతారు?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సగ్గుబియ్యం దేనితో తయారౌతాయి..?
Image Credit : Freepik

సగ్గుబియ్యం దేనితో తయారౌతాయి..?

చాలా మంది సగ్గుబియ్యం గోధుమలు లేదా బియ్యంతో తయారౌతాయని అనుకుంటారు. కానీ, ఇది నిజం కాదు. సగ్గుబియ్యం టపియోకా అనే కర్రపెండలం వేర్ల నుంచి వచ్చే పిండితో తయారౌతాయి. కర్ర పెండలం దుంపల నుంచి సేకరించిన పాలను ప్రాసెస్ చేసి, చిన్న గుండ్రని ముత్యాల లాంటి గింజలుగా మారుస్తారు. ఇవి పూర్తిగా కార్బోహైడ్రేట్లు, స్టార్చ్ తో నిండి ఉంటాయి.

33
సగ్గుబియ్యం నిజంగా హెల్దీనా..?
Image Credit : Freepik

సగ్గుబియ్యం నిజంగా హెల్దీనా..?

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అందువల్ల ఇది శరీరానికి క్షణాల్లో శక్తిని అందిస్తుంది. అయితే, ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి, ఇది పూర్తి స్థాయి సంపూర్ణ ఆహారం కాదు. అయితే, దీని వల్ల కొన్ని ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం కలుగుతాయి.

సులభంగా జీర్ణమవుతుంది: కడుపులో సమస్యలు ఉన్నప్పుడు లేదా అనారోగ్యం నుంచి కోలుకుంటున్నప్పుడు సగ్గుబియ్యం చాలా సులభంగా జీర్ణమై కడుపుకు హాయిని ఇస్తుంది.

శరీరానికి చలువ చేస్తుంది: ఆయుర్వేదం ప్రకారం ఇది శరీర వేడిని తగ్గించి, వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది.

బరువు పెరగడానికి, శక్తికి: తక్కువ సమయంలో ఎక్కువ శక్తి కావాల్సిన వారికి , బరువు పెరగాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

ఉపవాస సమయంలో దీనిని మాత్రమే ఎందుకు తీసుకోమని చెబుతారు? 

మన సంప్రదాయంలో ఉపవాసాల సమయంలో సగ్గుబియ్యం వంటకాలను విరివిగా వాడటానికి కొన్ని శాస్త్రీయ, ఆచారపరమైన కారణాలు ఉన్నాయి:

తక్షణ శక్తి : ఉపవాసాలు ఉన్నప్పుడు రోజంతా నీరసంగా ఉండకుండా, సగ్గుబియ్యంలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి వెంటనే శక్తిని అందించి యాక్టివ్‌గా ఉంచుతాయి.

కడుపు నిండుగా భావన: ఇది కడుపును నిండుగా ఉంచడమే కాకుండా, అజీర్తి సమస్యలు రాకుండా తేలికపాటి ఆహారంగా పనిచేస్తుంది.

సులభమైన వంటకాలు: ఉపవాస నియమాలకు అనుగుణంగా తక్కువ పదార్థాలతో, పాలు లేదా పెరుగుతో కలిపి వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Jewellery: పట్టు చీరలతో ఈ జ్యువెలరీ వేసుకుంటే అందరి చూపు మీవైపే!
Recommended image2
Cooking Tips: కూర వండే ముందు.. కూరగాయల్ని ఎలా శుభ్రం చేయాలి?
Recommended image3
Nita Ambani: స్వదేశీ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నీతా అంబానీ..బనారసి చీరలో లుక్ అదుర్స్
Related Stories
Recommended image1
Cooking Tips: ఇదొక్కటి రెండు చుక్కలు వేస్తే.. బెండకాయ జిగురు లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది..!
Recommended image2
Dal: కంది పప్పుకీ, ఎర్ర కంది పప్పుకీ తేడా ఏంటి? రెండింటిలో ఏది తింటే మంచిది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved