MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Life
  • Lord Vishnu: గద్ద మహావిష్ణువు వాహనంగా ఎలా మారింది? గరుత్మంతుడి కథ ఏమిటి?

Lord Vishnu: గద్ద మహావిష్ణువు వాహనంగా ఎలా మారింది? గరుత్మంతుడి కథ ఏమిటి?

Lord Vishnu: మహా విష్ణువు వాహనం గరుత్మంతుడు. అంటే గద్ద. ఎన్నో పక్షులు, జీవులు ఉండగా గద్దకు విష్ణువు వాహనంగా మారే అవకాశం ఎలా దక్కింది? దీని వెనుక పెద్ద పోరాట గాధే ఉంది. ఆ కథేంటో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 24 2026, 11:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గరుత్మంతుడి తల్లిదండ్రులు
Image Credit : Getty

గరుత్మంతుడి తల్లిదండ్రులు

గరుత్మంతుడు మహావిష్ణువు వాహనంగా పేరు పొందాడు. మహా విష్ణువుతో పాటు గరుత్మంతుడిని కూడా పూజిస్తారు. ఎన్నో పశు పక్ష్యాదులు, జీవులు ఉండగా మహావిష్ణువుకు గరుత్మంతుడే ఎలా వాహనంగా మారాడు? దీని వెనకాల ఎంతో కథ ఉంది. గరుత్మంతుడు అంటే గద్ద. ఋషి కశ్యుపుడు, వినుత అనే స్త్రీకి జన్మించిన కొడుకు గరుడుడు. కశ్యప మహర్షి మరొక భార్య కద్రు కూడా ఉంది. ఓరోజు కద్రూ, వినుతకి మధ్య వాదన వచ్చింది. ఆ వాదనలో కద్రు గెలిచింది. దాంతో వినుత కద్రుకి దాసిగా మారాల్సి వచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తల్లి బానిసత్వం చూసి

తల్లి బానిసత్వం చూసి

తల్లి వేరొక మహిళ దగ్గర బానిసగా ఉండడం చూసి గరుడుడు తట్టుకోలేకపోయాడు. కద్రూకు వేయి మంది నాగులు కొడుకులుగా పుట్టారు. ఆ నాగులు గరుడుడితో దేవతల వద్దన్న అమృతాన్ని తీసుకొస్తే నీ తల్లిని బానిసత్వం నుంచి విడిచిపెడతామని చెబుతారు. దాంతో తల్లి విముక్తి కోసం గరుడుడు అమృతం తేవడానికి దేవలోకానికి బయలుదేరుతాడు. ఆ పని చేయడం చాలా కష్టమని తెలిసినా తల్లి స్వేచ్ఛ కోసం తన ప్రాణాలనే పణంగా పెడతాడు.

Related Articles

Related image1
Jobs in Germany: జర్మనీలో భారతీయులకు లక్షల జీతాలతో భారీగా ఉద్యోగ అవకాశాలు, వెంటనే అప్లై చేయండి
Related image2
Vijay Rashmika: విజయ్ దేవరకొండ జీవితంలో పెళ్లే చేసుకోనని చెప్పాడు కానీ.. విజయ్ మేనమామ కామెంట్స్
34
దేవతలతోనే యుద్ధం
Image Credit : Getty

దేవతలతోనే యుద్ధం

గరుత్మంతుడు ఆకాశంలో ఎగురుతూ స్వర్గలోకానికి వెళుతూ ఉంటాడు. దారిలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. అయినా వాటిని తన శక్తితో, ధైర్యంతో అధిగమిస్తాడు. ఎలాగైనా తల్లిని ఆ బానిసత్వం నుంచి విముక్తి చేయాలన్నదే ఆయన లక్ష్యం. ఆ లక్ష్యం కోసం ఎన్నో పోరాటాలు చేస్తాడు. చివరికి స్వర్గలోకానికి చేరుతాడు. అక్కడ దేవతలతో కూడా యుద్ధం చేయాల్సి వస్తుంది. తల్లి కోసం దేవతలతో కూడా యుద్ధం చేసి చివరికి అమృతాన్ని సంపాదిస్తాడు.

44
మెచ్చిన మహావిష్ణువు
Image Credit : Ubuy

మెచ్చిన మహావిష్ణువు

అమృతం తీసుకుని తిరిగి తల్లి దగ్గరికి వస్తూ ఉంటాడు గరుత్మంతుడు. అప్పుడు మహా విష్ణువు ఆ గరుడుడి ధైర్యం, శక్తి చూసి ఎంతో సంతోషిస్తాడు. గరుత్మంతుడిని ఆపి ఏమైనా వరాలు కావాలా? అని అడుగుతాడు. అప్పుడు గరుత్మంతుడు విష్ణువుకు భక్తితో నమస్కరించి నేను మీకు వాహనంగా మారతాను అని చెబుతాడు. వెంటనే విష్ణువు ఆ కోరికను అంగీకరిస్తాడు. అప్పటినుంచి గరుడుడినే తన వాహరంగా స్వీకరిస్తాడు. విష్ణువు ఎక్కడికి వెళ్లినా వెంట గరుత్మంతుడు ఉండాల్సిందే. ఇక గరుడుడు అమృతాన్ని తీసుకెళ్లి తన సవతి సోదరులైన నాగులకు ఇస్తాడు. కానీ వారు దాన్ని తాగేలాపే ఇంద్రుడు వచ్చి తిరిగి లాక్కొని వెళ్ళిపోతాడు. కానీ ఇచ్చిన మాట ప్రకారం అమృతం తెచ్చాడు కాబట్టి గరుత్మంతుడి తల్లిని విడిచి పెట్టేస్తారు నాగులు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆధ్యాత్మిక విషయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ghee: రోజూ నెయ్యి తింటున్నారా? ఈ సమస్యలు ఉన్నవారు జాగ్రత్త!
Recommended image2
Moles: మీకు ఇష్టం లేని పుట్టుమచ్చలను ఆపిల్ సిడర్ వెనిగర్‌తో తొలగించుకోవచ్చా?
Recommended image3
Hair Growth: గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? ఇందులో నిజమెంత?
Related Stories
Recommended image1
Jobs in Germany: జర్మనీలో భారతీయులకు లక్షల జీతాలతో భారీగా ఉద్యోగ అవకాశాలు, వెంటనే అప్లై చేయండి
Recommended image2
Vijay Rashmika: విజయ్ దేవరకొండ జీవితంలో పెళ్లే చేసుకోనని చెప్పాడు కానీ.. విజయ్ మేనమామ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved